Aadhaar Card లో పేరు మార్చుకోవడానికి ఈ డాక్యుమెంట్లు తప్పనిసరిగా కలిగి ఉండాలి.!
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త మార్గదర్శకాలు ప్రకటించింది
Aadhaar Card లో పేరు మార్చుకోవడానికి ఈ డాక్యుమెంట్లు తప్పనిసరిగా కలిగి ఉండాలి
Annexure D అఫిడవిట్ తో పాటు గుర్తింపు పత్రాలు సమర్పించాలి
ఆధార్ కార్డులో పేరు తప్పుగా నమోదైందా లేదా స్పెల్లింగ్ మిస్టేక్ సరిచేసుకోవాలనుకుంటున్నారా లేదా పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్చుకోవాలనుకుంటున్నారా లేదా పూర్తి పేరు మార్చుకోవాలి అని అనుకుంటున్నారా, అయితే మీకు ముఖ్యమైన అప్డేట్ మీకోసమే. ఆధార్ లో పేరు మార్పు కోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త మార్గదర్శకాలు ప్రకటించింది. 2026 సెప్టెంబర్ 18న విడుదల చేసిన సవరించిన విధానం ప్రకారం పేరు మార్పును బట్టి కార్డు హోల్డర్లు సమర్పించాల్సిన డాక్యుమెంట్లు మారుతాయి. సింపుల్ గా చెప్పాలంటే, Aadhaar Card లో పేరు మార్చుకోవడానికి ఈ డాక్యుమెంట్లు తప్పనిసరిగా కలిగి ఉండాలి.
Aadhaar Card పేరు మార్పును బట్టి డాక్యుమెంట్
స్పెల్లింగ్ తప్పులు, చిన్నపాటి మార్పులు
పేరులో అక్షర దోషాలు సరిచేయడం, మధ్య పేరును చేర్చడం లేదా తొలగించడం లేదా ఇంటి పేరు మార్చడం లేదా పేరులోని ఇనిషియల్స్ ను పూర్తి రూపంలో రాయడం వంటి మార్పులకు సరైన గుర్తింపు పత్రం (Proof of Identity - PoI) సమర్పించాలి. ఇందులో దరఖాస్తుదారుని పేరు మరియు ఫొటో ఉండాలి.
పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్పు
వివాహం లేదా విడాకుల కారణంగా ఇంటి పేరు మార్చుకోవాలనుకునేవారు UIDAI సూచించిన Annexure D అఫిడవిట్ తో పాటు గుర్తింపు పత్రాలు సమర్పించాలి.
ఆధార్ లో నమోదు పొరపాట్లు
ఆధార్ నమోదు సమయంలో ఇచ్చిన డాక్యుమెంట్ లో పేరు సరిగ్గా ఉన్నప్పటికీ, ఆధార్ లో తప్పుగా నమోదైతే వేరే విధానం ఉంటుంది. పెద్దలకు నిర్ణీత Annexure B అఫిడవిట్ తో పాటు గుర్తింపు లేదా సంబంధిత ధ్రువీకరణ పత్రం అవసరం. అదే మైనర్లకు అయితే Annexure C అఫిడవిట్ వర్తిస్తుంది.
పూర్తి పేరు మార్చుకోవాలంటే
పూర్తిగా కొత్త పేరును నమోదు చేయాలనుకునే వారు గెజిట్ నోటిఫికేషన్ (Gazette Notification) సమర్పించాలి. దీనితో పాటు తగిన గుర్తింపు పత్రాలు కూడా అవసరం అవుతాయి.
ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?
పేరు మార్పు కోసం సమీపంలోని ఆధార్ సేవా కేంద్రం లేదా ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేట్ సెంటర్ సందర్శించాలి. వెళ్ళేటప్పుడు అవసరమైన ఒరిజినల్ డాక్యుమెంట్లు కూడా వెంట తీసుకెళ్లాలి. అక్కడ ధ్రువీకరణ పూర్తయిన తర్వాత అప్డేట్ రిక్వెస్ట్ రసీదు తీసుకోవడం మర్చిపోవద్దు.
Aadhaar Card లో పేరు ఎన్నిసార్లు పేరు మార్చుకోవచ్చు?
UIDAI నిబంధనల ప్రకారం ఆధార్ లో పేరును సాధారణంగా జీవితకాలంలో రెండుసార్లు మాత్రమే అప్డేట్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ సార్లు మార్పులు చేయాల్సి వస్తే ప్రత్యేక మినహాయింపు పద్దతి ద్వారా మార్చుకునే అవకాశం ఉంటుంది.
ఇక ఈ ఆధార్ లో పేరు మార్చడానికి వర్తించే ఫీజు విషయానికి వస్తే, ప్రస్తుతం విడిగా చేసే డెమోగ్రాఫిక్ అప్డేట్ కు రూ.75 ఫీజు వర్తిస్తుంది. అయితే, దరఖాస్తు ఇచ్చినంత మాత్రాన పేరులో కచ్చితంగా మార్పు జరుగుతుంది అని అనుకోకండి. ఎందుకంటే, UIDAI పరిశీలన మరియు ధ్రువీకరణ తర్వాత మాత్రమే మీ పేరు మార్పు ఆమోదం పొందుతుంది.
మరిన్ని వివరాల కోసం UIDAI అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు లేదా 1947 హెల్ప్ లైన్ నంబర్ కు కూడా కాల్ చేయవచ్చు.