UP Deputy CM Brajesh Pathak suggests brands build auto temperature change technology ACs
DITAA 2026 : ఈరోజు న్యూఢిల్లీలో మొట్టమొదటి Digit India’s Top Appliance Awards 2026 ని అట్టహాసంగా నిర్వహించింది. ఈ వేదికపై ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ మాట్లాడుతూ, గృహోపకరణాల నుంచి వినియోగదారులు నిజంగా ఏమి కోరుకుంటున్నారో అనే విషయం పై తన విలువైన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, మార్కెట్‌లో ఎన్నో రకాల ఆప్షన్స్ తో ఉన్నా కూడా ప్రజలు మెరుగైన కొనుగోలు నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతున్నందుకు డిజిట్ మ్యాగజైన్ ను పాఠక్ ప్రశంసించారు. పెద్ద నగరాల నుండి చిన్న పట్టణాలు, గ్రామాల వరకు భారతదేశం అంతటా గృహోపకరణాలు దైనందిన జీవితంలో ఒక భాగమయ్యాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయినప్పటికీ, సరైన ప్రోడక్ట్ కొనడం ఇప్పటికీ అంత సులభం కాదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తాను ఒక మంత్రి గా కాకుండా, “వినియోగదారుల ప్రతినిధిగా” మాట్లాడుతున్నాను, అని పాఠక్ స్పష్టం చేశారు. తయారీదారులు మరింత మన్నికైన, ఆచరణాత్మకమైన మరియు వినియోగదారుల అవసరాలకు బాగా సరిపోయే ఉత్పత్తులను అభివృద్ధి చేయాలని ఆయన వేదికపై కోరారు.
AC లు, టెలివిజన్లు, వాషింగ్ మెషీన్లు, ఓవెన్ వంటి గృహోపకరణాలు ఇకపై కేవలం ధనిక కుటుంబాలకు మాత్రమే పరిమితం కావని పాఠక్ అన్నారు. ఆయన ప్రకారం, ఈ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా మధ్యతరగతి మరియు చిన్న కుటుంబాలకు కూడా చేరువయ్యాయి.
ఏసీలకు మరింత మెరుగుదలలు చేయాలని పాఠక్ సూచించారు. ఏసీల నుండి నీరు లీక్ అవ్వడం వల్ల వినియోగదారులకు అసౌకర్యం కలుగుతుందని మరియు ఇది దోమలు వృద్ధి చెందడానికి కూడా ఇది దారితీస్తుందని పేర్కొంటూ, దాన్ని అరికట్టే మార్గాలను కనుగొనాలని ఆయన కంపెనీలను కోరారు.
అంతేకాదు, ఏసీ మరింత గొప్ప టెక్ గురించి కూడా ఆయన తయారీదారులకు సూచన చేసారు. అదేమిటంటే, ప్రారంభంలో ఏసీ 16 డిగ్రీలు సెట్ చేసినా అది 30 నిమిషాలు లేదా 1 గంట తర్వాత ఆటోమెటిగ్గా 24 డిగ్రీల టెంపరేచర్ కి డిఫాల్ట్ గా సెట్ అయ్యేలా కొత్త టెక్ తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ టెక్ వలన పవర్ ఆదా చేయడమే కాకుండా మధ్య రాత్రిలో ఏసీ టెంపరేచర్ తగ్గించడానికి నిద్ర నుంచి మేలుకోవాల్సిన శ్రమ కూడా తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.
రిఫ్రిజిరేటర్లు గురించి కూడా అయిన చక్కని సందేశాన్ని ఈ వేదికపై అందించారు. ఫ్రిడ్జ్ లను ఉదాహరణగా తీసుకుంటూ, గడిచిన సంవత్సరాలలో గృహోపకరణాలు గణనీయంగా మెరుగుపడ్డాయని పాఠక్ అన్నారు. ఆధునిక రిఫ్రిజిరేటర్లు ఇప్పుడు కూరగాయలు, నీరు, ఆహారం మరియు ఫ్రీజర్ కోసం వేర్వేరు విభాగాలు గా వస్తున్నాయి, దీనివల్ల వాటిని ఉపయోగించడం మరింత సౌకర్యవంతంగా మారింది. అయితే, బ్రాండ్లు ఇప్పుడు వేగంగా అందిస్తున్న అప్‌గ్రేడ్ లకు బదులుగా మన్నికపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.
“పేదవాడు ఫ్రిజ్ ను ఒక్కసారే కొంటాడు, మధ్యతరగతివాడు ఒక్కసారే కొంటాడు, కాబట్టి అది కనీసం 20 ఏళ్ల మన్నిక కలిగి ఉండాలి,” అని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
Also Read : DITAA 2026: Digit India’s Top Appliance Awards 2026 విజేతలు ప్రకటించింది, పూర్తి జాబితాను చూడండి
గృహోపకరణాల నాణ్యత అర్థం చేసుకోవడానికి, సరైన కొనుగోలు నిర్ణయాలు తీసుకోవడానికి వినియోగదారులకు సహాయపడినందుకు డిజిట్ మ్యాగజైన్ ను పాఠక్ ప్రశంసించారు. వినియోగదారులు ఎదుర్కొంటున్న రోజువారీ సవాళ్లపై తయారీదారులు మరింత శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. ఈ సమస్యలను పరిష్కరించడం వల్ల వినియోగదారులకు మరియు బ్రాండ్ లకు కూడా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. “మీరు వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తే, మీ అమ్మకాలు కూడా పెరుగుతాయి,” అని ఆయన విలువైన మాటలు ఈ సందర్భంగా అందించారు.