Teachers’ Day 2024 శుభాకాంక్షలు, ఇమేజస్ మరియు స్టేటస్ డౌన్లోడ్ ఇలా చేసుకోండి.!

HIGHLIGHTS

సెప్టెంబర్ 5వ తేదీ రోజు గురువును పూజించుకోవడం ఆనవాయితీ

గురుపూజోత్సవ రోజు మీ గురువు గారికి కొత్తగా విషెస్ చెప్పండి

వాట్సాప్ లోని Meta AI ఫీచర్ ను నేరుగా ఉపయోగించుకోవచ్చు

Teachers’ Day 2024: ‘గురువును మించిన దైవం లేదు’ ఇది అక్షరాల నిజం. అందుకే, గురువును దైవంతో సమానంగా పూజిస్తారు. తల్లిదండ్రులు జీవితాన్ని ఇస్తే ఆ జీవితానికి ఒక అర్ధం మరియు పరమార్థం నేర్పించేది గురువు మాత్రమే. అందుకే, గురువును పూజించు కోవడానికి ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించారు. అదే సెప్టెంబర్ 5వ తేదీ మరియు ఈరోజు గురువును పూజించుకోవడం 1965 నుంచి ఆనవాయితీగా వస్తోంది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజును ‘గురుపూజోత్సవం’ గా జరుపుకుంటారు.

Teachers’ Day 2024:

గురువును పూజించుకునే ఈరోజు వారికి శుభాకాంక్షలు అందించడం కోసం తగిన ఇమేజ్ లు, కొటేషన్ మరియు స్టేటస్ వీడియో లను సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా అందరి ఫోన్ లలో కొలువై ఉన్న వాట్సాప్ లోని Meta AI ఫీచర్ ను నేరుగా ఉపయోగించుకోవచ్చు.

దీనికోసం వాట్సాప్ మెటా ఎఐ ట్యాబ్ లోకి వెళ్లి చాట్ బాక్స్ లో Teachers’ Day 2024 అని టైప్ చేయండి. వెంటనే మీకు హ్యాపీ టీచర్స్ డే శుభా శుభాకాంక్షలు తెలిపే ఇమేజ్ లు వస్తాయి. ఇందులో మీకు నచ్చిన ఇమేజ్ ను నేరుగా మీ గురువు గారికి షేర్ చేసి విష్ చేయవచ్చు.

అంతేకాదు, వాట్సాప్ లో ఉన్న మెటా ఎఐ ఫీచర్ తోనే కొత్త కొటేషన్ లను కూడా శే సెర్చ్ చేసి పొందవచ్చు. మీకోసం మంచి కొటేషన్ ఐడియా లు ఇక్కడ అందిస్తున్నాను.

“గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః”, దైవ సమానులైన గురువు గారికి 2024 గురుపూజోత్సవ శుభాకాంక్షలు.

“నిస్వార్ధమైన ప్రేమతో మా జీవితాల్లో వెలుగు నింపిన గురువు గారికి ఉపాధ్యాయ శుభాకాంక్షలు”

“ఎంత సుగంధాలు వెదజల్లినా మేము మీ చెట్టుకు పూచిన పువ్వులమే గురువు గారు, మీకు టీచర్స్ డే శుభాకాంక్షలు.

Also Read: రూ. 21,99 ధరకే మంచి ఫీచర్స్ తో పెద్ద QLED Smart Tv లాంచ్ చేసిన Daiwa.!

స్టేటస్ డౌన్లోడ్

టీచర్స్ డే 2024 కోసం స్టేటస్ కోసం యూట్యూబ్ నుంచి చాలా వీడియోలు అందుబాటులో ఉన్నాయి. యూట్యూబ్ డౌన్లోడర్ ద్వారా వీడియోలను డౌన్ లోడ్ చేసుకొని స్టేటస్ లో పెట్టుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :