YouTube Down: సతాయిస్తున్న యూట్యూబ్, వీడియో ప్లే చేయలేక యూజర్ల ఇక్కట్లు.!

Updated on 19-Dec-2025
HIGHLIGHTS

ప్రముఖ వీడియో ప్లాట్ ఫామ్ యూట్యూబ్ డౌన్ అయ్యింది

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లు YouTube Down రిపోర్ట్ చేస్తున్నారు

ఈరోజు సాయంత్రం 6:30 గంటల నుంచి రిపోర్ట్ లు నమోదు అయ్యాయి

YouTube Down: ప్రముఖ వీడియో ప్లాట్ ఫామ్ యూట్యూబ్ డౌన్ అయ్యింది. ఈ విషయాన్ని గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లు రిపోర్ట్ చేస్తున్నారు. ప్రముఖ ఔటేజ్ రిపోర్ట్ ప్లాట్ ఫామ్ downdetector నుంచి యూజర్లు ఈ సమస్య గురించి విపరీతంగా రిపోర్ట్ అందించారు. యూట్యూబ్ డౌన్ గురించి శుక్రవారం సాయంత్రం, అంటే ఈరోజు సాయంత్రం 6:30 గంటల నుంచి రిపోర్ట్ లు నమోదు అయ్యాయి. అయితే, ఇది రెండు నిమిషాల్లోనే వేల సంఖ్యలో యూజర్లు ఈ సమస్య చూస్తున్నట్లు రిపోర్ట్ అందుకుంది.

YouTube Down: ఏమిటి విషయం?

యూట్యూబ్ యాప్ మరియు వెబ్ యూట్యూబ్ లో కూడా యూజర్లు వీడియో చూడలేక పోయినట్లు రిపోర్ట్ చేశారు. ఈ విషయం గురించి డౌన్ డిక్టేటర్ ద్వారా వేల మంది యూజర్లు రిపోర్ట్ చేశారు. ఇందుకు అసలు కారణం ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. అయితే, సర్వీస్ ఇష్యు కారణంగా ఇలా జరిగే అవకాశం ఉండొచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: లేటెస్ట్ 12.1.4 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ రూ. 10,000 భారీ డిస్కౌంట్ అందించింది.!

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :