Traffic Challan: తెలంగాణ వాహనదారులకు రవాణా శాఖ షాకింగ్ న్యూస్.!
Traffic Challan: తెలంగాణ వాహనదారులకు రవాణా శాఖ షాకింగ్ న్యూస్
డిజిటల్ ట్రాఫిక్ చలాన్ వ్యవస్థను అమలు చేయడానికి సిద్దమయ్యింది
క్తివంతమైన CCTV కెమెరా వంటి అడ్వాన్స్ సాంకేతికతను కూడా వినియోగిస్తున్నారు.
Traffic Challan: తెలంగాణ వాహనదారులకు రవాణా శాఖ షాకింగ్ న్యూస్ అందించింది. ట్రాఫిక్ నిబంధనల అమలులో పారదర్శకత పెంచడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త తరం డిజిటల్ ట్రాఫిక్ చలాన్ వ్యవస్థను అమలు చేయడానికి సిద్దమయ్యింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త సిస్టం ను రాష్ట్రంలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాదు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ (ANPR) మరియు శక్తివంతమైన CCTV కెమెరా వంటి అడ్వాన్స్ సాంకేతికతను కూడా వినియోగిస్తున్నారు.
SurveyTraffic Challan: ఏమిటి కొత్త షాకింగ్ న్యూస్?
రవాణా శాఖ తెచ్చిన కొత్త వ్యవస్థలో ద్వారా వాహనదారులను ఆపకుండా కెమెరాల ద్వారానే ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి, ఆటోమేటిక్ గా ఈ-చలాన్లు జారీ చేయబడతాయి. సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి ఉల్లంఘనలు వెంటనే రికార్డ్ అవుతాయి. ANPR టెక్నాలజీ వాహన నంబర్ ప్లేట్ ను గుర్తించి, సంబంధిత వాహన యజమాని వివరాలతో చలాన్ ను అనుసంధానిస్తుంది.

ఈ వ్యవస్థలో అందించిన మరో కీలక మార్పు కూడా ఉంది. అదే డిజిటల్ నోటిఫికేషన్ విధానం మరియు మరింత వేగంగా ఉంటుంది. విషయం ఏమిటంటే, ట్రాఫిక్ చలాన్లు ఇక పై WhatsApp, SMS మరియు Email ద్వారా కూడా పంపబడతాయి. ఒకసారి పంపిన తర్వాత అది అధికారికంగా అందినట్లే పరిగణించబడతాయి. అందువల్ల వాహనదారులు తమ మొబైల్ నంబర్, ఇమెయిల్ వివరాలను వాహన్ (VAHAN) పోర్టల్ లో తప్పనిసరిగా అప్ డేట్ చేసుకోవాలి.
వాహనదారులు 30 రోజుల్లో విధిగా వారి పూర్తి వివరాలు వాహన్ పోర్టల్ లో అప్డేట్ చేయాలనీ కూడా రవాణా శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. చలానా అందుకున్న 45 రోజుల లోపు క్లియర్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అంటే, ట్రాఫిక్ రూల్స్ ఇప్పుడు మరింత కఠినంగా మారాయి. ఎవరు చూడటం లేదని ట్రాఫిక్ రూల్స్ ను పెడచెవిన పెట్టారంటే మీ జేబులు ఖాళీ అవ్వడం ఖాయం.
Also Read: SARTHAK PDS : రేషన్ కార్డు కలిగిన వారికి కేంద్రం గుడ్ న్యూస్.. కొత్త టెక్ తో రేషన్ పంపిణీ.!
Traffic Challan: ఆన్‌లైన్ పేమెంట్
డిజిటల్ చెల్లింపుల కోసం ప్రభుత్వం ఈ-చలాన్ పోర్టల్, UPI మరియు ఇతర ఆన్ లైన్ చెల్లింపు వ్యవస్థలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆన్ లైన్ విధానం ద్వారా పెండింగ్ చలాన్లను రియల్ టైమ్ లో తనిఖీ చేయవచ్చు మరియు వెంటనే చెల్లించే సౌలభ్యం కూడా అందించింది.
ఈ కొత్త ట్రాఫిక్ చలాన్ వ్యవస్థ వల్ల మానవ జోక్యం తగ్గుతుంది. అంతేకాదు, అవినీతి అవకాశాలు తగ్గడంతో పాటు రహదారి భద్రత కూడా మెరుగుపడుతుంది. డేటా ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ, ఆటోమేటెడ్ అమలు వ్యవస్థతో తెలంగాణ రాష్ట్రాన్ని స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ దిశగా ప్రభుత్వం ముందుకు తీసుకెళుతోంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
