ఎన్ని రోజులు రీఛార్జ్ చేయకపోతే SIM Card డీయాక్టివేట్ అవుతుందో తెలుసా.!

Updated on 03-Sep-2025
HIGHLIGHTS

ప్రస్తుతం ఒక మొబైల్ నెంబర్ మెయింటైన్ చేయడం అంటే పెద్ద సమస్యగా లేదా భారంగా మారింది

ఛార్జ్ చేయకపోతే మెల్లగా బంద్ అవ్వడమే కాకుండా చివరికి SIM Card డీయాక్టివేట్ చేయబడుతుంది

ఎన్ని రోజులు రీఛార్జ్ చేయకపోతే SIM Card డీయాక్టివేషన్ అవుతుందో తెలుసుకోవడం మంచిది

ప్రస్తుతం ఒక మొబైల్ నెంబర్ మెయింటైన్ చేయడం అంటే పెద్ద సమస్యగా లేదా
భారంగా మారింది. 5G నెట్ వర్క్ వచ్చిందని సంతోషించాలో లేక మొబైల్ రీఛార్జ్ రేట్లు భారీగా పెరిగాయని బాధపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే, రీఛార్జ్ చేయకపోతే మెల్లగా ఇన్ కమింగ్ కాల్స్, SMS బంద్ అవ్వడమే కాకుండా చివరికి SIM Card సైతం డీ యాక్టివేట్ చేయబడుతుంది. అందుకే, ఎంత ఖర్చైనా భరిస్తూ ఒక మొబైల్ నెంబర్ ను కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే, ఎన్ని రోజులు రీఛార్జ్ చేయకపోతే SIM Card డీయాక్టివేషన్ అవుతుందో తెలుసుకోవడం మంచిది.

రీఛార్జ్ చేయకపోతే SIM Card డీ యాక్టివేషన్ అవుతుందా?

అవును, మీరు మీ మొబైల్ నెంబర్ ను రెగ్యులర్ గా రీఛార్జ్ చేయకపోతే సిమ్ కార్డ్ డీ యాక్టివేషన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే, ఇది వెంటనే జరగదు మరియు దీనికి కొంత టైమ్ లిమిట్ ఉంటుంది. అంతేకాదు, ప్రతి టెలికాం కంపెనీ కూడా వారి వారి టైమ్ ను ప్రకటించాయి. కానీ, ఇవన్నీ కూడా TRAI కనుసన్నల్లోనే ఈ పనులు చేయాల్సి ఉంటుంది. అంటే, ట్రాయ్ అందించిన రూల్స్ కు అనుగుణంగా మాత్రమే రీఛార్జ్ చేయని వారి టైమ్ ముగిసిన తర్వాత వారి సిమ్ డీ యాక్టివేట్ చేసే అవకాశం ఉంటుంది.

ఎన్ని రోజులు రీఛార్జ్ చేయకపోతే SIM Card డీ యాక్టివేషన్ అవుతుంది?

TRAI దీనికోసం అన్ని టెలికాం కంపెనీలకు దిశానిర్దేశం అందించింది. 30 రోజులు వరకు రీచార్జ్ చేయనట్లయితే, SIM లు, ఇన్‌కమింగ్ కాల్స్ మరియు SMS రిసీవ్ కోసం అవకాశం ఉంటుంది. ఇక 60 రోజులు దాటితే మాత్రం అవుట్‌ గోయింగ్ కాల్స్ మరియు SMS కూడా బ్లాక్ చేయబడతాయి. ఇక 90 రోజులు వరకు నెంబర్ వాడకం లేకపోతే లేదా రీఛార్జ్ చేయనట్లయితే ఇన్‌కమింగ్ కూడా పూర్తిగా ఆగిపోతుంది మరియు ఆ తర్వాత ఆ SIM డీ యాక్టివేట్ చేయబడుతుంది. ఇలా ఒకసారి నెంబర్ డీయాక్టివేట్ కనుక అయితే ఆ నంబర్‌ను తిరిగి వేరే యూజర్లకు ప్రొవైడ్ చేస్తారు. అంటే, మీ మొబైల్ నెంబర్ తిరిగి పొందడం అసాధ్యం.

అయితే, ఇంకొక రూల్ లేదా గ్రేస్ పీరియడ్ కూడా ఒకటి వుంది. అదేమిటంటే, మొబైల్ నెంబర్ పై రూ. 20 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్ కనుక ఉంటే వారికి 30 రోజుల గ్రేస్ పీరియడ్ లబిస్తుంది. అంటే, ఇప్పుడు మొత్తం 120 రోజుల వ్యవధి లభిస్తుంది. ఆ తరువాత మొబైల్ నెంబర్ ను డీ యాక్టివేట్ చేసే అవకాశం ఉంటుంది.

Also Read: 900W హెవీ సౌండ్ తో Dolby Atmos సౌండ్ బార్ లాంచ్ చేసిన Zebronics

డీ యాక్టివేషన్ తర్వాత నెంబర్ మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశం ఉంటుందా?

అవును, మొబైల్ నెంబర్ డీ యాక్టివేట్ చేయబడిన తర్వాత కూడా తిరిగి యాక్టివేట్ చేసే వెసులుబాటును TRAI అందించింది. మొబైల్ డీ యాక్టివేట్ అయిన 15 రోజుల లోపల రూ. 20 రూపాయలు రుసుము చెల్లించి నెంబర్ ను యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉంది. అయితే, ఈ టైమ్ లోపల యాక్టివేట్ చేయకుంటే ఆ నెంబర్ శాశ్వతంగా డే యాక్టివేట్ చేయబడి మరొకరి చేతుల్లోకి వెళుతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :