HP OmniBook 5 with 34 hours long battery life and fast processor
HP OmniBook 5: యుఎస్ బేస్డ్ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ HP ఇండియాలో కొత్త ల్యాప్ టాప్ లాంచ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ ల్యాప్ టాప్ ని ఇప్పటి వరకు ఎన్నడూ చూడని విధంగా 34 గంటల బ్యాటరీ లైఫ్ సపోర్ట్ తో అందిస్తున్నట్లు కంపెనీ టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ ల్యాప్ టపా యొక్క కీలకమైన ఫీచర్స్ తో కంపెనీ టీజింగ్ మొదలు పెట్టింది. ఈ అప్ కమింగ్ HP ల్యాప్ టాప్ ఎటువంటి ఫీచర్స్ తో మార్కెట్ లో అడుగుపెడుతోందో చూద్దామా.
గత నెల 20వ తేదీ తైపీ లో జరిగిన 2025 Computex గ్లోబల్ ఈవెంట్ నుంచి హెచ్‌పీ తన ఓమ్ని బుక్ 5 సిరీస్ ను పరిచయం చేసింది. ఇప్పుడు ఈ ల్యాప్ టాప్ ను ఇండియాలో లాంచ్ చేయడానికి సిద్ధం అయ్యింది. ఈ ల్యాప్ టాప్ ను Next Gen AI PC గా అందించింది. అయితే, హెచ్‌పీ అప్ కమింగ్ ల్యాప్ టాప్ లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు.
కానీ ఇదే నెలలో ఈ ల్యాప్ టాప్ ను లాంచ్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వస్తే ఇది నిజం అనడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ ను ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి తో అమెజాన్ టీజింగ్ చేస్తోంది. అంటే, ఈ ల్యాప్ టాప్ లాంచ్ తర్వాత అమెజాన్ నుంచి సేల్ సేల్ కి అందుబాటులోకి వస్తుందని క్లియర్ చేసింది.
Also Read: OnePlus 13s కాంపాక్ట్ సైజులో పవర్ ఫుల్ ఫీచర్స్ తో వచ్చింది: ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
ఈ హెచ్‌పీ బుక్ 5 ల్యాప్ టాప్ ని చాలా స్లీక్ డిజైన్ తో అందిస్తోంది. అయితే, ఇది లాంగ్ బ్యాటరీ మరియు పావుర ఫుల్ ప్రోసెసర్ కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ క్వాల్కమ్ Snapdragon X1-26-100 ప్రోసెసర్ తో లాంచ్ చేస్తోంది. ఇది ఆక్టాకోర్ ప్రోసెసర్ మరియు HP AI కంపానియన్ మరియు Copilot+PC తో జతగా వస్తుంది. ఇది సెకనుకు 45 ట్రిలియన్ ఆపరేషన్ నిర్వహించే శక్తిని కలిగి ఉంటుంది మరియు ఇది Apple M1 కంటే 3.1 రేట్లు వేగంగా ఉంటుందని HP గొప్ప చెబుతోంది.
ఈ హెచ్‌పీ ల్యాప్ ట్యాప్ 300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 14 ఇంచ్ మైక్రో ఎడ్జ్ OLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ స్క్రీన్ 2K రిజల్యూషన్ కలిగి గొప్ప విజువల్స్ అందిస్తుందని హెచ్‌పీ తెలిపింది. ఇందులో 34 గంటల సుదీర్ఘమైన బ్యాటరీ లైఫ్ అందించే గొప్ప బ్యాటరీ ఉంటుందిట. అంతేకాదు, ఈ ల్యాప్ టాప్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కేవలం 30 నిమిషాల ఛార్జ్ తో 50% వరకు బ్యాటరీ ఛార్జ్ అవుతుందని హెచ్‌పీ చెబుతోంది. ఇందులో హెచ్‌పీ ట్రూ విజన్ 1080p FHD కెమెరా, థర్మల్ నోయిస్ రిడక్షన్ మరియు హెచ్‌పీ ఆడియో బూస్ట్ 2.0 వంటి మరిన్ని ఫీచర్స్ కూడా ఉంటయని హెచ్‌పీ ఈ అప్ కమింగ్ ల్యాప్ టాప్ గురించి గొప్ప చెబుతోంది.