Vocal For Local విదేశీ యాప్స్ కి గట్టి పోటీనిచ్చే భారతీయ Apps

Vocal For Local విదేశీ యాప్స్ కి గట్టి పోటీనిచ్చే భారతీయ Apps
HIGHLIGHTS

ప్రధాని నరేంద్ర మోడీ గత వారం రోజులుగా 'లోకల్ ఫర్ లోకల్' నినాదానికి పిలుపునిచ్చారు

'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాన్ని ప్రోత్సహించడం ప్రత్యేకమైన అవసరంగా మారింది.

దేశంలో ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి, ప్రధాని నరేంద్ర మోడీ గత వారం రోజులుగా 'లోకల్ ఫర్ లోకల్' నినాదానికి పిలుపునిచ్చారు మరియు దేశంలో తయారైన ఉత్పత్తులను ఉపయోగించుకునేలా ప్రజలకు అభ్యర్ధన చేశారు. లోకల్ తయారీ, లోకల్ మార్కెట్లు మరియు లోకల్ సరఫరా చైన్ కు మద్దతు ఇవ్వవలసిన అవసరాన్ని కూడా ప్రధాని ఎత్తిచూపారు. నోవల్ కరోనావైరస్ కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉన్నందున, 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాన్ని ప్రోత్సహించడం ప్రత్యేకమైన అవసరంగా మారింది. అటువంటి పరిస్థితిలో, విదేశీ యాప్స్ కి కఠినమైన పోటీని ఇవ్వగల సామర్థ్యం ఉన్న 'వోకల్ ఫర్ లోకల్' ను దృష్టిలో ఉంచుకుని మీ కోసం 4 ఉత్తమ యాప్స్ ని తీసుకువచ్చాము, వాటి గురించి తెలుసుకుందాం …

Mitron App

ఈ మిట్రాన్ యాప్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చైనీస్ టిక్‌టాక్ కి సరైన ఇండియన్ పోటీ యాప్ అని చెప్పొచ్చు. ఇది చాలా తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందింది. ఒక నెల క్రితం విడుదలైన ఈ యాప్ ఇప్పటికే 50 మిలియన్ డౌన్‌లోడ్‌లను దాటింది. టిక్‌టాక్‌పై వివాదం తర్వాత ప్రజలు ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేస్తున్నారు. అందరూ కలిసి టిక్ టాక్ కి బదులుగా Mitron App నిజమైన భారతీయ యాప్ గా మార్చవచ్చు.

Xpay.Life App

ఆన్‌లైన్ బిల్లు పేమెంట్స్  కోసం XPay.Life ని ఉపయోగించండి. ఇది 100% స్వదేశీ యాప్. ఈ XPay.Life ద్వారా వినియోగదారులు విద్యుత్ బిల్లు, వాటర్ బిల్లు, గ్యాస్ బిల్లు, మొబైల్ బిల్లు, ల్యాండ్‌లైన్ బిల్లు, బ్రాడ్‌బ్యాండ్ బిల్లు, డిటిహెచ్ బిల్లు వంటి చాలా బిల్లులను చెల్లించవచ్చు. టచ్ స్క్రీన్ కియోస్క్, వెబ్, iOS మరియు ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ మరియు pos పరికరాల ద్వారా వినియోగదారులు బిల్లును చెల్లించవచ్చు. డిజిటల్ పేమెంట్ ఛానెళ్లలో UPI, డెబిట్ మరియు క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ మరియు వాలెట్లు ఉన్నాయి. XPay.Life బిల్ చెల్లింపు కోసం Blockchain ఆధారిత most secured చెల్లింపు గేట్‌వేను సమగ్రపరిచింది.

SayNamaste

వీడియో కాన్ఫరెన్సింగ్‌ కోసం వాడే జూమ్ యాప్ కు ఇక వీడ్కోలు చెప్పండి. మన భారతీయ యాప్  SayNamaste అందుబాటులోకి వచ్చింది. ఇది సురక్షితమైనది మరియు చాలా వేగంగా ఉంటుంది. యూజర్ ఐడిని క్రియేట్ చెయ్యాల్సిన అవసరం కూడా లేదు. ముంబైకి చెందిన వెబ్ అప్లికేషన్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కంపెనీ 'ఇన్‌క్రిప్ట్' జూమ్ వంటి వీడియో ప్లాట్‌ఫామ్‌లతో పోటీ పడటానికి ఈ SayNamaste యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్ జూమ్ లాగా ఉచితం. మీటింగ్ లింక్‌ను క్రియేట్ చెయ్యడం ద్వారా, ఇతర గ్రూప్ సభ్యులకు షేర్ చేసి వారికీ కావాల్సిన వీడియో కాన్ఫరెన్సింగ్ చేయవచ్చు.

Hike – Messanger App

వాట్సాప్ మరియు టెలిగ్రామ్ లాగా, Hike – Messanger ఒక మెసెంజర్ యాప్. Hike అనేది వినియోగదారులు వారి Android మరియు iOS మొబైల్‌లలో ఉపయోగించగల స్వదేశీ మొబైల్ అప్లికేషన్. హైక్ మెసెంజర్‌ను ఉపయోగించడానికి మొబైల్ నంబర్ అవసరం, దీని ద్వారా వినియోగదారు తన స్వంత హైక్ అకౌంట్ ను క్రియేట్ చేసుకోవచ్చు. Hike ని ఉపయోగం వాట్సాప్ వలెనే ఉంటుంది, ఇది చాలా సరదాగా ఉండే ఫీచర్లను కలిగి ఉంది. వినియోగదారులు వారి చాటింగ్‌లో వాటిని ఉపయోగించవచ్చు. వాట్సాప్ మాదిరిగానే, మీరు మీ స్నేహితులు మరియు బంధువులకు హైక్ మెసెంజర్ ద్వారా ఆన్‌లైన్ వీడియో మరియు ఆడియో కాల్స్ కూడా చేయవచ్చు. ఇది కాకుండా మీరు కాన్ఫరెన్స్ కాల్ కూడా చేయవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo