alcatel launches Alcatel V3 Ultra with stylus pen under budget price in India
Alcatel V3 Ultra స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం రెండు నెలలుగా టీజింగ్ చేసిన ఆల్కాటెల్, ఎట్టకేలకు ఈ ఫోన్ ను ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. దశాబ్ద కాలం తర్వాత ఆల్కాటెల్ వి3 సిరీస్ తో కంపెనీ మళ్ళీ ఇండియాలో రీ ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు, ఈసారి దూకుడుగా తన స్మార్ట్ ఫోన్ లను ప్రవేశపెట్టింది. ఈ సిరీస్ నుంచి లాంచ్ చేసిన ఫోన్ లలో వి3 అల్ట్రా ఫోన్ ను బడ్జెట్ ధరలో స్టయిల్స్ పెన్ తో లాంచ్ చేసింది.
ఆల్కాటెల్ వి3 అల్ట్రా స్మార్ట్ ఫోన్ బేసిక్ (6GB + 128GB) వేరియంట్ ను రూ. 19,999 రూపాయల ధరతో అందించింది. అలాగే, ఈ ఫోన్ (8GB + 128GB) వేరియంట్ ను రూ. 21,999 రూపాయల ధరతో అందించింది. ఈ ఫోన్ జూన్ 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ మొదటి సేల్ ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ ను గొప్ప లాంచ్ ఆఫర్స్ తో కూడా అందించింది. ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ లేదా రూ. 2,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ లను అందించింది. ఈ ఫోన్ ను ICICI, SBI, Axis మరియు HDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనే వారికి ఈ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. లేదా, ఈ ఫోన్ ను ఎక్స్ చేంజ్ ఆఫర్ తో తీసుకునే వారికి రూ. 2,000 అదనపు డిస్కౌంట్ బోనస్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 17,999 రూపాయల ప్రారంభ ధరకే లభిస్తుంది.
Also Read: లేటెస్ట్ Cinematic Dolby Soundbar పై భారీ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్.!
ఆల్కాటెల్ వి3 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను సెగ్మెంట్ ఫస్ట్ స్టయిల్స్ ఫోన్ గా అందించింది. ఈ ఫోన్ లో స్టయిల్స్ పెన్ సపోర్ట్ కలిగిన 6.8 ఇంచ్ పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ పేపర్ లాంటి ఫీల్ అందించే ఫీచర్ తో వస్తుంది మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో పాటు FHD+ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ప్రత్యేకమైన 4 ఇన్ వన్ డిస్ప్లే మోడ్స్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఆల్కాటెల్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 5G చిప్ సెట్ తో పని చేస్తుంది. ఇందులో 8GB ఫిజికల్ ర్యామ్, 8GB ర్యామ్ ఎక్స్ ప్యాన్షన్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ లో ఫిజికల్ SIM మరియు eSIM సపోర్ట్ ను కూడా అందించింది.
ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2MP మ్యాక్రో కెమెరా ఉంటాయి. అంతేకాదు, ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ నోయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ మరియు DTS X సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో కెమెరాలు కలిగి ఉంటుంది.
ఈ ఆల్కాటెల్ స్మార్ట్ ఫోన్ IP54 డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5010 mAh బిగ్ బ్యాటరీ కూడా అందించింది. ఈ ఫోన్ బాక్స్ లో మొబైల్ ఫోన్, స్టయిల్స్ పెన్, 33W ఛార్జర్ మరియు అందమైన బ్యాక్ కవర్ ను ఆఫర్ చేస్తున్నట్లు ఆల్కాటెల్ పేర్కొంది.