ఈ వారం OTT లో రిలీజ్ కానున్న భారీ చిత్రాలు..!!

Updated on 26-Mar-2022
HIGHLIGHTS

ఈ వారం OTT ప్లాట్ ఫామ్స్ పైన భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి

తెలుగు ప్రేక్షకులకు ఒకేరోజు డబుల్ బొనాంజా

భీమ్లా నాయక్ మరియు వలీమై OTT పై రిలీజ్ అవుతున్నాయి

ఈ వారం సినిమా థియేటర్లతో పాటుగా OTT ప్లాట్ ఫామ్స్ పైన కూడా భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. RRR సినిమా థియేటర్లలో 25 న విడుదల అవుతుండగా, అదే రోజు పవర్ స్టార్ లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ మరియు అజిత్ లేటెస్ట్ మూవీ వలీమై రెండు సినిమాలు కూడా OTT ప్లాట్ ఫామ్స్ పైన అదే రోజున లైవ్ చెయ్యబడతాయి. అంటే, తెలుగు ప్రేక్షకులకు ఒకేరోజు డబుల్ కాదు ట్రిపుల్ బొనాంజా అన్నమాట.

భీమ్లా నాయక్

పవన్ కళ్యాణ్ మరియు దగ్గుబాటి రాణా హీరోలుగా నటించిన ఈ భారీ మల్టి స్టార్ సినిమా మరో మూడు రోజుల్లో AHA మరియు Disney+ Hotstar రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పైన సందడి చెయ్యబోతోంది. ఈ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్న వారికీ ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్. ఈ సినీమా భారీ విజయాన్ని సొంత చేసుకుంది మరియు భారీ కలెక్షన్లను కూడా వాసులు చేసింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్షన్ అయితే ఒక రేంజ్ లో వుంది.

వలీమై

బోనీ కపూర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం గత నెల 24న థియేటర్లలో విడుదలై సక్సెస్ ను సాధించింది. జీ నెట్‌వర్క్ యొక్క OTT  సైట్ Zee5 లో మార్చి 25 న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా తమిళం, తెలుగు, కన్నడ మరియు హిందీలో విడుదల చెయ్యబడుతోంది. తమిళనాట ఈ ఈ సినిమా పైన మిశ్రమ రివ్యూలు వచ్చినప్పటికీ, ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :