what is blue screen of death and what is reason to affecting systems that has CrowdStrike
CrowdStrike Down: ప్రపంచ సైబర్ సెక్యూరిటీ దిగ్గజం క్రౌడ్ స్ట్రైక్ డౌన్ అయ్యింది. Windows సిస్టం లావు ప్రధాన సెక్యూరిటీ సిస్టం గా క్రౌడ్ స్ట్రైక్ ఉంటుంది. అందుకే, ఈ క్రౌడ్ స్ట్రైక్ డౌన్ అవ్వడం వలన చాలా ఇండియా మరియు ఆస్ట్రేలియా లతో సహా చాలా దేశాల్లో యూజర్స్ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) ఎర్రర్ సమస్యను చూస్తున్నట్లు స్క్రీన్ షాట్ లతో సహా పోస్ట్ లను షేర్ చేస్తున్నారు.
ముందుగా, క్రౌడ్ స్ట్రైక్ సైబర్ సెక్యూరిటీ ప్లాట్ ఫామ్ డౌన్ అయినట్లు ముందుగా యూజర్స్ రెడ్ఇట్ నుండి రిపోర్ట్ చేశారు. ఇదే సమస్యతో చాలా మంది యూజర్లు ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఈ ప్లాట్ ఫామ్ డౌన్ వలన బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) ఎర్రర్ తో సిస్టమ్స్ మొరాయిస్తున్నట్లు తెలిపారు.
బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) ఎర్రర్ ను బ్లూ స్క్రీన్ ఎర్రర్, ఫెటల్ ఎర్రర్ లేదా స్టాప్ ఎర్రర్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక క్రిటికల్ ఎర్రర్ మరియు సిస్టం లో ప్రధాన OS మరియు సర్వర్ ఇష్యు సమస్య తలెత్తినప్పుడు మైక్రోసాఫ్ట్ విండోస్ లో ఈ ఎర్రర్ చూపిస్తుంది. ఈ ఎర్రర్ వచ్చినప్పుడు సిస్టం స్క్రీన్ పూర్తిగా బ్లూ కలర్ లో కన్పిస్తుంది మరియు ఎర్రర్ కోడ్స్ ను మాత్రం చూపిస్తుంది.
Also Read: Crowdstrike Down: ఒక్కసారిగా డౌన్ అయిన అతిపెద్ద సైబర్ సెక్యూరిటీ కంపెనీ.!
వాస్తవానికి, చాలా సమస్యలు ఈ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) ఎర్రర్ దారితీస్తాయి. ఇందులో హార్డ్ వేర్ మాల్ ఫంక్షన్, డ్రైవర్ ఇష్యు, అనుకోకుండా వచ్చే ఎసెన్షియల్ ప్రోసెసర్ సమస్యలు వాంతి చాలా కారణాలు ఉండవచ్చు.
అయితే, ఇప్పుడు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) సమస్యతో మొరాయిస్తున్న సిస్టమ్ లు క్రౌడ్ స్ట్రైక్ సైబర్ సెక్యూరిటీ మెయిన్ ప్రోడక్ట్, Falcon లో తలెత్తిన సాంకేతిక సమస్య దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.