Realme GT 7 రాకతో Realme GT 6 ప్రైస్ భారీగా తగ్గించిన రియల్ మీ.!

Updated on 27-May-2025
HIGHLIGHTS

Realme GT 6 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు 30 వేల రూపాయల కంటే తక్కువ ధరకే లభిస్తుంది

రియల్ మీ నిర్వహించిన ప్రత్యేకమైన కార్యక్రమం నుంచి Realme GT 7 సిరీస్ ఫోన్ లను విడుదల చేసింది

కొత్త ఫోన్స్ రాకతో పాత జనరేషన్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ కూడా అందించింది

ఈరోజు ఫ్రాన్స్ రాజధాని ఇటలీలో రియల్ మీ నిర్వహించిన ప్రత్యేకమైన కార్యక్రమం నుంచి Realme GT 7 సిరీస్ ఫోన్ లను విడుదల చేసింది. ఈ సిరీస్ నుంచి కొత్త ఫోన్స్ రాకతో పాత జనరేషన్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ కూడా అందించింది. రియల్ మీ అందించిన ఈ ఆఫర్స్ తో Realme GT 6 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు 30 వేల రూపాయల కంటే తక్కువ ధరకే లభిస్తుంది.

Realme GT 6 : ఆఫర్ ప్రైస్

రియల్ మీ జిటి 6 స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 40,999 ప్రారంభ ధరతో గత సంవత్సరం జూన్ నెలలో లాంచ్ అయ్యింది. అయితే, ఈ రియల్ మీ ఈ ఫోన్ ను ఈరోజు భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 29,999 రూపాయల అతి తక్కువ ధరకు ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్ పై రియల్ మీ అందించిన డిస్కౌంట్ మరియు రూ. 1,000 డిస్కౌంట్ కూపన్ తో ఈ ఆఫర్ ధరకు లభిస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ఆఫర్ ను ఫ్లిప్ కార్ట్ అఫీషియల్ సైట్ నుంచి అందించింది. అయితే, ఈ డీల్ ప్రైస్ నాలుగు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందని రియల్ మీ తెలిపింది. అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తున్న ప్రైస్ తో పోలిస్తే కూడా ఈ ఫోన్ రియల్ మీ వెబ్సైట్ నుంచి చవక ధరకు లభిస్తుంది.

Also Read: Alcatel V3 Classic మరియు V3 Pro రెండు బడ్జెట్ ఫోన్స్ లాంచ్ చేసిన అల్కాటెల్.!

Realme GT 6 : ఫీచర్స్

రియల్ మీ జిటి 6 స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ వేగవంతమైన Snapdragon 8s Gen 3 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఇది TSMC 4nm ప్రోసెసర్ మరియు దానికి జతగా 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి. ఈ ఫోన్ 120W SUPERVOOC అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5500 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ realme UI 5.0 సాఫ్ట్ వేర్ పై Android 14 OS తో నడుస్తుంది. అయితే, ఈ ఫోన్ వెంటనే ఆండ్రాయిడ్ 15 OS కి అప్డేట్ అవుతుంది.

ఈ ఫోన్ లో 6.78 ఇంచ్ 8T LTPO స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది Dolby Vision, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 10 bit ప్యానల్ ను ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ 50MP Sony LYT-808 మెయిన్, 8MP Sony IMX355 వైడ్ యాంగిల్ మరియు 50MP Samsung S5KJN5 టెలిఫోటో సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో 32MP Sony IMX615 సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 60FPS తో 4K రికార్డ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :