what is Microsoft's GitHub Spark and how it works
GitHub Spark : ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే చాలా రంగాల్లో తన ఆధిపత్యాన్ని చాటుతుంది. అయితే, కొన్ని విభాగాల్లో మిగిలిన గ్యాప్ ను కంప్లీట్ చేస్తూ మైక్రోసాఫ్ట్ మరొక ముందు అడుగు వేసి కొత్త ప్లాట్ఫారం గిట్ హబ్ స్పార్క్ తీసుకొచ్చింది. ఇది ఎటువంటి నాలెడ్జి లేని సామాన్య యూజర్ కి ఇది అద్భుతమైన మరియు ఉపయోగకరమైన ప్లాట్ఫారం గా ఉంటుంది. ఎందుకంటే, ఇది కోడింగ్ అంటే ఏంటో తెలియని వారికి కూడా వారి ఐడియాలతో పూర్తిస్థాయిలో APPs ఇంప్లిమెంట్ చేయడానికి సహకరిస్తుంది.
గిట్ హబ్ స్పార్క్ అనేది మైక్రోసాఫ్ట్ కొత్తగా అందించిన యాప్ క్రియేటింగ్ AI ప్లాట్ ఫామ్. అయితే, ఇది మిగిలిన ప్లాట్ ఫామ్ మాదిరిగా కాకుండా యూజర్ యొక్క ఆలోచనలకు అనుగుణంగా మరియు వారి ఐడియాలజీ మేరకు వారు కోరుకునే యాప్స్ చిటికెలో అందిస్తుంది.
గిట్ హబ్ స్పార్క్ ప్లాట్ ఫామ్ ను గిట్ హబ్ నెక్స్ట్ ల్యాబ్స్ నిర్మించి మరియు గిట్ హబ్ యూనివర్స్ 2024 యాన్యువల్ డెవలపర్ కాన్ఫరెన్స్ లో దీని గురించి వెల్లడించారు. అయితే, ఎట్టకేలకు సంవత్సరం తర్వాత ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది.
ఈ కొత్త AI ప్లాట్ ఫామ్ ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ లేని వారు కూడా క్లిష్టమైన యాప్స్ ని సైతం క్రియేట్ చేయడానికి సహాయం చేస్తుంది. అంటే, ఇది యాప్స్ క్రియేట్ చేయడానికి మీడియం గా ఉంటుంది. ఇది ప్రస్తుతం Copilt Pro + యూజర్లకు పబ్లిక్ ప్రివ్యూ కోసం అందుబాటులో ఉంది. ఈ ప్లాట్ ఫామ్ లో సింపుల్ కమాండ్స్ అందించి వెబ్ మైక్రో-అప్లికేషన్లు లేదా స్పార్క్ లను పొందవచ్చు.
ఇది చేసే పని అర్థమయ్యేలా చెప్పాలంటే, యూజర్ తాను కోరుకునే యాప్ కోసం ఇందులో సింపుల్ ఇంగ్లీష్ లో వివరాలు రాసి అందిస్తే చాలు, ఇది యాప్ క్రియేట్ చేసి అందిస్తుంది. ఉదాహరణకు, మీ డైలీ పనులకు లేదా అవసరాలకు తగిన యాప్ ను మీరే సొంతంగా క్రియేట్ చేస్తే చేసుకోవచ్చు. ఇది మీతో పని లేకుండా కోడ్ రాసి యాప్ ను రియల్ టైం లో తయారు చేసి అందిస్తుంది. ఇందులో కోడ్ కంప్లిషన్, డీబగ్గింగ్ మరియు ఆటో – ఫిక్స్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి.
Also Read: అండర్ రూ. 1000 బెస్ట్ TWS Earbuds కోసం చూస్తుంటే, మీ కోసమే ఈ బెస్ట్ డీల్స్.!
పెరిగిన టెక్నాలజీ మరియు మార్కెట్లో AI కంపెనీల కాంపిటీషన్ తో కొత్త కొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫామ్స్ వచ్చేస్తున్నాయి. ఈ కొత్త ప్లాట్ ఫామ్ ఏకంగా మైక్రో యాప్స్ తయారు చేసి క్షణాల్లోనే పూర్తిగా ప్రివ్యూ ను అందించడం నిజంగా ఆశ్చర్యపరుస్తుంది.