స్పెక్స్ పోలిక : షావోమి రెడ్మి నోట్ 6 ప్రో vs షావోమి రెడ్మి నోట్ 5 ప్రో

HIGHLIGHTS

నేడు మేనము సరికొత్తగా విడుదలైన, షావోమి రెడ్మి నోట్ 6 ప్రో ను దాని మునుపటి షావోమి రెడ్మి నోట్ 5 ప్రో తో సరిపోల్చనున్నాము.

షావోమి కోత్తగా, రెడ్మి నోట్ 6 ప్రో ను ఇండియాలో విడుదల చేసింది, ఇది నవంబర్ 23 నుండి Flipkart నుండి అందుబాటులో ఉంటుంది . ఈ Xiaomi Redmi Note 6 Pro కూడా ముందు మరియు వెనుక కూడా డ్యూయల్ కెమెరాలలో మొత్తంగా నాలుగు కెమెరాలు కలిగిన, ఈ బ్రాండ్ యొక్క మొదటి బడ్జెట్ స్మార్ట్ఫోన్. ఇది ఒక 6.26 అంగుళాల FHD + డిస్ప్లేని కలిగి ఉంటుంది, ఇది డిస్ప్లే యొక్క పైభాగంలో నోచ్ ని కలిగి ఉంటుంది. ఇంకొక వైపు, ముందుగా వచ్చిన ఈ Xiaomi Redmi Note 5 Pro ను సంస్థ "కెమెరా బీస్ట్" అని సంభోదించింది. అయితే, ఇపుడు ఈ రెండింటిని సరిపోల్చి మనం చెల్లించే డబ్బు సరిపడే మార్పులు ఈ కొత్త ఫోన్ తీసుకొచ్చిందో లేదో? చూడటానికి ఈ రెండు పరికరాల యొక్క వివరాలను పోల్చి చూద్దాం.

షావోమి రెడ్మి నోట్ 6 ప్రో, 1080 x 2160 పిక్సెల్స్ యొక్క రిజల్యూషన్ను అందించే ఒక 6.26-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. మరోవైపు, షావోమి రెడ్మి నోట్ 5 ప్రో ఒక 5.99-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది, ఇది కూడా 1080 x 2160 పిక్సల్స్ యొక్క రిజల్యూషన్ను అందిస్తుంది. అయితే, షావోమి రెడ్మి నోట్ 6 ప్రో యొక్క  డిస్ప్లే పైన ఒక నోచ్  అందించబడింది, షావోమి రెడ్మి నోట్ 5 ప్రో మాత్రం నోచ్ కలిగి ఉండదు. అంతేకాకుండా, పెద్దగా స్క్రీన్ వలన వారి స్మార్ట్ ఫోన్లో కంటెంట్ను చూడడానికి ఎక్కువగా సమయాన్ని గడిపినవారికి ఇది మంచిది.

దీని ప్రాసెసర్ విషయానికి వస్తే, షావోమి రెడ్మి నోట్ 6 మరియు షావోమి రెడ్మి నోట్ 5 ప్రో  రెండూకూడా ఒకేవిధమైన ప్రాసెసెరుతో వస్తాయి . ఈ రెండు పరికరాలు  క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 636 ప్రాసెసర్, 4GB RAM మరియు 64GB అంతర్గత మెమరీతో జతచేయబడ్డాయి.

ఇక కెమేరా విభాగానికి వస్తే, రెడ్మి నోట్ 6 లో షావోమి చేసిన గమనించదగ్గ మార్పులలో ఒకటిగా దీని యొక్క  కెమెరాలను గురించి చెప్పుకోవచ్చు. షావోమి  రెడ్మి నోట్ 6 ప్రో, ముందుభగంలో డ్యూయల్ 20MP + 2MP యూనిట్తో పాటు డ్యూయల్ 12MP + 5MP వెనుక కెమెరాతో వస్తుంది. మరొక వైపు, షావోమి  రెడ్మి నోట్ 5 ప్రో ముందు 20MP యూనిట్ తో డ్యూయల్ 12MP + 5MP వెనుక కెమెరా కలిగి ఉంది.

షావోమి రెడ్మి నోట్ 5 ప్రో రూ .14,999 ధర వద్ద ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తుంది, షావోమి రెడ్మి నోట్ 6 ప్రో రూ .12,999 నుండి ప్రారంభమవుతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :