iPhone యూజర్లకు Telegram CEO హ్యాకింగ్ హెచ్చరిక.. జస్ట్ వెబ్‌ సైట్ ఓపెన్ చేసినా మీ డేటా లీక్ అయ్యే ప్రమాదం.!

Highlights

iPhone యూజర్లకు Telegram CEO హ్యాకింగ్ హెచ్చరిక

ఐఫోన్ యూజర్లు జస్ట్ వెబ్‌ సైట్ ఓపెన్ చేసినా మీ డేటా లీక్ అయ్యే ప్రమాదం

ఐఫోన్ యూజర్లను ఉలిక్కిపడేలా చేసిన ట్వీట్

iPhone యూజర్లకు Telegram CEO హ్యాకింగ్ హెచ్చరిక చేశారు. అయన తన అఫీషియల్ అకౌంట్ నుంచి ఈ హెచ్చరికని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సారాంశం చూస్తే, ఐఫోన్ యూజర్లు జస్ట్ వెబ్‌ సైట్ ఓపెన్ చేసినా మీ డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉన్నట్లు అర్థం అవుతోంది. అంతేకాదు, ఈ చాలా మంది డేటా ఇప్పటికే జరిగినట్లు కూడా ఆయన ట్వీట్ చెబుతోంది. ఐఫోన్ యూజర్లను ఉలిక్కిపడేలా చేసిన ఈ ట్వీట్ చేయడానికి దారి తీసిన కారణాలు తెలుసుకోండి.

iPhone యూజర్లకు Telegram CEO హ్యాకింగ్ హెచ్చరిక

పాత iOS వెర్షన్లను ఉపయోగిస్తున్న ఐఫోన్ యూజర్ల డేటా రక్షణకు సంబంధించిన ఒక హెచ్చరికను టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ జారీ చేశారు. తన అఫీషియల్ X అకౌంట్ నుంచి ఈ హెచ్చరిక జారీచేశారు. కొంతమంది వినియోగదారులకు టెలిగ్రామ్ యాప్‌ లోనే ఈ భద్రతా సూచనలు పంపినట్లు సమాచారం. అయితే, ఈ హెచ్చరిక వచ్చిన ప్రతి ఐఫోన్ హ్యాక్ అయిందని మనం అర్థం చేసుకోకుండా, పాత iOS ఐఫోన్ లో రక్షణ తక్కువగా ఉంటుందని అర్థం మనం చేసుకోవాలి.

ఇటీవల హెచ్చరికలు ఏమి చెబుతున్నాయి?

పాత iOS వెర్షన్లను ఉపయోగిస్తున్న ఫోన్లపై సైబర్ దాడులు జరిగే ప్రమాదం ఉందని గత కొన్ని రోజులుగా సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. అలా చేయని వారికి అనుకోకుండా ఏదో ఒక సందర్భంలో జస్ట్ ఒక హానికరమైన వెబ్‌ సైట్‌ ఓపెన్ చేయడం కూడా వారి ఐఫోన్‌ లోని భద్రతా లోపాలను హ్యాకర్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

ఇటీవల Coruna మరియు DarkSword వంటి ఎక్స్‌ప్లాయిట్ టూల్స్‌ తో ఐఫోన్ యూజర్లకు ముప్పు ఉన్నట్లు సెక్యూరిటీ రెసెర్చర్లు ప్రపంచానికి వెల్లడించారు. అయితే, పాత iOS వెర్షన్ ఉపయోగించే వారికి మాత్రమే ఈ ముప్పు పొంచి ఉనట్లు తెలిపారు. పాత iOS వెర్షన్ లో ఉన్న కొన్ని లోపాలు ఉపయోగించుకుని హ్యాకర్లు మాల్వేర్ వెబ్ కంటెంట్ ద్వారా దాడులు చేసి యూజర డేటా సేకరించే అవకాశం ఉంటుంది. ఈ విషయం పైన భారత సైబర్ భద్రతా సంస్థ CERT-In కూడా ఇటీవల కొత్త హెచ్చరిక జారీ చేసింది. అదేమిటంటే, పాత iOS మరియు Safari వెర్షన్లలోని పలు భద్రతా లోపాలు ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది.

ఐఫోన్ యూజర్లు ఏం చేయాలి?

మీ ఐఫోన్‌ లో Settings ఓపెన్ చేసి General విభాగంలో Software Update ఎంపికను ఎంచుకోండి. అందుబాటులో ఉన్న లేటెస్ట్ iOS అప్‌ డేట్‌ ను ఇన్‌ స్టాల్ చేయండి. తెలియని లింక్‌ లను ఓపెన్ చేయడం మరియు అనుమానాస్పద వెబ్‌ సైట్‌ లను వెతకడం మరియు ఓపెన్ చేయడం మానుకోండి. యాప్‌ లను కూడా అధికారిక App Store నుంచే డౌన్‌ లోడ్ చేసుకోవాలి.

ముఖ్యంగా, సాఫ్ట్‌ వేర్ అప్‌ డేట్‌ లను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకండి. కొత్త అప్ డేట్ ద్వారా ఇలాంటి సైబర్ ముప్పు నుంచి మీ ఐఫోన్ ని సురక్షితం ఉంచుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile