ముందుగా MIUI 11 అందుకోనున్న షావోమి ఫోన్ల లిస్ట్

Updated on 17-Oct-2019
HIGHLIGHTS

ఈ MIUI 11 అందుకోనున్న వాటిలో పోకో F1 మొదటిది.

షావోమి నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో రెడ్మి నోట్ 8 మరియు రెడ్మి నోట్ 8 ప్రోలను ఆవిష్కరించింది. ఎప్పటినుండో, భారతదేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫోన్లను విడుదల చేయడంతో పాటు, షావోమి MIUI 11 యొక్క రోల్-అవుట్ తేదీని కూడా ప్రకటించింది. రెడ్మి ఫోన్లకు రోడ్‌మ్యాప్‌ను కూడా కంపెనీ వెల్లడించింది. అధికారిక MIUI 11 రోల్-అవుట్ అక్టోబర్ 22 న ప్రారంభమవుతుంది మరియు ఈ నెల చివరిలో అప్డేట్ చేయబడిన తరువాత ఈ UI ని అందుకున్న మొదటి పరికరాలలో పోకో F1 ఒకటి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నిన్న లాంచ్ అయిన రెడ్మి నోట్ 8 ప్రో కు ఈ ఏడాది చివరి నాటికి MIUI 11 లభిస్తుంది. ఈ అప్డేట్ నాలుగు దశల్లో విడుదల అవుతుంది. అంతేకాకుండా, షావోమి వారి ప్రస్తుత పరీక్ష ప్రణాళికల ఆధారంగా తేదీలను నిర్ణయించినట్లు చెప్పారు, కాబట్టి వాస్తవ రోల్-అవుట్ తేదీలు మారవచ్చు.

దిగువ MIUI 11 ను అందుకోనున్న షావోమి స్మార్ట్‌ ఫోన్ల మొత్తం జాబితాను మీరు చూడవచ్చు.

మొదటి దశ : అక్టోబర్ 22-31

పోకో ఎఫ్ 1

రెడ్మి K 20

రెడ్మి Y 3

రెడ్మి 7

రెడ్మి నోట్ 7

రెడ్మి నోట్ 7 సె

రెడ్మి నోట్ 7 ప్రో

రెండవ దశ : నవంబర్ 4-12

రెడ్మి K 20 ప్రో

రెడ్మి 6

రెడ్మి 6 ప్రో

రెడ్మి 6 ఎ

రెడ్మి నోట్ 5

రెడ్మి నోట్ 5 ప్రో

రెడ్మి 5

రెడ్మి 5 ఎ

రెడ్మి నోట్ 4

రెడ్మి వై 1

రెడ్మి వై 1 లైట్

రెడ్మి వై 2

రెడ్మి 4

మి మిక్స్ 2

మి మాక్స్ 2

మూడవ దశ : నవంబర్ 13-29

రెడ్మి నోట్ 6 ప్రో

రెడ్మి 7 ఎ

రెడ్మి 8

రెడ్మి 8 ఎ

రెడ్మి నోట్ 8

4 వ దశ: డిసెంబర్ 18-26

రెడ్మి నోట్ 8 ప్రో

MIUI 11 లో కొత్త చిహ్నాలు, అల్ట్రా పవర్ సేవింగ్ మోడ్, సిస్టమ్-వైడ్ డార్క్ మోడ్ మరియు మరిన్ని ఉంటాయి. MIUI 11 ఒప్పో, వివో మరియు షావోమి కి  సహకరిస్తున్న క్రాస్-డివైస్ షేరింగ్ ఫీచర్‌ను జోడిస్తుందని చెప్పబడింది. ఇంకా, కొత్త MIUI 11 'ఆల్వేస్ ఆన్ డిస్ప్లే'కి కొత్త ఫీచర్లను జోడిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :