కరోనా వైరస్ ఎఫెక్ట్ : 32 ఇంచ్ LED ని ఉచితంగా ఇస్తున్న Xiaomi సంస్థ

కరోనా వైరస్ ఎఫెక్ట్ : 32 ఇంచ్ LED ని ఉచితంగా ఇస్తున్న Xiaomi సంస్థ
HIGHLIGHTS

షావోమి టీవీని ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది.

షావోమి తన 32-అంగుళాల షావోమి టీవీని ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది.  అయితే, లైన్లో నుంచున్న ప్రతిఒక్కరికి ఉచిత TV దొరుకుతుంది అనిమాత్రం అనుకోకండి. ఈ ఉచిత టీవీ అఫర్  కేవలం షావోమి యొక్క తాజా హై-ఎండ్ Mi ART  టివి ని కొనుగోలు చేసేవారికి మాత్రమే వర్తిస్తుంది. అంటే, ఈ Mi ART టివి కొనుగోలుదారునికి  32 అంగుళాల షావోమి టీవీ ఉచితంగా ఇస్తారన్నమాట.

అంతేకాదు, ఈ ఆఫర్ చైనాలో మాత్రమే చెల్లుతుందని కూడా సంస్థ ప్రకటించింది. ఈ ఆఫర్ యొక్క ప్రయోజనం ఇతర దేశాలలో  లభించదు. ఈ అఫర్ ను కంపెనీ తన టీవీ సెల్ ను పెంచడానికి తీసుకుంది. ప్రపంచవ్యాప్త కరోనావైరస్ కోవిడ్ -19 సంక్షోభం తరువాత, చాలా దేశాలలో కొన్ని తగ్గింపు ఆఫర్లను ఇవ్వబోన్నాయని తెలుస్తోంది. భారతదేశంలో కూడా, షావోమి గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్స్‌లో తన అమ్మకాన్ని ప్రారంభించింది, ఈ సంస్థ ట్వీట్‌లో దీని గురించి సమాచారం ఇచ్చింది.

Xiaomi Mi ART టీవీలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి

ఈ టీవీ 65-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది , ఈ హై-ఎండ్ టీవీ కేవలం 13.9 మి.మీ. మందంతో మాత్రమే ఉంటుంది. ఈ షావోమి మి ART టీవీలో శామ్సంగ్ యొక్క 4K 4K OLED ప్యానెల్ అందుతుంది. ఈ టీవీలో క్వాడ్-కోర్ అమ్లాజిక్ ప్రాసెసర్ మరియు మాలి- T830MP2 GPU కూడా ఉన్నాయి.

ఇది కాకుండా, 2GB RAM తో 32GB ఇంటర్నల్ స్టోరేజి కూడా ఉంటుంది. ఈ టీవిలో, 2.4G / 5G డ్యూయల్ బ్యాండ్ వై-ఫై మరియు బ్లూటూత్ 4.2 మద్దతును అందుకుంటారు. ఈ టీవీలో 6 ఛానల్ సౌండ్‌బార్ కూడా వుంది మరియు  ఇందులో సబ్‌వూఫర్ ఆడియో సిస్టమ్‌ను కూడా పొందుతారు. ఇది Dolby మరియు DTS -HD  డ్యూయల్ డీకోడింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. మీరు ఈ టీవీలో AI అసిస్టెంట్‌ను కూడా పొందుతారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo