ఈ ఆదివారంతో ముగియనున్న 799 రూపాయల విమాన టికెట్ బుకింగ్

Updated on 14-Mar-2019
HIGHLIGHTS

రాష్ట్రంలోని పలునగరాలకు బేస్ ఫేర్ గా 799 రూపాయలుగా అందిస్తోంది.

సామాన్య ప్రజలు కూడా విమానంలో ప్రయాణించేలా భారత ప్రభుత్వం ప్రకటించిన UDAN కార్యక్రమంలో భాగంగా, TrueJet అతితక్కువ ధరతో ఈ సర్వీసులను అందిచనున్నట్లు తెలుస్తోంది. డొమెస్టిక్ విమాన సర్వీసులకు మంచి పేరుగాంచిన, TrueJet ఇప్పుడు అతితక్కువ ధరకు విమాన సర్వీసులను అందించనుంది. అంతేకాదు, ఏకంగా ఈ తక్కువ ధర సర్వీసులను ఒక లక్ష మందికి అందిచనున్నట్లు కంపెనీ చెబుతోంది.

మీరు https://www.trujet.com ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. ఏమిటా విషయం అనుకుంటున్నారా? ఇక్కడ మీకు చూపించిన ధరలు కేవలం బేస్ ఫేర్ మాత్రమే దీనితో పాటుగా మీరు టాక్స్ కూడా చెల్లించాల్సి వుంటుంది. మీరు ప్రయాణించే ఎయిర్ పోర్ట్  మరియు నగరాన్ని అనుసరించి ఆ టాక్స్ లు మీకు వర్తిస్తాయి. అన్ని వివరాలు సవివరంగా గమనించి టికెట్లను బుక్ చేయండి.                                            

అయితే, మీరు ఈ ఆఫర్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవడనికి గడువు మాత్రం మార్చి 8 వ తేదీ నుండి 17 వ తేదీ వరకు ఉంటుంది. కానీ, మీరు ప్రయాణించడానికి మాత్రం కావాల్సినంత సమయం అందిస్తోంది. మీరూ 8 మార్చి నుండి అక్టోబర్ 26 వ తేదీ మధ్యకాలంలో మీకు కావాల్సిన తేదికి మీరు టికెట్ బుక్ చేసుకుని ప్రయాణించవచ్చు. ఇక్కడ మీకు మీరు ఎంచుకునే నగరం ఆధారంగా మీ టికెట్ రేటు నిర్ణయించబడుతుంది. అయితే , రాష్ట్రంలోని పలునగరాలకు బేస్ ఫేర్ గా 799 రూపాయలుగా అందిస్తోంది.

 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :