reports saying AP government planning to bring Digital Ration Cards with qr code
Digital Ration Card: క్యూఆర్ కోడ్ తో రేషన్ అందించే కొత్త కార్డు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు కొత్త రిపోర్ట్ చెబుతోంది. ఇప్పటి వరకు కొనసాగిన సంప్రదాయ రేషన్ కార్డులకు స్వస్తి పలికి క్యూఆర్ కోడ్ తో కూడిన కొత్త డిజిటల్ రేషన్ కార్డ్ లేదా స్మార్ట్ రేషన్ కార్డు కోసం ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. అయితే, నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కొత్త నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ కొత్త ర్డు ఎప్పటి వరకు వస్తుందో కచ్చితమైన డేటా లేదా వివరాలు ఇంకా వెల్లడించలేదు. అయితే, ఇది క్యూఆర్ కోడ్ తో రేషన్ అందించే విధంగా ఉంటుందని చెబుతున్నారు. మరి ఈ కొత్త డిజిటల్ రేషన్ కార్డ్ ఏమిటో, ఈ కార్డు ఎలా ఉంటుందో మరియు దాని ఉపయోగాలు ఏమిటో తెలుసుకోండి.
ఇది కొత్త తరహా మరియు సులభమైన యాక్సెస్ కలిగే డిజిటల్ రేషన్ కార్డ్ గా వస్తుంది. దీన్ని స్మార్ట్ రేషన్ కార్డు అని కూడా పిలిచే అవకాశం ఉంటుంది. ఇది కేవలం ఆధార్ లేదా పాన్ కార్డ్ సైజులో ఉండే అవకాశం ఉంటుంది. ఈ డిజిటల్ రేషన్ కార్డ్ చిన్న సైజులో ఉన్నా కూడా క్యూఆర్ కోడ్ తో వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ తో స్కాన్ చేయడం ద్వారా రేషన్ తీసుకోవచ్చు.
దేశంలో ఉన్న నకిలీ రేషన్ కార్డు లను ఏరివేయడానికి ఇది సహాయం చేస్తుందని పలువురు చెబుతున్నారు. అంతేకాదు, ఈ కొత్త డిజిటల్ రేషన్ కార్డు ఆధార్ కార్డుతో లింక్ అయ్యి ఉంటుంది. అంటే, ఇది పూర్తి సెక్యూర్ మరియు ప్రభుత్వ అనుమతి పొందిన పత్రంగా ఉంటుంది. ఇది కేంద్ర డేటా బేస్ తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ కార్డు పై ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా సింపుల్ గా ఉంటుంది.
Also Read: భారీ డిస్కౌంట్ కేవలం రూ. 14,699 ధరకే లభిస్తున్న బ్రాండెడ్ 43 ఇంచ్ QLED Smart Tv
ఈ కొత్త డిజిటల్ రేషన్ కార్డ్ తో ఇన్స్టాంట్ (తక్షణ) వెరిఫికేషన్ చాలా సులభం అవుతుంది మరియు మాన్యువల్ పని తగ్గుతుంది. డాక్యుమెంట్స్ పై నేతల ఫొటోలు మరియు కొత్త ప్రభుత్వం రాకతో కొత్త రేషన్ కార్డు మార్పులు వంటి సమస్య తగ్గిపోతుంది. నకిలీ రేషన్ కార్డ్ సమస్య తగ్గిపోతుంది. ఈ కొత్త కార్డ్ కేవలం పాన్ కార్డు సైజులో ఉంటుంది కాబట్టి క్యారీ చేయడం చాలా సులభంగా అవుతుంది.
డిజిటల్ రేషన్ కార్డు పై తెలంగాణా ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు కాబట్టి త్వరలోనే తెలుగు ప్రజలకు ఈ కొత్త డిజిటల్ లేదా స్మార్ట్ రేషన్ కార్డు అందించే అవకాశం ఉంటుంది. అయితే, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ విషయం పై అధికారిక ప్రకటన ఇచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుంది.
Note : పైన అందించిన ఫోటో AI platform పై క్రియేట్ చేయబడిన ఫోటో. ఇందులో ఎవరి డేటా లేదా వివరాలు వెల్లడించలేదు.