ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల రక్షణ అనేది ప్రశ్నర్ధకంగా మారింది. తల్లిదండ్రులిద్దరూ కూడా ఉద్యోగాలకి వెళ్లాల్సిరావడంతో కొంతమంది వారి పిల్లలను గురించిన బెంగ ఎక్కువగా ఉంటుంది. అలాగే, మరికొంత మందికైతే, స్కూలకు వెళ్లిన పిల్లలు ఏంచేస్తున్నారు, వారు సరైన సమయానికి ఇంటికి చేరుకుంటారో లేదో అనికూడా ఆలోచించే పరిస్థితి ఏర్పడింది.
అయితే, చిన్న పిల్లలను ట్రాక్ చెయ్యడానికి ఆన్లైన్లో చాలానే గాడ్జెట్లు అందుబాటులోవున్నాయి. అయితే, తక్కువధరలో పిల్లను ట్రాక్ చెయ్యడానికి అమేజాన్ ఆన్లైన్ ప్లాట్ఫారం నుండి కొన్ని గ్యాడ్జెట్లు అందుబాటులో వున్నాయి, వాటిలో మంచి ఫీచర్లతో రియల్ టైం ట్రాక్ చేసే ట్రాకర్లను ఇప్పుడు చూద్దాం.
ఈ TrackBond Trail పరికరం GPS ట్రాకింగ్ కోసం అంతర్గతంగా ఒక SIM కార్డుతో వస్తుంది. దీని సహాయంతో మీరు మీపిల్లలు ఎక్కడున్నరని, మీ స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్లేట్ నుండి మ్యాప్ లో LIVE ట్రాక్ చెయ్యవచ్చు. అలాగే, మీరు ముందుగా నిర్ణయించిన ప్రదేశాలు కాకుండా, ఒక కొత్త లేదా గుర్తు తెలియని ప్రాంతానికి మీ పిల్లలు వెళుతున్న లేదా చేరుకున్నా మీకు మీ ఆప్ లో మెసేజిలు మరియు నోటిఫికేషన్ రూపంలో అలర్ట్ ని పంపిస్తుంది. అంతేకాకుండా, వారు అపాయంలో ఉన్నప్పుడు లేదా వారికీ సహాయం అవసరమైనప్పుడు ఇందులో అందించిన 'HELP' బటన్ను నొక్కడంతో మీకు వెంటనే లొకేషన్ తో కూడిన సమాచారం అందుతుంది. దీన్ని రూ. 4699 రుపాయల ధరతో అమేజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు.
ఇది TrackBond Trail వంటి అన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది మరియు చాల ఎక్కువ కాలం పనిచేసేలా ఇందులో ఒక పెద్ద బ్యాటరీని కూడా అందించారు. అధనంగా, మీకు కావలసిన లొకేషన్ యొక్క దాటని సేవ్ చేయడం కోసం సెక్యూర్ క్లౌడ్ ప్లాట్ఫారంతో వస్తుంది. దీన్ని రూ. 4899 రుపాయల్ ధరతో అమేజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు.