చైనా ప్రోడక్ట్స్ వద్దంటున్నాం, మరి మనం మరిచిపోయిన భారతీయ మొబైల్ కంపెనీలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో తెలుసా?

HIGHLIGHTS

ముందుగా మన దేశంలో కళకళలాడిన భారత మొబైల్ తయారీ సంస్థలు ఈరోజు కొన్ని పూర్తిగా మూతపడగా, మరికొన్ని చివరి దశలో కొట్టుమిట్టాడుతున్నాయి.

చైనా-భారత సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తత, భారత ప్రజలు చైనీయ ప్రొడక్స్ట్ ని బైకాట్ చేసే నినాదానికి దారి తీసిందని చెప్పవచ్చు.

ఈ మొబైల్ సంస్థల గురుంచి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

చైనా ప్రోడక్ట్స్ వద్దంటున్నాం, మరి మనం మరిచిపోయిన భారతీయ మొబైల్ కంపెనీలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా, కరోనా వైరస్ విళయతాండవం చేస్తుండగా, అన్ని దేశాలు కూడా చైనానే కారణమని చెబుతున్నాయి. ఇది ఎంతవరకూ నిజమో ప్రస్తుతానికి తెలియకపోయినా, నిజం నిలకడ మీద తెలుస్తుంది. అయితే, భారతదేశంలో మాత్రం చైనాలో తయారవుతున్న ప్రొడక్ట్స్, అంటే చైనీయ ప్రోడక్ట్స్ పైన మాత్రం విపరీతమైన ద్వేషాన్ని చూపిస్తున్నారు. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా, చైనా-భారత  సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తత కూడా దీనికి తోడవ్వడంతో, భారత ప్రజలు చైనీయ ప్రొడక్స్ట్ ని బైకాట్ చేసే నినాదానికి దారి తీసిందని చెప్పవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

చైనా ప్రోడక్ట్స్ వద్దంటున్నాం, మరి మనం మరిచిపోయిన మన భారతీయ మొబైల్ కంపెనీలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో తెలుసా?. అవును, ముందుగా మన దేశంలో కళకళలాడిన భారత మొబైల్ తయారీ సంస్థలు ఈరోజు కొన్ని పూర్తిగా మూతపడగా, మరికొన్ని చివరి దశలో కొట్టుమిట్టాడుతున్నాయి. మరి ఈ మొబైల్ సంస్థల గురుంచి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…                

                  

మరుగున పడిన మన భారతీయ మొబైల్ కంపెనీలు ఏవి?

1. మొదటి సంస్థ CREO

 భారతీయ మొబైల్ ఫోన్ కంపెనీ CREO ఇప్పుడు మూసివేయబడింది. మనము కంపెనీ వెబ్‌సైట్, అంటే creosense.com కి వెళితే, అది మూసివేయబడినందున ఇక్కడ ఏమి కనిపించదు మరియు ఈ సంస్థ యొక్క మొబైల్ ఫోన్ మార్కెట్లో అందుబాటులో లేదు. అంటే, ఇప్పుడు ఈ సంస్థ ఈ మార్కెట్ నుండి తన చేతులను పూర్తిగా వెనక్కి తీసుకుందని స్పష్టంగా చెప్పవచ్చు, అనగా స్మార్ట్ఫోన్ మార్కెట్ వాటాని. వాస్తవానికి, CREO అదే హార్డ్‌వేర్ స్టార్టప్ సంస్థ, ఇండియన్ మెసేజింగ్ ఆప్ Hike Messenger ఈ సంస్థను కొన్నది.

2. రెండవ సంస్థ YU Phones

YU Televenture యాజమాన్యంలోని YU Phones ‌ను సాధారణంగా Micromax అని పిలుస్తారు. దీనిని మైక్రోమాక్స్ యొక్క సోదరి సంస్థ అని పిలుస్తారు. మీరు ఈ సంస్థ ఫోన్‌లను అమెజాన్‌లో చూడవచ్చు. కానీ అవి కూడా గుంపులో కలిసిపోతాయి. ఈ సంస్థ యొక్క వెబ్‌సైట్ www.yuplaygod.com కూడా ఇప్పుడు అమలులో లేదు మరియు వారు తమ facebook పేజీలో  జూలై 2019 నుండి ఎటువంటి పోస్ట్ చేయ్యలేదు.

3. మూడవ సంస్థ Videocon

వీడియోకాన్ మొబైల్ రంగంలోకి కూడా ప్రవేశించింది. ఇది భారతదేశంలో ప్రసిద్ధ సంస్థగా కూడా పేరుగాంచింది. ఈ సంస్థ అనేకమైన మొబైల్ ఫోన్లను కూడా మర్కెట్లో ప్రవేశపెట్టింది. అమెజాన్, స్మార్ట్ ‌ఫోన్ విభాగంలో మీరు ఈ మొబైల్ ఫోన్‌లను చూడవచ్చు. మీరు దీన్ని మార్కెట్‌లో ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్‌లో కూడా పొందవచ్చు. కానీ మొబైల్ ఫోన్‌ల కోసం ఇది ఒక ప్రత్యేక వెబ్‌సైట్, videoconmobiles.com ను తీసుకొచ్చింది. కానీ, ప్రస్తుతం ఈ వెబ్సైట్ పనిచెయ్యడం లేదు.

4. నాల్గవ సంస్థ Celkon Mobile

ఈ సంస్థ ఇప్పటికీ తన ఫోన్‌లను విక్రయిస్తూనేవుంది మరియు Celkon Mobiles ఇప్పటికీ స్మార్ట్‌ ఫోన్‌ల రంగంలో నిలదొక్కుకొని నడుస్తోంది. ఈ సంస్థ యొక్క మొబైల్ ఫోన్లు ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ మార్కెట్లలో కూడా అందుబాటులో ఉంటాయి. కానీ, వారి వెబ్‌సైట్ మాత్రం మూసివేయబడింది, మీరు celkonmobiles.com కి వెళితే మీకు ఇక్కడ మూసివేసినట్లు కనిపిస్తుంది.

5. ఐదవ సంస్థ Spice Mobile

Spice Mobile యొక్క వెబ్‌సైట్ కూడా రన్ అవ్వడం లేదు మరియు దాని 2 ఫీచర్ ఫోన్‌లను ఆన్‌లైన్‌లో Flipkart ‌లో చూడవచ్చు. ఇది కాకుండా, దాని ఇతర ఫోన్‌లు ఎక్కడా కనిపించవు. అమెజాన్ ఇండియాలో ఈ సంస్థ యొక్క మొబైల్ ఫోన్ల జాబితా గురించి మనం మాట్లాడితే, ఇక్కడ మీరు ఒక మొబైల్ ఫోన్ మాత్రమే చూడగలరు, దీనికి ఒక మొబైల్ మాత్రమే మిగిలి ఉంది. అంటే ఈ సంస్థ కూడా పూర్తిగా తన ఉనికి కోల్పోవడానికి సిద్ధంగా ఉంది.

6. ఆరవ సంస్థ Onida

ఒనిడా ఒక పెద్ద భారతీయ ఎలక్ట్రానిక్ ఉపకరణాల (Electronic Appliances) తయారీ సంస్థ. ఈ సంస్థ, మొబైల్ ఫోన్ రంగంలోకి కూడా ప్రవేశించింది. ఈ సంస్థ యొక్క వెబ్‌సైట్ ఇంకా నడుస్తోంది, కానీ అందులో మొబైల్ ఫోన్‌ల గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. అయితే, ఇది అమెజాన్‌లో ఒక ఫోన్‌ను కలిగి ఉంది మరియు ఫ్లిప్‌కార్ట్‌లో ఎటువంటి ఫోన్ కనిపించదు.

7. ఏడవ సంస్థ iBall

దీనికి APPLE ‌తో ఎటువంటి సంబంధం లేదు. దాని వెబ్‌సైట్‌లో కూడా Tabs గురించి మాత్రమే చూపిస్తోంది. కాబట్టి Tablets కారణంగా స్మార్ట్ఫోన్ల ప్రపంచం నుండి iBall పూర్తిగా అదృశ్యం కాకుండా నిలబడిందని నేను అనుకుంటున్నాను.

8. ఎనిమిదవ సంస్థ Intex

Intex వెబ్‌సైట్ కూడా నడుస్తోంది. అయితే, ఫోన్‌ల పేరిట వెబ్‌సైట్‌లో ఫీచర్ ఫోన్లు మాత్రమే కనిపిస్తాయి. అమెజాన్‌లో, మీరు దాని ఫీచర్ ఫోన్‌తో పాటు స్మార్ట్‌ ఫోన్‌లను కూడా చూడవచ్చు. అయితే ఇది కూడా స్మార్ట్‌ఫోన్ రంగంలో అంత చురుకుగా ఉన్నట్లు అనిపించదు.

9. తొమ్మిదవ సంస్థ Karbonn Mobiles

Karbonn Mobiles వెబ్‌సైట్ కూడా ఇంకా నడుస్తోంది. ఇది సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంది, ఇది Twitter మరియు Facebook రెండింటిలోనూ దాని ఫీచర్ ఫోన్ గురించి ప్రచారం చేస్తుంది. ఈ సంస్థ యొక్క స్మార్ట్‌ ఫోన్‌లు మరియు ఫీచర్ ఫోన్‌లు ఆఫ్‌లైన్ మరియు Online ‌లో సులభంగా లభిస్తాయి.

10. Xolo పదవ సంస్థ

Xolo యొక్క వెబ్‌సైట్ కూడా రన్ అవుతోంది మరియు ఈ సంస్థ ఫోన్‌లను కూడా ఆన్‌లైన్‌లో మరియు ఆఫ్‌లైన్‌లో చూడవచ్చు. ఈ సంస్థ, వారి ట్విట్టర్ మరియు ఫేస్‌బుక్ నుండి 1 సంవత్సరం నుండి తప్పిపోయింది, కానీ ఒక సమయంలో మంచి మార్కును మరియు తనదైన ముద్రను సాధించిన సంస్థ ఇది.

11. Lava పదకొండవ సంస్థ

లావా ప్రధానంగా ఫీచర్ ఫోన్‌లను తయారు చేస్తుంది. ఇది స్మార్ట్‌ ఫోన్‌లు, టాబ్లెట్‌లు మరియు ల్యాప్‌టాప్‌ల రంగంలో కూడా చురుకుగా ఉన్నప్పటికీ, లావా యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది ఇతర కంపెనీలకు కూడా స్మార్ట్ ‌ఫోన్‌లను తయారు చేస్తుంది.బహుశా దీనికి కారణంగానే, ఈ సంస్థ ఇప్పటికీ మనుగడలో ఉంది.

12. Micromax పన్నెండవ సంస్థ

Micromax, దీని బ్రాండ్ అంబాసిడర్ అక్షయ్ కుమార్, ఈ ప్రోడక్ట్ ని ప్రోత్సహించడానికి ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టారు. అంతేకాదు, ఈ సంస్థ స్మార్ట్ ‌ఫోన్‌లు కూడా ఉత్తమమైనవి. అయితే, భారతదేశంలో చైనా కంపెనీలు తమ పట్టు సాధించడంతో, ఈ సంస్థ యొక్క ఫోన్లకు ఆదరణ కరువయ్యింది. కానీ చాలా త్వరగా, ఇది వేరువేరు సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ ధర గల స్మార్ట్ ‌ఫోన్‌ను ఇవ్వడం ద్వారా భారత మార్కెట్లో మరింత లోతుగా ప్రవేశించింది. అందుకే, మైక్రోమాక్స్ స్మార్ట్ ‌ఫోన్‌లు నేటికీ ఉన్నాయి. అయితే, మైక్రోమాక్స్ ఇప్పుడు మార్కెట్లో మాత్రం లేదు.

13. పదమూడవ సంస్థ Jio LYF

Jio LYF ఒక పెద్ద బ్రాండ్, మీరు ఈ సంస్థ యొక్క వెబ్‌సైట్‌లో వారి అన్ని ఫోన్‌ల సమాచారాన్ని పొందవచ్చు. మీరు ఈ ఫోన్‌లను ఆన్‌లైన్‌లో మరియు ఆఫ్‌లైన్‌లో కూడా చూడవచ్చు. స్మార్ట్ ‌ఫోన్ పరిశ్రమలో ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితుల కారణంగా, రాబోయే కాలంలో Jio వాటిని సద్వినియోగం చేసుకోవచ్చు.

వాస్తవానికి, ఇతర కంపెనీలు వాటి ప్రమోషన్ పైన ఎక్కువ దృష్టి పెడుతుండగా, చైనా కంపెనీలు మాత్రం R & D కోసం ఖర్చు చేశాయి మరియు మార్కెట్లో అటువంటి ఉత్పత్తులను ప్రవేశపెట్టాయి. ఆ ఉత్పత్తులు తమను తాముగా ప్రోత్సహించాయి, Motorised Camera , Rotating Camera , Flip Camera , చైనీస్ R & D యొక్క పరిధి ఏమిటంటే, మీరు చైనా మార్కెట్లో చాలా భిన్నమైన, వినూత్నమైన ఉత్పత్తులను పొందుతారు అని చెప్పకనే చెప్పడం.  ఈ రోజు మనం R & D పైన ద్రుష్టి సారిస్తే , దేశాన్ని Manufacturing Hub గా మార్చగల ప్రభుత్వ విధానాలపై దృష్టి పెట్టాలి. వాస్తవానికి, దీనికోసం ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo