48MP +13MP+8MP కెమేరా 10X జూమ్ ఇంకా మరిన్ని ప్రత్యేకతలు OPPO Reno 10X జూమ్ స్మార్ట్ ఫోన్ సొంతం

48MP +13MP+8MP కెమేరా 10X జూమ్ ఇంకా మరిన్ని ప్రత్యేకతలు OPPO Reno 10X జూమ్ స్మార్ట్ ఫోన్ సొంతం
HIGHLIGHTS

ఇది శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 855 చిప్సెట్ శక్తితో 6GB / 128GB మరియు 8GB / 256GB వేరియంట్లతో వస్తుంది.

ప్రస్తుతం ఒక ఫోనులో ఏమేమి ఫీచర్లు ఉండాలని ఎవరినడిగినా చెప్పే ఒకేఒక్కమాట కెమేరా మరియు ప్రాసెస్. అందుకోసమే, OPPO తన సరికొత్త స్మార్ట్ ఫోన్ అయినటువంటి Reno 10X జూమ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ను, ఈ విభాగాల్లో చాల పటిష్టంగా అందించింది. అంతేకాదు, ఇంకా ఎన్నో ట్రెండీ ఫీచర్లను ఈ స్మార్ట్ ఫోనులో   అందించింది. మరింకెందుకు ఆలశ్యం ఈ ఫోనుగురించి తెలుసుకుందామా?     

ఒప్పో రెనో 10X జూమ్ ఎడిషన్ : ప్రత్యేకతలు

OPPO రెనో 10X జూమ్ HDR 10+ కంటెంట్ మద్దతు మరియు 93.1 శాతం బాడీ టూ స్క్రీన్ రేషియాతో కాస్తుంది. ఇందులో ఒక పెద్ద 6.6 అంగుళాల AMOLED డిస్ప్లేని అందించారు. ఈ ఫోన్ ముందు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 తో భద్రపరచబడింది. ఇది శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 855 చిప్సెట్  శక్తితో 6GB / 128GB మరియు 8GB / 256GB వేరియంట్స్ మరియు ఓషియన్ గ్రీన్ మరియు జెట్ బ్లాక్ వాటి రంగుఎంపికలతో కొనుగోలు చేయవచ్చు.

కెమెరా విభాగంలో, ఈ ఫోన్ వెనుక F / 1.7 ఎపర్చరు గల ఒక 48 మెగాపిక్సెల్స్ ప్రధాన సెన్సార్ ఉంది, ఇది ఒక సోనీ IMX586 సెన్సారుతో పాటుగా ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్పుతో ఉంది మరియు మొరొక 8-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ మరియు మూడవ 13 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్లను కలిగిఉంది. ఈ కెమెరా సంస్థ యొక్క 10X హైబ్రిడ్ జూమ్ టెక్నాలజీతో లోడ్ చేయబడింది మరియు ఇది OIS, అల్ట్రా నైట్ మోడ్ 2.0 వంటి లక్షణాలు కలిగి ఉంది. ఈ ఫోన్  ముందు ఒక 16MP సెల్ఫీ కెమేరాని ఒక సరి కొత్త రూపంతో అందించింది.

దీని కెమేరాతో అద్భుతాలను చెయ్యొచ్చు. ఇది పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ద్వారా అందించబడింది కాబట్టి 10X అంటే 10 రేట్ల వరకు జూమ్ చేసుకునే అవకాశాన్నిఇస్తుంది. వివరంగా పరిశీలిస్తే, మీకు చాల దూరంలోవున్న వాటిని కూడా జూమ్ చేసి అతిదగ్గరగా ఫోటోలను తీసుకోవచ్చు.     

ఇక బ్యాటరీ గురించి మాట్లాడితే, ఈ ఫోన్ 4065mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది VOOC 3.0 ఫాస్ట్ ఛార్జింగుకు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ హైపర్ బూస్ట్ 2.0 ను కలిగి ఉంది, ఇది గేమ్స్, ఆప్స్  మరియు పెరఫార్మెన్స్ ని ప్రోత్సహిస్తుంది. ఇందులో, OS గురించి చూస్తే,ఇది కలర్ OS 6.0 తో పనిచేస్తుంది.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo