మనం 4 జీ నెట్ వర్క్ పరిధిలో ఉన్నాకూడా మన ఫోన్ ఇంటర్నెట్ స్పీడ్ మాత్రం 2 G లాగా నడుస్తుంది. దాదాపుగా చాలా మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారుల ప్రధాన సమస్య ఇదేకావచ్చు. దేశం అన్లాక్ దశలోకి మారినా కూడా ప్రజలు ఎక్కువగా ఇళ్ళకే పరిమితమవ్వడంతో, ఇప్పటికీ లాక్డౌన్ స్థితిలోనే ఉంది. కాబట్టి, దాదాపు అందరూ కూడా మొబైల్ సహాయంతో పనులు చక్కబెట్టేస్తున్నారు. ఈ కారణంగా ఇంటర్నెట్ వాడకం పెరిగింది. రీఛార్జ్ ప్లాన్స్ ని కంపెనీ ఎంత చౌకగా చేసినా, ఇంటర్నెట్ వేగం వినియోగదారులకు పెద్ద సమస్యగా మారింది.
మేము ఈ సమస్యకు పరిష్కారంతో ముందుకు వచ్చాము. ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని మార్గాలను అనుసరిస్తే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల లో ఇంటర్నెట్ వేగం పెరుగుతుంది. ఇందులో 5 సింపుల్ పద్దతుల ద్వారా మొబైల్ ఇంటర్నెట్ వేగం పెంచవచ్చు. అవేమిటో, వివరంగా చూద్దాం ….
ఇది మొదటి మరియు సులభమైన మార్గం. ఫోన్ నుRestart చేసిన తరువాత, మొబైల్ నెట్ వర్క్ సెర్చ్ చేస్తుంది. కాబట్టి, ఇంటర్నెట్ వేగం చాలా రెట్లు పెరుగుతుంది. ఈ పద్దితిలో మీరు మొబైల్ డేటాను ఒకసారి ఆపివేసి తిరిగి ప్రారంభించవచ్చు.
మొబైల్‌ను Restart చేయడంతో పాటు, మీరు ఫోన్ యొక్క ఫ్లైట్ మోడ్ ను ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చు. ఆ తరువాత, ఫోన్ మళ్ళీ మొబైల్ నెట్ వర్క్ ను సెర్చ్ చేస్తుంది, ఇది ఫోన్ యొక్క ఇంటర్నెట్ వేగాన్ని చాలా సార్లు పెంచుతుంది.
చాలా ప్రీపెయిడ్ ప్లాన్స్ రోజువారీ డేటా పరిమితితో వస్తాయి. ప్లాన్స్ డేటా పరిమితి గడువు ముగిసిన తరువాత, ఇంటర్నెట్ వేగం ఆటొమ్యాటిగ్గా తగ్గుతుంది. ఈ సందర్భంలో, మీరు మీ డేటా వినియోగాన్ని ఒకేసారి పరిశీలించాలి.
సాధారణంగా యాప్స్ అప్డేట్ చేయడానికి ఫోన్ లో ఆటో డౌన్ లోడ్ ఎంపిక ఆన్ చేయబడుతుంది. మీరు ఈ ఎంపికను ఆపివేయగలిగితే బాగుంటుంది. ఈ విధంగా మీ ఇంటర్నెట్ పరిమితంగా ఉపయోగించబడుతుంది మరియు మీకు మంచి వేగం లభిస్తుంది.
ఫోన్ యొక్క సెట్టింగులను మార్చినప్పటికీ చాలా సార్లు ఇంటర్నెట్ వేగం తగ్గుతుంది. అలాంటప్పుడు, మీ ఫోన్ నెట్ వర్క్ సెట్టింగ్‌లను ఒకసారి రీసెట్ చేయడం మంచిది.