జూన్ 11 న షావోమి తన Mi ల్యాప్ టాప్స్ లాంచ్ కావచ్చు : ధర ప్రత్యేకతలు మరియు మరిన్ని వివరాలు..

జూన్ 11 న షావోమి తన Mi ల్యాప్ టాప్స్ లాంచ్ కావచ్చు : ధర ప్రత్యేకతలు మరియు మరిన్ని వివరాలు..
HIGHLIGHTS

ఇతర ల్యాప్‌టాప్ బ్రాండ్‌లకు షాట్ ఔట్ కూడా ఇచ్చింది.

మి బ్యానర్ క్రింద RedmiBook 13 ల్యాప్‌ టాప్‌ను భారతదేశంలో విడుదల చేయవచ్చు.

షావోమి, భారతదేశంలో తొలిసారిగా తన మి ల్యాప్‌టాప్స్ ను లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది మరియు దీని పైన లేటెస్ట్ గా వచ్చిన రూమర్ నిజమైతే, దీని లాంచ్ ఈవెంట్ జూన్ 11 న జరగవచ్చు. షావోమి గత వారం నుండి అధికారికంగా మి ల్యాప్‌ టాప్స్ గురించి టీజింగ్ కూడా ప్రారంభించింది. Dell , HP , Lenova , Asus మరియు Acer ‌తో సహా భారతదేశంలోని ఇతర ల్యాప్‌టాప్ బ్రాండ్‌లకు షాట్ ఔట్ కూడా ఇచ్చింది.

ప్రముఖ లీక్ స్టర్ ఇషాన్ అగర్వాల్ ను ఉదహరించిన 91 మొబైల్స్ ఇచ్చిన ప్రత్యేక నివేదిక ప్రకారం, షావోమి మి బ్యానర్ క్రింద RedmiBook 13 ల్యాప్‌ టాప్‌ను భారతదేశంలో విడుదల చేయవచ్చు. ఇది భారతదేశంలో సంస్థ యొక్క మొట్టమొదటి ల్యాప్‌టాప్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నందున, చైనా సక్సెస్ సాధించిన రెడ్‌మిబుక్ ల్యాప్‌ టాప్‌ను రీబ్రాండ్ చేయడం ద్వారా ల్యాప్‌టాప్ మార్కెట్లో నడుస్తున్న షావోమి ఇండియాలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. కానీ,  ఇది ఇంకా ధృవీకరించబడనప్పటికీ, రెడ్‌మిబుక్ 13 యొక్క 2019 వెర్షన్ భారతదేశంలో ప్రకటించబడే అవకాశం ఉందని ఈ నివేదిక పేర్కొంది.

షావోమి రాబోయే ల్యాప్‌టాప్‌లోని కొన్ని ముఖ్య లక్షణాలను టీజ్ చేయడం ప్రారంభించింది మరియు కంపెనీ భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ నోట్‌బుక్స్ తీసుకువచ్చే అవకాశం ఉండవచ్చు. మోడల్ నంబర్  XMA1901 మరియు XMA1904 కలిగిన రెండు నోట్‌బుక్స్ బ్లూటూత్ SIG చేత ధృవీకరించబడినట్లు ప్రత్యేక ట్వీట్‌లో సూచించిన అగర్వాల్ ఈ విషయాన్ని సూచించారు. ఆసక్తికరంగా, XMA1904 మోడల్ చైనాలో ఇంకా ప్రకటించబడలేదు మరియు XMA1901 చైనా నుండి వచ్చిన రెడ్‌మిబుక్ 14 తో సమానంగా ఉంటుంది.

ఈ ల్యాప్‌టాప్‌లపై నిర్దిష్ట వివరాలు ప్రస్తుతం తెలియనప్పటికీ, రాబోయే షావోమి ల్యాప్‌టాప్స్ 1 సి ఫాస్ట్ ఛార్జింగ్ సొల్యూషన్‌కు మద్దతు ఇస్తాయని, ఇది 35 నిమిషాల్లో 0-50 శాతం వరకూ ల్యాప్‌టాప్‌ను రీఛార్జ్ చేయగలదు.

షావోమి RedmiBook 13 ప్రత్యేకతలు  మరియు ధర

షావోమి రెడ్‌మిబుక్ 13 లో 13.3-అంగుళాల FHD +(1920 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ యాంటీ గ్లేర్ డిస్ప్లే మూడు వైపులా సన్నని  4.65 MM బెజెల్స్‌తో ఉంటుంది. ఈ డిస్ప్లే 250 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ 178-డిగ్రీల వైడ్-వ్యూయింగ్ యాంగిల్‌ను అందిస్తుంది. ఇది 16.3 MM సన్నని మరియు  కేవలం 1.23 కిలోగ్రాముల బరువుతో ఉంటుంది.

ఈ ల్యాప్‌టాప్ రెండు సెట్ల కాన్ఫిగరేషన్ ఎంపికలలో వస్తుంది – 10th gen Intel Core i5-10510U ప్రాసెసర్ మరియు 10th gen Intel Core i7-10510U చిప్‌సెట్‌తో. ఇది 2GB NVIDIA GeForce MX250 గ్రాఫిక్‌లతో పాటు 8GB DDR4 RAM మరియు 512GB SSD స్టోరేజితో జత చేయబడింది.

రెడ్‌మిబుక్ 13 చిక్‌లెట్ కీబోర్డ్‌తో 1.3 మిమీ కీస్ట్రోక్ ట్రావెల్‌తో పాటు మైక్రోసాఫ్ట్ PTP సపోర్టెడ్ ట్రాక్‌ప్యాడ్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది రెండు యుఎస్‌బి 3.1 పోర్ట్‌లు, ఒక HDMI పోర్ట్ మరియు 3.5 MM హెడ్‌ఫోన్ జాక్‌తో వస్తుంది.

ఇది 40 వాట్ల-గంటల బ్యాటరీ సెల్‌తో అమర్చబడి 1 సి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది, ఇది ల్యాప్‌టాప్‌ను 0-50% నుండి 35 నిమిషాల్లో ఛార్జ్ చేయగలదు. ల్యాప్‌టాప్ 65W పవర్ అడాప్టర్‌తో కూడి ఉంటుంది.

Core i5 ప్రాసెసర్‌తో బేస్ వేరియంట్ కోసం రెడ్‌మిబుక్ CNY 13  4,499 (రూ. 47,490), Core i7 వేరియంట్‌ CNY 5199 (రూ. 54,800) ధర  వద్ద ప్రారంభమవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo