UPI New Rules: మూడు రోజుల్లో అమల్లోకి రానున్న కొత్త యూపీఐ రూల్స్.!

Updated on 28-Jul-2025
HIGHLIGHTS

డిజిటల్ పేమెంట్స్ కోసం వినియోగించే యూపీఐ ఇప్పుడు కొత్త నియమాలు తీసుకొచ్చింది

ఈ కొత్త నియమాలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి

ఈ కొత్త రూల్స్ గురించి యూజర్ తెలుసుకోవాల్సిన విషయాలు అందిస్తున్నాము

UPI New Rules: ప్రపంచంలో అత్యధికంగా డిజిటల్ పేమెంట్స్ వినియోగిస్తున్న దేశాల్లో మన దేశం అగ్రస్థానంలో ఉంది. మొత్తం ప్రపంచ డిజిటల్ పేమెంట్స్ లో దాదాపు 48 శాతం వాటా ఇండియా అకౌంట్స్ నుంచి అవుతున్నాయంటే, మన దేశంలో డిజిటల్ పేమెంట్ సిస్టం ఎంత విస్తరించిందో మీరు అర్థం చేసుకోవచ్చు. దేశంలో డిజిటల్ పేమెంట్స్ కోసం వినియోగించే యూపీఐ ఇప్పుడు కొత్త నియమాలు తీసుకొచ్చింది. ఈ కొత్త నియమాలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. కాబట్టి, ఈ కొత్త రూల్స్ గురించి యూజర్ తెలుసుకోవాల్సిన విషయాలు అందిస్తున్నాము.

UPI New Rules: కొత్త రూల్స్ రావడానికి కారణం ఏమిటి?

ప్రజల జీవన విధానంలో సులువైన, పారదర్శకమైన మరియు వేగవంతమైన చెల్లింపుల కోసం NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తీసుకొచ్చిన డిజిటల్ పేమెంట్ విధానమే, ఈ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI). ఇది ఇప్పుడు దేశంలోని మూలములకు విస్తరించింది మరియు ప్రపంచ ఖ్యాతి పొందింది. ఇది దేశం మొత్తం వినియోగిస్తున్న సర్వీస్ కాబట్టి, ఈ సర్వీస్ సిస్టం పై అధికమైన భారం పడుతుంది. యూజర్లు పదే పదే బ్యాలెన్స్ చెక్ చేయడం, మధ్యలో ఫెయిల్ అయిన లేదా ఆగిన పేమెంట్ గురించి నిరవధికంగా రిపోర్ట్ చేయడం మరియు మరిన్ని పనులు ఈ సర్వర్లపై పెను భారాన్ని మోపుతున్నట్లు గుర్తించారు. అందుకే, ఈ భారాన్ని తగ్గించడానికి ఈ కొత్త నియమాలు అమలు చేయడానికి NPCI సిద్దమయ్యింది.

ఏమిటి ఈ కొత్త రూల్స్?

ఇక యూపీఐ అమలు చేయనున్న కొత్త నియమాల విషయానికి వస్తే, ఆగస్టు 1వ తేదీ నుంచి బ్యాలెన్స్ చెకింగ్ మరియు ఆటో పేమెంట్ లో ఈ నియమాలు అమలు అవుతాయి. ఇప్పటి వరకు రోజుకు ఎన్నిసార్లైనా బ్యాలెన్స్ చెక్ చేసుకునే అవకాశం ఉండగా, 1వ తేదీ నుంచి రోజుకు కేవలం 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, NPCI ఈ చర్య పై లిమిట్ విధించింది.

ముఖ్యంగా ఆటో పేమెంట్ లో పెను మార్పులు తెచ్చింది. ఇప్పటివరకు 24 గంటల ఆటో పేమెంట్ అవకాశం ఉండగా, ఆగస్టు 1 నుంచి కేవలం నాన్-పీక్ టైమ్ లో మాత్రమే ఈ ఆటో పేమెంట్ ప్రోసెస్ చేస్తుంది. ఉదయం 10 గంటల కంటే ముందు, మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల మధ్యలో మరియు రాత్రి 9:30 గంటల తర్వాత ఈ ఆటో పేమెంట్ లను ప్రోసెస్ చేస్తుంది.

Also Read: Oppo K13 Turbo Series: అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ రిలీజ్ అనౌన్స్ చేసిన ఒప్పో.!

ఇక అన్నింటి కన్నా ముఖ్యమైన విషయం పేమెంట్ స్టక్ స్టేటస్. మీరు చేసిన ఏదైనా పేమెంట్ మధ్యలో నిలిచిపోతే ఆ పేమెంట్ స్టేటస్ ను కేవలం మూడు సార్లు మాత్రమే చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. యూపీఐ సర్వీస్ ను వేగంగా ఉంచడానికి మరియు సర్వీస్ ను మరింత సమర్ధవంతంగా మార్చడానికి ఈ కొత్త నియమాలు తీసుకు వచ్చినట్లు చెబుతున్నారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :