Samsung Galaxy Unpacked 2026 date announced for new products launch
Samsung Galaxy Unpacked 2026: శాంసంగ్ అతి పెద్ద ఈవెంట్ డేట్ అండ్ టైం ను ఈరోజు శాంసంగ్ రివీల్ చేసింది. ఈ అప్ కమింగ్ బిగ్ ఈవెంట్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ మరియు మరిన్ని ఇతర ప్రొడక్ట్స్ లాంచ్ చేసే అవకాశం ఉంది. కేవలం ఈ లాంచ్ ఈవెంట్ డేట్ మాత్రమే కాదు ఈ ఈవెంట్ మంచి బెనిఫిట్స్ అందుకునేలా ప్రీ రిజర్వేషన్ ప్రోగ్రామ్ ను కూడా ప్రకటించింది.
ప్రీమియం సిరీస్ మరియు మోడల్స్ ను లాంచ్ చేయడానికి శాంసంగ్ ప్రతీ సంవత్సరం గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్ ను నిర్వహిస్తుంది. ఈ ఈవెంట్ నుంచి గెలాక్సీ S సిరీస్ ఫోన్లు మరియు బడ్స్ తో పాటు టాబ్లెట్ వంటి ప్రొడక్ట్స్ ను విడుదల చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. గత సంవత్సరం జనవరి నెలలో నిర్వహించిన ఈ అన్ ప్యాక్డ్ ఈవెంట్ నుంచి శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్ మరియు Z ఫోల్డ్ 7 సిరీస్ నుంచి ఫోల్డ్ ఫోన్లు కూడా విడుదల చేసింది.
శాంసంగ్ గెలాక్సీ అన్ ప్యాక్డ్ 2026 ఈవెంట్ 25 ఫిబ్రవరి 2026 తేదీ రాత్రి 11 గంటల 30 నిమిషాలకు జరుగుతుంది. ఈ కార్యక్రమం కోసం ముందుగా ప్రీ రిజర్వ్ బెనిఫిట్స్ ప్రోగ్రాం ను కూడా శాంసంగ్ అందించింది. ఇందులో భాగంగా అనేక ప్రొడక్ట్స్ కోసం ముందస్తు రిజర్వేషన్ పేజి ని కూడా అమెజాన్ ద్వారా అందించింది. ఈ కార్యక్రమం అమెరికా లోని శాన్ ఫ్రాన్సిస్కో లో జరుగుతుంది. అందుకే, ఇండియాలో అర్ధరాత్రి లైవ్ చేయబడుతుంది.
ఇక ప్రీ రిజర్వేషన్ బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఇందులో లేటెస్ట్ Galaxy AI డివైజ్ ను రూ. 999 తో రిజర్వేషన్ చేసుకుంటే రూ. 2,699 వరకు బెనిఫిట్స్ పొందవచ్చని తెలిపింది. ఇది కాకుండా ఎక్స్ క్లూజివ్ అమెజాన్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ ప్రత్యేకమైన ఆఫర్ తో ఇప్పుడు ప్రీ రిజర్వ్ చేసుకుంటే రూ. 50,000 రూపాయల విలువైన బహుమతులు పొందవచ్చని చెబుతోంది.
ప్రీ రిజర్వ్ నెక్స్ట్ గెలాక్సీ బుక్ చేయడం చాలా సింపుల్ గా ఉంటుంది. దీనికోసం ముందుగా మీరు అమెజాన్ అందించిన Pre Reserve బటన్ పై నొక్కండి. ఇది మిమ్మల్ని నేరుగా అమెజాన్ పే గిఫ్ట్ కార్డు సెక్షన్ కు తీసుకెళుతుంది. ఇక్కడ రూ. 999 చెల్లించి గిఫ్ట్ కార్డు కొనుగోలు చేయండి. 24 గంటల్లో మీకు ఈ గిఫ్ట్ కార్డు ఇమెయిల్ ద్వారా అందించబడుతుంది. అంటే, మీరు మీ అప్ కమింగ్ గెలాక్సీ డివైజ్ ను విజయవంతంగా ప్రీ రిజర్వ్ చేసుకున్నారు. మీకు వచ్చిన గిఫ్ట్ ఐకాన్ పై నొక్కడం ద్వారా శాంసంగ్ మీకు అందించిన బహుమతి క్లెయిమ్ చేసుకోవచ్చు.
Also Read: కేవలం 36 వేలకే బ్రాండెడ్ 65 ఇంచ్ Dolby Vision Smart Tv అందుకోండి.!
కంపెనీ ఈ అప్ కమింగ్ ఈవెంట్ నుంచి లాంచ్ చేయనున్న ప్రొడక్ట్స్ గురించి ఎటువంటి వివరాలు ఇంకా రివీల్ చేయలేదు. అయితే, ఈ అప్ కమింగ్ ఈవెంట్ నుంచి శాంసంగ్ గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా, ఎస్ 26 ప్లస్ మరియు ఎస్ 26 ప్రీమియం సిరీస్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. ఇదే కాదు, గెలాక్సీ బడ్స్ 4 సిరీస్ మరియు One UI 8.5 మరియు గెలాక్సీ AI మెరుగుదల కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ ఫోన్ లాంచ్ కోసం ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి, ఈ అప్ కమింగ్ ఈవెంట్ మరిన్ని అప్‌డేట్స్ త్వరలో అందించవచ్చని ఊహిస్తున్నారు.