అత్యంత వేగంగా పనిచేసే ఫైబర్ టూ ది హోమ్ (FTTH) అంటే ఏమిటి, అది ఎలాగ పనిచేస్తుంది?

Updated on 22-Apr-2019
HIGHLIGHTS

అసలు ఈ FTTH లేదా FTTP అంటే ఏమిటో తెలుసా?

సాధారణ కేబుల్ మోడెం లేదా DSL (డిజిటల్ సబ్ స్క్రైబర్ లైన్) కనెక్షన్ అందించే వేగంతో పోలిస్తే, దాదాపుగా 30 నుండి 100 రేట్లు అధికమైన స్పీడుతో ఉంటుంది.

Netflix, అమేజాన్ ప్రైమ్, లేదా మరేదైనా సోర్స్ నుండి నిజమైన HD కంటెంట్ వీడియోలను ఆస్వాదించాలంటే, ఈ FTTH కనెక్షన్లతో సాధ్యమవుతుందని చెప్పొచ్చు.

ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా FTTH లేదా FTTP ఇంటర్నెట్ సర్వీసుల గురించి వింటున్నాం. అసలు ఈ FTTH లేదా FTTP అంటే ఏమిటో తెలుసా? ఇది పనిచేస్తుందో తెలుసా? . ఎందుకంటే, త్వరలో మన కనెక్టివిటీ అవసరాలన్నింటికీ సరిపడా స్పీడ్ అందించగల ఈ FTTH సేవలు అందరిని పలకరించనున్నాయి. ఈ సేవలను ముందుగా BSNL అందిస్తుండగా, జియో కూడా అతిత్వరలో 1,600 సిటీలలో ఈ సర్వీసులను అందించడానికి సిద్ధమవుతోంది.

వాస్తవానికి FTTH లేదా FTTP అన్న కూడా ఒకే అర్ధం వస్తుంది. FTTH అనగా 'ఫైబర్ టూ ది హోమ్', అలాగే FTTP అనగా 'ఫైబర్ టూ ది ప్రిమిసెస్' ఈ రెండింటిలో ఏది పిలిచినా కూడా ఒక్కటే అవుతుంది. ఒక సెంటర్ పాయింట్ (కేంద్ర స్థానం) నుండి ఒక ఆప్టికల్ ఫైబరును, నేరుగా మనం ఇంటికి అనుసంధానించడాన్ని, ఫైబర్ టూ ది హోమ్ లేదా ఫైబర్ టూ ది ప్రిమిసెస్ అంటారు. దీని ద్వారా ఎటువంటి అంతరాయం లేకుండా అత్యధికమైన స్పీడుతో సర్వీస్ అందుకోవచ్చు.

ఇది ఒక ఆప్టికల్ ఫైబరుతో అనుసంధానించబడినది కాబట్టి ఎక్కువ వేగాన్ని అందిస్తుంది. ఎందుకంటే, ఆప్టిక్ ఫైబర్లో డేటా కాంతి రూపంలో ప్రయాణిస్తుంది. కాబట్టి, ఈ ఆప్టికల్ ఫైబర్ మన తల వెంట్రుక కంటే కొంచం మందంగా ఉంటుంది మరియు ఒక చివరి నుండి మరొక చివరకు నేరుగా కాంతిని చేరవేస్తుంది. మన మెటల్ వైర్లతో ఇటువంటి వేగాన్ని సాధించడం అసాధ్యంగా చెప్పొచ్చు. ఇప్పటి వరకు కమర్షియల్ ఉపయోగాల కోసం మాత్రమే ఉపయోగించిన ఈ విధాన్ని ఇప్పుడు టెలికం సంస్థలు మన ఇళ్ల వరకు తీసుకురానున్నాయి.

అందువలన, ఈ FTTH కనెక్షన్లతో ఒక్క సెకనుకు 100Mbps వరకు వేగాన్ని సాధించవచ్చు. వాస్తవానికి, ఇది ప్రస్తుతం వాడుతున్న సాధారణ కేబుల్ మోడెం లేదా DSL (డిజిటల్ సబ్ స్క్రైబర్ లైన్) కనెక్షన్ అందించే వేగంతో పోలిస్తే, దాదాపుగా 30 నుండి 100 రేట్లు అధికమైన స్పీడుతో ఉంటుంది. దీన్ని బట్టి ఆలోచించవచ్చు, ఈ సర్వీస్ వచ్చిన తరువాత మీ ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కడ నుండి ఎక్కడికి వెళుతుందో.

ముఖ్యంగా, ప్రస్తుతం మనము వాడుతున్న స్మార్ట్ టీవీ లకు దీనితో మంచి స్పీడ్ అందుతుంది. Netflix, అమేజాన్ ప్రైమ్, లేదా మరేదైనా సోర్స్ నుండి నిజమైన  HD కంటెంట్ వీడియోలను ఆస్వాదించాలంటే, ఈ FTTH కనెక్షన్లతో సాధ్యమవుతుందని చెప్పొచ్చు.                                                                                  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :