YouTube AI likeness detection tool
YouTube Down: ప్రముఖ వీడియో ప్లాట్ ఫామ్ యూట్యూబ్ డౌన్ అయ్యింది. ఈ విషయాన్ని గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లు రిపోర్ట్ చేస్తున్నారు. ప్రముఖ ఔటేజ్ రిపోర్ట్ ప్లాట్ ఫామ్ downdetector నుంచి యూజర్లు ఈ సమస్య గురించి విపరీతంగా రిపోర్ట్ అందించారు. యూట్యూబ్ డౌన్ గురించి శుక్రవారం సాయంత్రం, అంటే ఈరోజు సాయంత్రం 6:30 గంటల నుంచి రిపోర్ట్ లు నమోదు అయ్యాయి. అయితే, ఇది రెండు నిమిషాల్లోనే వేల సంఖ్యలో యూజర్లు ఈ సమస్య చూస్తున్నట్లు రిపోర్ట్ అందుకుంది.
యూట్యూబ్ యాప్ మరియు వెబ్ యూట్యూబ్ లో కూడా యూజర్లు వీడియో చూడలేక పోయినట్లు రిపోర్ట్ చేశారు. ఈ విషయం గురించి డౌన్ డిక్టేటర్ ద్వారా వేల మంది యూజర్లు రిపోర్ట్ చేశారు. ఇందుకు అసలు కారణం ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. అయితే, సర్వీస్ ఇష్యు కారణంగా ఇలా జరిగే అవకాశం ఉండొచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: లేటెస్ట్ 12.1.4 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ రూ. 10,000 భారీ డిస్కౌంట్ అందించింది.!
యూట్యూబ్ డౌన్ అందరికీ ఒకే మాదిరిగా ఉండదు. కొందరు వారి యూట్యూబ్ లో ఈ ఇబ్బందిని చూసినట్లు చెబుతున్నారు. ఇక ఈ యూట్యూబ్ డౌన్ పీక్ రిపోర్ట్ టైమ్ విషయానికి వస్తే, యూట్యూబ్ డౌన్ సాయంత్రం 6:30 గంటలకు మొదలై 6:45 గంటల సమయంలో పీక్ రిపోర్ట్ అందుకుంది. ఈ సమయంలో నిముషానికి దాదాపు 3300 మందికి పైగా రిపోర్ట్స్ చేసినట్లు డౌన్ డిక్టేటర్ రిపోర్ట్ పట్టిక చూపించింది.
అయితే, 7:15 గంటల నుంచి ఈ సమస్య తగ్గుముఖం పట్టినట్లు కనిపించింది. ఎందుకంటే, రిపోర్ట్ రేంజ్ చూపించే గ్రాఫ్ లో రిపోర్ట్ బాగా తగ్గిపోయినట్లు సూచించింది. 7:30 నిమిషాల నుంచి ఈ సమస్య పూర్తిగా తగ్గినట్లు గ్రాఫ్ లో నమోదు అయ్యింది. అయితే, ఈ సమస్యకు దారి తీసిన కారణాలు ఇంకా తెలియ రాలేదు.