Women's Day 2025 best wishes and images to share to your loved one
Women’s Day 2025: ప్రతీ సంవత్సరం మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటాము. లింగ పోరాటం మరియు మహిళ హక్కుల కోసం జరిగిన పోరాటం ద్వారా ఈ రోజుకు ఈ ప్రాముఖ్య చేకూరింది. సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ మరియు మరిన్ని రంగాల్లో మహిళలు సాధించిన విజయాలకు గుర్తుగా ఈరోజు నిలుస్తుంది మరియు ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగ చేసుకుంటారు. ఇది కేవలం పేరుకే జరుపుకునే పండుగ కాదు, అమ్మగా, అక్కగా, చెల్లిగా భార్యగా మనం వేసే ప్రతి అడుగులో ఏదో ఒక రూపంలో మనతో తోడుగా నడిచే మహిళలకు మనం చేయాల్సిన గౌరవం. అటువంటి గొప్ప రోజును వారికి తెలియజేసే బెస్ట్ విషెస్ మరియు ఇమేజస్ ను ఈరోజు అందిస్తున్నాము.
స్త్రీ మూర్తులందరికీ 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.!
ప్రతి స్త్రీలో దాగివున్న మహా శక్తికీ మరియు ధైర్యానికి నా పాదాభి వందనం. మీకు 2025 మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.!
అమ్మగా, అక్కగా, చెల్లిగా భార్యగా, కుమార్తెగా వెన్నంటి కాపాడే ఓ మహిళా… మీ ప్రేమకు, త్యాగానికి నా కృతజ్ఞతలు. హ్యాపీ ఉమెన్స్ డే.!
మీ కలలు నెరవేరాలని, ఆకాశమే హద్దుగా మీరు సాగిపోవాలని కోరుకుంటూ, 2025 మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.!
మీ శక్తిని తెలుసుకోండి అందని తీరాలు సైతం చేరుకోండి, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.!
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, ఈరోజు మీకు ఎంతో అందంగా గడవాలి.!
స్త్రీ లేనిదే సృష్టి లేదు, ఈ సృష్టిని నడిపించే స్త్రీ మూర్తులందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.!
Also Read: Lava Agni 3 5G పై రూ. 4,000 తగ్గింపు అందించిన లావా.. ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే.!