AI Misuse: సోషల్ మీడియాలో AI దుర్వినియోగంపై కేంద్రం కొత్త చట్టం.!

HIGHLIGHTS

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ - AI టెక్నాలజి ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది

సోషల్ మీడియా మరియు సైబర్ ప్రపంచంలో AI దుర్వినియోగం మరింత ఎక్కువగా పెరుగుతోంది

ప్రభుత్వం ఏఐ ని కంట్రోల్ చేయడానికి అప్రమత్తమవుతోంది

AI Misuse: సోషల్ మీడియాలో AI దుర్వినియోగంపై కేంద్రం కొత్త చట్టం.!

కృత్రిమ మేధస్సు (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ – AI) టెక్నాలజి ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే విద్య, వైద్యం, పరిశ్రమలు, బ్యాంకింగ్, వ్యవసాయం వంటి అనేక రంగాల్లో AI ఉపయోగకరమైన మార్పులు తీసుకు వచ్చింది. అయితే, అదే సమయంలో సోషల్ మీడియా మరియు సైబర్ ప్రపంచంలో AI దుర్వినియోగం మరింత ఎక్కువగా పెరుగుతోంది. అందుకే, ప్రభుత్వం ఏఐ ని కంట్రోల్ చేయడానికి అప్రమత్తమవుతోంది. అందుకే, AI దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలనే అంశం పై నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

AI దుర్వినియోగం పై కేంద్రం దృష్టి ఎందుకు?

ఇటీవలి కాలంలో AI సాయంతో తయారయ్యే డీప్‌ ఫేక్ వీడియోలు, నకిలీ ఫోటోలు, వాయిస్ క్లోనింగ్, తప్పుడు వార్తలు, ఆన్‌ లైన్ మోసాలు బాగా పెరిగాయి. అంతేకాదు, నకిలీ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రజలను మభ్యపెట్టే ఘటనలు కూడా పెరిగాయి. కొంత మంది నేరస్థులు ప్రముఖుల పేర్లు, ఫోటోలు, వాయిస్ ను AI ద్వారా అనుకరించి ప్రజలను మోసం చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రతి ఒక్కరికి వారి వ్యక్తిగత ప్రైవసీ, ఆర్థిక భద్రత మరియు సామాజిక విశ్వాసం పై ప్రతికూల ప్రభావం పడుతోంది.

AI Misuse

అయితే, దీనికోసం చట్టాలు లేవా? అని మీరు అనుకోవచ్చు. దేశంలో సమాచార సాంకేతిక చట్టం (IT Act), డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం ఇప్పటికే అమలులో ఉంది అయితే, ఇలాంటి చట్టాలు ఉన్నప్పటికీ, వేగంగా మారుతున్న AI సాంకేతికతకు సంబంధించిన ప్రతి సమస్యను అవి పూర్తిగా పరిష్కరించేలా లేవని నిపుణులు భావిస్తున్నారు. అందుకే, AI వినియోగానికి స్పష్టమైన మార్గదర్శకాలు, బాధ్యతలు, శిక్షలు మరియు భద్రతా ప్రమాణాలు తో కూడిన ప్రత్యేక చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం యోచిస్తున్నట్లు చెబుతున్నారు.

అయితే, కొత్త చట్టం రూపొందించే సమయంలో ఒక కీలక అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అదేమిటంటే, AI ఆవిష్కరణలకు అడ్డంకులు కలగకుండా, అదే సమయంలో ప్రజల హక్కులు, ప్రైవసీ మరియు డిజిటల్ భద్రతకు రక్షణ కల్పించేలా సమతుల్య విధానం ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వలన సాంకేతిక అభివృద్ధిని ప్రోత్సహించడమే కాకుండా దుర్వినియోగాన్ని కట్టడి చేసే చట్టంగా ఉండటమే కాకుండా సమర్థవంతంగా పనిచేస్తుంది.

Also Read: ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ ప్రైమ్ డే సేల్ నుంచి అతి చవక ధరలో లభిస్తోంది.!

నిజానికి, AI వల్ల కలిగే ప్రయోజనాలు అపారమైనవి. కానీ ఏఐ దుర్వినియోగాన్ని నిరోధించేందుకు ప్రభుత్వం, టెక్ కంపెనీలు, సోషల్ మీడియా వేదికలు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, అలాగే ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. సరైన చట్టపరమైన వ్యవస్థ, అవగాహన కార్యక్రమాలు, ఆధునిక సైబర్ భద్రతా చర్యలు కలిసి పనిచేస్తే డిజిటల్ ప్రపంచాన్ని మరింత సురక్షితంగా మార్చడం సాధ్యమవుతుందని నిపుణులు చివరి మాటగా తెలిపారు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile