ఇండియాలో Redmi Note 9 సిరీస్ అమ్మకాలు రేపటి నుండి మొదలుకానుంది

ఇండియాలో Redmi Note 9 సిరీస్ అమ్మకాలు రేపటి నుండి మొదలుకానుంది

షావోమి రెడ్మి నోట్ 9 ప్రో మరియు రెడ్మి నోట్ 9 ప్రో మాక్స్‌ తో పాటు  మార్చి నెలలో ప్రకటించింది. అయితే, కరోనావైరస్ వ్యాప్తి కారణంగా, ఫోన్ల అమ్మకాలు ఇప్పటి వరకు వాయిదా పడ్డాయి. షావోమి, తన రెడ్మి నోట్ 9 ప్రో స్మార్ట్ ఫోన్ను మే 5 నుంచి భారతదేశంలో సేల్  చేయనున్నట్లు ప్రకటించింది. ఇది అమెజాన్ ఇండియా మరియు మి ఇండియా స్టోర్లలో విక్రయించబడుతుంది.

అదనంగా, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుదారులకు మరియు EMI ఆప్షన్ కింద ఉంచిన ఆర్డర్ల కోసం రూ .1,000 అదనపు తగ్గింపును అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. రెడ్మినోట్ 9 ప్రో మాక్స్ విషయానికొస్తే, దేశంలో రెడ్మి నోట్ 9 ప్రో యొక్క హై ఎండ్  వెర్షన్‌ను  ఎప్పుడు సెల్ చేయనున్నదన్న విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు.

షావోమి రెడ్మి నోట్ 9 ప్రో : ధర మరియు లభ్యత

4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో బేస్ వేరియంట్ నోట్ 9 ప్రో రూ .13,999 వద్ద మొదలవుతుంది, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఇతర వేరియంట్ ధర రూ .16,999.

ఫోన్ మూడు రంగులలో వస్తుంది – అరోరా బ్లూ, గ్లేసియర్ వైట్ మరియు ఇంటర్స్టెల్లార్ బ్లాక్. ఇది మే 5 నుండి అమెజాన్ ఇండియా మరియు మి ఇండియా స్టోర్లలో లభిస్తుంది.

రెడ్మి నోట్ 9 ప్రో : ప్రత్యేకతలు

ఈ రెడ్మి నోట్ 9 ప్రో స్మార్ట్ ఫోను, ఒక 6.67 అంగుళాల పరిమాణంగల డాట్ డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఇది 2400×1080 పిక్సెళ్ళు అంటే FHD+ రిజల్యూషన్ తో వస్తుంది మరియు గరిష్టంగా 450 నిట్స్ బ్రైట్నెస్ అందిచే సామర్ధ్యంతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లేని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 యొక్క ప్రొటెక్షన్ తో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్,  కొత్త ప్రాసెసర్ అయినటువంటి స్నాప్ డ్రాగన్ 720G SoC శక్తితో పనిచేస్తుంది. ఇది 8nm ఫ్యాబ్రికేషన్ తో వస్తుంది మరియు వేగంగా పనిచేస్తుంది. ఇది 618GPU తో వస్తుంది కాబట్టి గ్రాఫిక్స్ బాగా అనిపిస్తాయి మరియు గేమింగ్ మరింత ఆహ్లాదంగా ఉంటుంది. రెడ్మి నోట్ 9 ప్రో 4GB +64GB మరియు 6GB + 128GB వేరియంట్లలో లభిస్తుంది. 

ఇక కెమేరాల విషయానికి వస్తే, రెడ్మి నోట్ 9 ప్రో వెనుక 48MP+8MP+5MP+2MP గల క్వాడ్ కెమేరా సెటప్పుతో వస్తుంది. ఇందులో 48MP ప్రధాన కెమేరా కాగా, 8MP వైడ్ యాంగిల్, 5MP మ్యాక్రో మరియు 2MP పోర్ట్రైట్ సెన్సార్లతో జతగా వస్తుంది. ఇక ముందుభాగంలో, రెడ్మి నోట్ 9 ప్రో ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమేరాని అందించింది. రెడ్మి నోట్ 9 ప్రో ఒక 5020mAh బ్యాటరీని, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది మరియు 18W ఛార్జర్ ని బాక్సుతో పాటుగా తీసుకువస్తుంది. ఈ ఫోన్ లేటెస్ట్ MIUI 11 స్కిన్ పైనఆండ్రాయిడ్ 10 తో విడుదల చేసింది.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo