Whatsapp Update: ఇక కావలసిన Emoji తో రియాక్ట్ కావచ్చు.!!

Updated on 15-Jul-2022
HIGHLIGHTS

ఎమోజి రియాక్షన్ ఫీచర్‌ లో కొత్త అప్డేట్ లను యాడ్ చేసింది

ఈ ఫీచర్ ను మరింత సౌకర్యవంతంగా మార్చింది

ఇప్పుడు మీకు నచ్చిన ఎమోజిని ఎంచుకునే అవకాశాన్ని వాట్సాప్ అందించింది

వాట్సాప్ లో ఎమోజి రియాక్షన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన చాలా కాలం తరువాత ఇందులో కొత్త అప్డేట్ లను యాడ్ చేసింది. వాట్సాప్ లో వచ్చే మెజెస్ లకు Emoji తో రియాక్ట్ అయ్యే ఫీచర్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే, ఇప్పుడు ఈ ఫీచర్ ను మరింత సౌకర్యవంతంగా మార్చింది. ఎమోజి రియాక్షన్ ఫీచర్‌ ఇప్పటి వరకూ  కేవలం 6 ఎమోజి లను మాత్రమే ఎంచుకునే అవకాశం వుంది. ఒకవేళ మీకు వచ్చిన మెసేజ్ కి మీరు రియాక్ట్ అవ్వాలంటే వీలుండేది కాదు. కేవలం ఇక్కడ అందించిన 6 ఎమోజీ లలో ఏదైనా ఒకటి మాత్రమే ఎంచుకునే వీలుంది. అయితే, ఇప్పుడు మీకు నచ్చిన ఎమోజిని ఎంచుకునే అవకాశాన్ని వాట్సాప్ తీసుకొచ్చింది.   

మొదట ఎమోజి రియాక్షన్ ఫీచర్‌ను ప్రవేశపట్టినప్పుడు వాట్సాప్ కేవలం ఆరు ఎమోజీలను మాత్రమే ఇందులో అందించింది. మెసేజ్ పైన నొక్కిన కొన్ని సెకన్ల తర్వాత, ఈ ఆరు ఎమోజీలు ప్రదర్శించబడ్డాయి, ఇందులో నుండి వినియోగదారులు వారికీ కావాల్సిన ఎమోజి ని ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్ వినియోగదారుల నుండి మంచి స్పందను అందుకోవడంతో, వాట్సాప్ ఈ ఫీచర్ కోసం కొత్త అప్డేట్ ను విడుదల చేసింది. ఈ అప్డేట్ ద్వారా ఎమోజి రియాక్షన్ కోసం పూర్తి ఎమోజి కీబోర్డ్‌ను యాక్సెస్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

అయితే, ఈ అప్‌డేట్ వాట్సాప్ వినియోగదారులు అందరి కోసం ఇంకా ప్రకటించలేదు. ఈ ఫీచర్ కేవలం బీటా రిలీజ్ లో ఒక భాగంగా వస్తుంది. అంటే, Android మరియు iOS వినియోగదారుల కోసం వాట్సాప్ బీటా లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్ ఈ అప్‌డేట్‌ ను బ్లాగ్ పోస్ట్ ద్వారా ప్రకటించింది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :