ఈరోజు విడుదలైన VIVO V17 గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ఫ్యాక్ట్స్

Updated on 09-Dec-2019
HIGHLIGHTS

అత్యధికంగా 800 nits బ్రైట్నెస్ తో మంచి పిక్చర్ క్వాలిటీని పొందుతారు.

వివో సంస్థ, ఈరోజు ఇండియాలో తన వివో V17 స్మార్ట్ ఫోన్ను ఒక 48MP ప్రధాన కెమెరా మరియు వేగవంతమైన స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్ తో విడుదల చేసింది. కేవలం ఇది మాత్రమే కాకుండా మరెన్నో గొప్ప స్పెక్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ విడుదలయ్యింది. డిసెంబర్ 17 వ తేదీ నుండి మొదటి సరిగా అమ్మకాలకు రానున్న ఈ స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసులుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాను ఇక్కడ అందిస్తున్నాను.

1. ఈ వివో V17 ఒక 6.44 అంగుళాల FHD + డిస్ప్లేతో అందించబడుతుంది. దీనితో, మీరు అత్యధికంగా 800 nits బ్రైట్నెస్ తో మంచి పిక్చర్ క్వాలిటీని పొందుతారు.

2. ఈ స్మార్ట్ ఫోన్ అతి సన్నని అంచులు కలిగి ఉంటుంది మరియు E3 సూపర్ AMOLED  డిస్ప్లేతో ఉంటుంది. అధనంగా, ఈ ఫోన్ ఒక అతిసన్నని పంచ్ హోల్ తో వస్తుంది.  

3. వివో V17 వెనుకభాగంలో  48MP + 8MP + 2MP + 2MP  క్వాడ్ కెమేరా సెటప్పుతో వస్తుంది. ఇందులోని 48MP ప్రధాన కెమేరా f /1.8 అపర్చరుతో వస్తుంది. ఇక ఇందులోని 8MP సూపర్ వైడ్ యాంగిల్ సెన్సార్ f /2.2 అపర్చరుతో వస్తుంది మరియు  ఒక  2MP కెమేరా f /2.2 అపర్చరుతో  పోర్ట్రైట్ల కోసం డెప్త్ సెన్సారుగా ఉపయోగపడుతుంది. చివరగా, మరొక 2MP కెమేరా f /2.4 అపర్చరుతో మాక్రో షాట్ల కోసం ఉపయోగపడుతుంది.

4. ముందుభాగంలో ఒక గొప్ప 32MP పాప్ అప్ సెల్ఫీ కెమేరాతో మంచి సెల్ఫీలను తీసుకోవచ్చు.  అంతేకాకుండా, HDR తో వీడియోలను కూడా తీసుకోవచ్చు.   

5. ఈ ఫోన్ ఒక 4,500 mAh బ్యాటరీతో వస్తుంది మరియు ఇది ఒక డ్యూయల్ ఇంజన్ ఫాస్ట్ ఛార్జ్ టెక్నలాజితో వస్తుంది. ఈ టెక్నాలజీతో ఈ ఫోన్ను చాలా వేగంగా 100% ఛార్జింగ్ చేసుకోవచ్చు మరియు ఒక 8వాట్స్ ఛార్జర్ బాక్స్ తో పాటుగా వస్తుంది.

6. ఈ వివో V 17 ఒక క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 675 ఆక్టా కోర్ ప్రాసెసరుతో వస్తుంది. ఇది గరిష్టంగా 2.0 GHz వరకూ క్లాక్ స్పీడ్ అందిస్తుంది. అలాగే, స్పీడుగా పనిచేయగల LPDDR4X  RAM తో వస్తుంది. ఇది 11nm సాంకేతికతతో వస్తుంది మరియు జతగా 8GB ర్యామ్ తో వస్తుంది. అంతర్గతంగా, ఈ స్మార్ట్ ఫోన్ 128GB GB  స్టోరేజిని అఫర్ చేస్తోంది.

7. ముఖ్యంగా, ఈ ఫోన్ యొక్క స్క్రీన్ 100% DPI-3 కలర్ గ్యాముట్ తో వస్తుంది. దానితో మీరు ఉన్నతమైన మరియు ఉట్టిపడే కళాత్మకమైన రంగులను చూడవచ్చు. అధనంగా, మీ కళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా 40% తక్కువ బ్లూ కలర్ తో ఈ డిస్ప్లే వస్తుంది. ఈ ఫోన్ యొక్క డిస్ప్లేలో కోత్త తరం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కూడా తీసుకువస్తుంది. 

8.  ఈ ఫోన్, 8.54MM మందంతో సన్నగా మరియు గ్లేసియర్ ఐస్ మరియు మిడ్నైట్ ఓషన్ వంటి రెండు రంగులలో లభిస్తుంది. సౌండ్ పరంగా చూస్తే, ఇది Hi-Res   సౌండ్ టెక్నాలజీ తో వస్తుంది.  

9. ఇందులో, సెక్యూరిటీ ఫీచర్లుగా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ మరియు పేస్ అన్లాక్ ఫీచర్లను అందించారు. అంటే ఇది ప్రస్తుత తరానికి స్టైల్ మరియు సేఫ్టీ పరంగా గొప్పగా ఉంటుంది.

10.వివో V17  వేరియంట్ ధర    

1. VIVO V17-  8GB RAM + 128 GB స్టోరేజి ధర – 20,990

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :