21 Days Lockdown: అమేజాన్ ప్రైమ్ నుండి టాప్ 5 షో లు

కరోనావైరస్ కారణంగా దేశంలో విధించిన లాక్ డౌన్ తో  మనమందరం ఇళ్లకే పరిమితమయ్యాము. ఇది మరికొద్ది కాలం  పాటు కొనసాగుతుంది. అయితే, ఈ సమయాన్ని ఎలా గడపలను ఆలోచిస్తుంటే, అమెజాన్ ప్రైమ్‌లో మీరు కొన్ని ఉత్తమ షోలను  ఆస్వాదించవచ్చు. ఎందకంటే, ఈ షోలు సస్పెన్స్, కామెడీ తో పాటుగా నవరసాలు కలిగి మీకు సరైన టైం పాస్ ఇస్తాయి. అయితే, మీరు ఈ షోలను చూడాలంటే, అమెజాన్ ప్రైమ్ యొక్క సభ్యత్వం కలిగి ఉండాలి, దీనితో  ఈ షోలన్నింటిని మీరు చూడవచ్చు. అమేజాన్ సబ్ స్క్రిప్షన్  ఉన్నవారు, ఈ టాప్ 5 షోలను ఆస్వాదించవచ్చు.

PARASITE

ఈ షో ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఈ చిత్రంలో వివక్షకు సంబంధించిన అంశాలను పెద్ద ఎత్తున చూసే అవకాశం మీకు లభిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు.

Jawaani Jaaneman

జవానీ జనమాన్ షో, ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉంది. ఈ చిత్రంలో, పూజా బేడి కుమార్తె అరంగేట్రం చేస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఇది కాకుండా, మీరు ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్‌ ను కూడా చూడవచ్చు, ఈ చిత్రానికి సంబంధించిన వీడియోను ఇక్కడ చూడవచ్చు.

The Forgotten Army

జాబితాలో తదుపరి స్థానం ది ఫర్గాటెన్ ఆర్మీ షో దక్కించుకుంది. ఈ షో కి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ ధారావాహికలో మీరు 5 వేర్వేరు ఎపిసోడ్లను చూడవచ్చు.  ఈ షో ద్వారా, భారతదేశాన్ని విముక్తి చేయడానికి సుభాష్ చంద్రబోస్ సృష్టించిన సైన్యాన్ని చూపించే ప్రయత్నం జరిగింది. ఈ షో కి సంబంధించిన వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు.

Inside Edge

ఈ షోలో మీరు వివేక్ ఒబెరాయ్ యొక్క అద్భుతమైన యాక్టింగ్ చూడవచ్చు. ఇది కాకుండా మీరు ఈ షోలో అంగద్ బేడి, అమీర్ బషీర్ మరియు సయాని గుప్తా మొదలైన వారిని కూడా చూడవచ్చు. ఈ షోలో మీరు క్రికెట్‌కు సంబంధించిన విభిన్న కోణాన్ని చూడవచ్చు. ఈ షో కి  సంబంధించిన వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు.

The Family Man

ఈ షోలో మీరు శ్రీకాంత్ తివారీ అనే పేరుతొ మనోజ్ బాజ్‌పాయ్‌ ను చూడవచ్చు. ఆయన రహస్య యాంటీటెర్రరిజం ఏజెన్సీతో కలిసి పనిచేస్తారు. ఈ షోకి సంబంధించిన వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు.

Mirzapur

చివరగా, మీర్జాపూర్ గురించి కూడా మేము మీకు చెప్తాము, ఈ షో అమెజాన్ ప్రైమ్ యొక్క చాలా ప్రసిద్ధమైన షో గా చెప్పొచ్చు . ఈ షోకు  సంబంధించిన వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :