Talliki Vandanam: తల్లికి వందనం డబ్బులు పడలేదా, స్టేటస్ ఇలా చెక్ చేయండి.!

Updated on 14-Jun-2025
HIGHLIGHTS

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం ద్వారా లబ్ధిదారులకు అమౌంట్ ను రిలీజ్ చేసింది

అర్హులైన విద్యార్థులకు ఒక్కొక్కరికి 13 వేల రూపాయల చొప్పున జమ చేయడం ప్రారంభించింది

చాలా సులభంగా వారి తల్లికి వందనం స్టేటస్ ను చాలా సులభంగా చెక్ చేసుకోవచ్చు

Talliki Vandanam: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం ద్వారా లబ్ధిదారులకు అమౌంట్ ను రిలీజ్ చేసింది. నిన్నటి నుంచి ఈ తల్లికి వందనం పథకానికి అర్హులైన విద్యార్థులకు ఒక్కొక్కరికి 13 వేల రూపాయల చొప్పున జమ చేయడం ప్రారంభించింది. గత ప్రభుత్వం ‘అమ్మఒడి’ పేరుతో ఇంటికి ఒకరి చదువు కోసం 15 వేల రూపాయలు అందించగా, కూటమి ప్రభుత్వం మాత్రం ఇంట్లో చదువుకునే అందరికీ ఒక్కొక్కరికి రూ. 13,000 రూపాయల చొప్పున అందిస్తోంది. అయితే, కొందరికి అమౌంట్ ఇంకా డిపాజిట్ కాలేదని వాపోతున్నారు. అయితే, అర్హత ఉన్నవారికి మే 25 తేదీ వరకు ఈ అమౌంట్ డిపాజిట్ అవుతుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, విద్యార్థుల తల్లిదండ్రులు వారి స్టేటస్ ను వాట్సాప్ ద్వారా చాలా సులభంగా వారి తల్లికి వందనం స్టేటస్ ను చాలా సులభంగా చెక్ చేసుకోవచ్చు.

Talliki Vandanam: స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?

తల్లికి వందనం ప్రస్తుత స్టేటస్ ను ఆన్లైన్ లో చెక్ చేసుకోవడం చాలా సులభం. దీనికోసం మీరు ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం ఉండదు. దీనికోసం మీ స్మార్ట్ ఫోన్ లో ఉన్న వాట్సాప్ ను ఆశ్రయిస్తే సరిపోతుంది. ప్రజల అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ ఇందుకు సహాయం చేస్తుంది.

దీదీనికోసం, ప్రజలు వారి వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేసి ఆంధ్ర ప్రదేశ్ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 నెంబర్ తో చాట్ బాక్స్ పెన్ చేయాలి. ఇక్కడ మీకు మన మిత్ర (వాట్సాప్ గవర్నెన్స్) సేవల పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇందులో జస్ట్ ‘Hi’ అని టైప్ చేసి సెండ్ చేయండి. వెంటనే మీకు మెయిన్ మెనూ ఓపెన్ అవుతుంది. అందులో మీకు సర్వీస్ ఎంపికలు అందించబడతాయి. ఇందులో, తల్లికి వందనం సర్వీస్ ఎంచుకోండి.

ఎంచుకోగానే ఇందులో తల్లికి వందనం 2025 స్థితి ని ఎంచుకోండి. స్థితిని ఎంచుకోగానే క్రింద ఆధార్ నెంబర్ నమోదు చేయడానికి ఒక బాక్స్ అందిస్తుంది. ఇక్కడ తల్లి ఆధార్ కార్డ్ నెంబర్ ను ఎంటర్ చేసి క్రింద కనిపించే ‘నిర్ధారించండి’ పై నొక్కండి. అంటే, మీ అభ్యర్ధన గవర్నమెంట్ కి అందించబడుతుంది. ఈ అధ్యర్ధనను పూర్తిగా పరిశీలించి కొన్ని నిముషాల్లో మీ స్టేటస్ పూర్తి వివరాలు అందిస్తుంది.

Also Read: vivo Y400 Pro లాంచ్ అనౌన్స్ చేసిన వివో: అంచనా ఫీచర్స్ తెలుసుకోండి.!

గమనించాల్సిన విషయం ఏమిటంటే, మన మిత్ర పై మీరు అందించిన అధ్యర్ధనకు కొన్ని సార్లు వెంటనే రిప్లై పోవచ్చు మరియు కొంత సమయం తీసుకునే అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :