అతి తక్కువ ధరకే స్మార్ట్ AC సిరీస్ లాంచ్ చేసిన TCL సంస్థ

HIGHLIGHTS

TCL తన ఎలైట్ సిరీస్ ఎయిర్ కండీషనర్లను భారత మార్కెట్లో విడుదల చేసింది.

అమెజాన్ నుండి కేవలం ఎంట్రీ లేవల్ ధర 23,990 రూపాయలతో లభిస్తుంది.

TCL AI అల్ట్రా-ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్లు గూగుల్ అసిస్టెంట్ మరియు TCLHome యాప్ లతో పనిచేస్తాయి

అతి తక్కువ ధరకే స్మార్ట్ AC సిరీస్ లాంచ్ చేసిన TCL సంస్థ

TCL తన ఎలైట్ సిరీస్ ఎయిర్ కండీషనర్లను భారతదేశంలో విడుదల చేసింది. ఈ AC ల ధర 23,990 రూపాయల నుండి ప్రారంభమవుతుంది మరియు ఈ AC లు అమెజాన్ ఇండియా నుండి లభిస్తాయి. ఈ అప్లయన్సెస్ TCL హోమ్ యాప్ తో పనిచేస్తాయి మరియు Google అసిస్టెంట్తో కూడా పనిచేస్తాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

గ్లోబల్ టాప్-2 టెలివిజన్ బ్రాండ్ మరియు ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ అయినటువంటి, TCL తన ఎలైట్ సిరీస్ ఎయిర్ కండీషనర్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పుడు అమెజాన్ నుండి  కేవలం ఎంట్రీ లేవల్ ధర 23,990 రూపాయలతో లభిస్తుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆధారితమైన, TCL AI అల్ట్రా-ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్లు గూగుల్ అసిస్టెంట్ మరియు TCLHome యాప్ లతో కలిసి స్మార్ట్ కనెక్టివిటీని నిర్ధారించడానికి పనిచేస్తాయి. ఎలైట్ ఎయిర్ కండిషనర్లు 60 డిగ్రీల సెల్సియస్ వరకు అధిక పరిసర ఉష్ణోగ్రతలో కూడా మంచి కూలింగ్ అందించడానికి రూపొందించబడ్డాయి.

TCL యొక్క ఎలైట్ సిరీస్ ఎయిర్ కండీషనర్ల యొక్క వినూత్న ఫీచరుగా  50% ఎనర్జీ ఆదా చేసే Ultra-Low  ఫ్రీక్వెన్సీ ఆపరేషన్ కోసం AI అల్ట్రా-ఇన్వర్టర్ కంప్రెసర్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. అల్ట్రా-ఇన్వర్టర్ కంప్రెసర్ అధిక ఫ్రీక్వెన్సీతో ప్రారంభించి గరిష్ట RPM వద్ద నడుపుతూ కేవలం 30 సెకన్లలో ఉష్ణోగ్రతను 18 డిగ్రీల సెల్సియస్ కు తగ్గించటానికి రూపొందించబడింది.

ఈ స్మార్ట్ ఎయిర్ కండీషనర్లలో టైటాన్ గోల్డ్ ఎవాపోరేటర్ మరియు కండెన్సర్ ఉన్నాయి.ఇది ఎవపోరేటర్ మరియు కండెన్సర్ యొక్క సామర్థ్యాన్ని మరియు జీవితాన్ని పెంచుతుంది. ఇందులో వున్న సిల్వర్ అయాన్ ఫిల్టర్, గదిలో వున్నా బ్యాక్టీరియాను తొలగించి  స్వచ్ఛమైన మరియు తాజా గాలిని అందిచడానికి సహాయపడుతుంది. అదనంగా, R32 పర్యావరణ అనుకూల రిఫ్రిజెరాంట్, డిజిటల్ ఉష్ణోగ్రత డిస్ప్లే , 100% రాగి గొట్టాలు (కాపర్ కోయిల్)  మరియు 4 Way గాలి ప్రవాహం కలగలిపి మొత్తంగా గదిలో ఒకే విధమైన  కూలింగ్  ని అందిస్తుంది. ఐ ఫీల్ టెక్నాలజీతో కూడిన అధునాతన రిమోట్ సెన్సార్ గది ఉష్ణోగ్రతను అధిక ఖచ్చితత్వంతో గ్రహించడంలో సహాయపడుతుంది.

భారతదేశంలో ఎలైట్ స్మార్ట్ ఎయిర్ కండీషనర్ సిరీస్ లాంచ్ గురించి TCL ఇండియా జనరల్ మేనేజర్ మైక్ చెన్ మాట్లాడుతూ “భారత మార్కెట్ కోసం మా ఈ న్యూ సిరీస్ అల్ట్రా-ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్లపై అమెజాన్ ప్రత్యేక ఆఫర్ తీసుకురావడం మాకు చాలా ఆనందంగా ఉంది.  ఈ ఎలైట్ సిరీస్ ఎయిర్ కండిషనర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తాయి మరియు అధిక ఉష్ణోగ్రత వాతావరణ పరిస్థితులలో వేగంగా కూలింగ్ ను అందించడానికి రూపొందించబడ్డాయి. అనేక స్మార్ట్ ఫీచర్లతో పాటు, ఈ ఎయిర్ కండిషనర్లు గూగుల్ అసిస్టెంట్ తో  కలిసి స్మార్ట్ కనెక్టివిటీని అందించగలవు మరియు కరెంట్ బిల్లులను తగ్గించడంలో సహాయపడతాయి. ”

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo