Remove China Apps ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ లో టాప్ ఫ్రీ యాప్ గా నిలిచింది

Remove China Apps ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ లో టాప్ ఫ్రీ యాప్ గా నిలిచింది
HIGHLIGHTS

చైనా వ్యతిరేక భావం భారతీయుల్లో అధికంగా నిండుకుంది.

అందుకే, చైనీస్ యాప్స్ ని తొలగించే APP వచ్చేసింది.

చైనా Apps తొలగించాలి అనే ఒకే ధోరణితో ఇంటర్నెట్‌లో కామెంట్స్ చక్కర్లు కొడుతున్నాయి. అందుకే, చైనీస్ యాప్స్ ని తొలగించే APP వచ్చేసింది. ఇది మీ Android స్మార్ట్‌ఫోన్ నుండి చైనీస్ యాప్స్ ని తొలగించడంలో మీకు సహాయపడుతుంది. అదే, Remove China Apps. ఈ యాప్, మే 17 న PlayStore ‌లో విడుదలైంది మరియు అప్పటి నుండి ఒక మిలియన్ డౌన్‌లోడ్స్ చేరుకుంది. ఇది మీఫోనులో ఏవైనా చైనా యాప్స్ ఉంటే  వాటిని ఆటొమ్యాటిగ్గా గుర్తించగలదు మరియు  మీ ఫోన్ నుండి ఆ యాప్స్ ని అన్‌ఇన్‌స్టాల్ చేయడానికి వినియోగదారుకు ఎంపికను అందిస్తుంది.

రెండు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ వివాదాల కారణంగా చైనా వ్యతిరేక భావం భారతీయుల్లో అధికంగా నిండుకుంది. అందుకే,  ప్రస్తుత తరుణంలో, లోకల్ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా చైనా ఉత్పత్తులను తొలగించాలని భారత ప్రధానమంత్రి ఒత్తిడి తెస్తున్న తరుణంలో ఈ లేటెస్ట్ యాప్ అవతరించింది. తత్ఫలితంగా, భారతీయ ప్రజలు అనేక మంది ప్రముఖులు కూడా  ముందంజలో ఉన్న చైనీస్ ఉత్పత్తులను బహిష్కరించడానికి చక్కని మార్గాలను చూడవచ్చు.

ఇప్పటికే, Remove China Apps యాప్  గూగుల్ ప్లే స్టోర్‌లో పది మిలియన్ డౌన్‌లోడ్లతో 4.8 రేటింగ్‌ ను కలిగి ఉన్నాయి మరియు ప్లే స్టోర్‌లోని ప్రధాన ఉచిత యాప్ జాబితాలో న్యూమెరో యునో స్థానంలో ఉన్నాయి. ఆసక్తికరంగా, ఆండ్రాయిడ్ యాప్ స్టోర్‌లో టాప్ ఉచిత యాప్స్ కావాల్సిన ఆరోగ్య సేతు కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ స్థానాన్ని ఇది పడగొట్టింది.

Remove China Apps ఎలా పని చేస్తాయి?

రిమూవ్ చైనా యాప్స్, జైపూర్ ఆధారిత వన్‌టచ్ AppLabs అభివృద్ధి చేసింది.  దీనిని “ఎడ్యుకేషనల్ కేటగిరి యాప్ ” గా పేర్కొంది. ఈ యాప్  మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయబడిన యాప్స్ యొక్క మూలాన్ని గుర్తిస్తుంది మరియు వినియోగదారులు వాటిని ఎంచుకుంటే ఈ యాప్స్ అన్‌ఇన్‌స్టాల్ చేయడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది.

యాప్ అందించిన సమాచారానికి సరైనదా లేదా తప్పుగా ఉన్నదా అనేడానికి డెవలపర్లు బాధ్యత వహించరని మరియు "వినియోగదారులు వారి ఇష్టానుసారం మాత్రమే పనిచేయాలి" అని హెచ్చరించారు. ఎందుకంటే “మార్కెట్ సెర్చ్” ఆధారంగా యాప్  యొక్క మూలం ఉన్న దేశాన్ని ఈ యాప్ కనుగొంటుంది. అంతేకాకుండా, డెవలపర్లు పెరుగుతున్న జనాదరణ పొందిన యాప్స్ పైన తమ వైఖరిని స్పష్టం చేశారు. కానీ, ఇక్కడ సానుకూల విషయం ఏమిటంటే ఈ యాప్ ఏ యాప్ ని కూడా అన్‌ఇన్‌స్టాల్ చేయమని ప్రజలను బలవంతం చేయదు, అని సంస్థ పేర్కొంది.

అయితే, మా ఫోన్ల నుండి యాప్స్ తొలగించడానికి మాకు ప్రత్యేకమైన యాప్ అవసరమా?  అనే ప్రశ్న మనకు అన్నింటి కంటే ముందుగా వచ్చే ప్రశ్న అవునా?.

Remove China Apps ఎందుకు ?

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, భారతదేశం మరియు చైనా మధ్య రాజకీయ వివాదం మరియు మేడ్ ఇన్ ఇండియా వస్తువులను స్వీకరించడానికి ప్రోత్సహహించడం చేయాలంటే,  పౌరులు తమ జీవితంలో ముందునుండే కొనసాగుతున్న  చైనా ప్రభావాలను వదిలించుకోవడానికి, ముందుగా చైనా యాప్స్ తొలగించడం వంటి యాప్స్ ఉపయోగించి చురుకుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొబైల్ ఫోన్లు మరియు యాప్స్ తో సహా చైనీస్ ఉత్పత్తులను బహిష్కరించడంపై ఆన్‌లైన్‌లో చాలా కోలాహలంగా ఉంది.

తక్షాషిలా ఇనిస్టిట్యూషన్‌కు చెందిన మనోజ్ కేవల్‌రామణి ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తికి చైనా కారణమని 67 శాతం మంది భారతీయులు భావిస్తున్నారు. నమూనా పరిమాణం 1299 మంది వ్యక్తుల ప్రతిస్పందనలను నమోదు చేయగా, ఆన్‌లైన్ చాటింగ్ ఇప్పుడు ఎక్కువగా భారతదేశం నుండి చైనీస్ వస్తువులు మరియు సర్వీస్ ను బహిష్కరించడం చుట్టూ తిరుగుతున్నాయి.

"వోకల్ ఫర్ లోకల్" ఉత్పత్తులు మరియు మేడ్ ఇన్ ఇండియా వస్తువులు మరియు సేవల వైపుగా మళ్ళమని భారత ప్రధానమంత్రి, ప్రజలను కోరిన తరువాత ఇది జరిగింది. దీని ఫలితంగా చైనా ఉత్పత్తులు, కంపెనీలు మరియు సర్వీసులకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది.

ఇతర యాప్స్ అన్‌ఇన్‌స్టాల్ చేయడానికి మీరు చైనా యాప్స్ తీసివేయాలా?

Remove China Apps యాప్ ముందే ఇన్‌స్టాల్ చేసిన యాప్స్ కోసం మీ ఫోన్ను స్కాన్ చేస్తుంది మరియు చైనీయ మూలం ఉన్న యాప్స్  గురించి మీకు తెలియజేస్తుంది. ప్రతి ఆండ్రాయిడ్ స్మార్ట్ ‌ఫోనులో అన్‌ఇన్‌స్టాలర్‌తో అంతర్నిర్మితంగా వస్తుంది, ఇది ఎటువంటి  తర్డ్ పార్టీ  యాప్ డౌన్‌లోడ్ అవసరం లేకుండానే ఆ యాప్స్ తీసివేయడంలో మీకు సహాయపడుతుంది.

Remove China Apps స్కాన్ ప్రారంభించడానికి మరియు అమలు చేయడానికి ఎటువంటి అనుమతి తీసుకోదు. తరచుగా ఉపయోగించే మరియు నమ్మదగిన యాప్స్ ని మాత్రమే డౌన్‌లోడ్ చేయాలని మేము మా పాటకులను సిఫార్సు చేస్తున్నప్పటికీ. Remove China Apps యాప్ షేర్‌ఇట్ మరియు టిక్‌టాక్ వంటి యాప్స్ అన్‌ఇన్‌స్టాల్ చేయాలని వినియోగదారులను సిఫార్సు చేస్తుంది. ఈ రెండూ ప్లే స్టోర్‌లో ఒక బిలియన్ డౌన్‌లోడ్‌లను కలిగి ఉన్నాయి. ఆసక్తికరంగా, టెన్సెంట్ గేమ్స్ చైనా నుండి బయటికి వచ్చినప్పటికీ కూడా ఈ యాప్  PUBG మొబైల్‌ను సాధ్యమైన చైనీస్ యాప్ గా గుర్తించదు.

కాబట్టి, ఎవరైతే చైనా నుండి వచ్చిన యాప్స్ అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకుంటారో ఇది ఆ వినియోగదారుల కాల్(ఇష్టం) . అయితే, తర్డ్   పార్టీ యాప్ తొలగింపు పై ఆధారపడటం కంటే సాధారణ అన్‌ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ ద్వారా వెళ్ళడం మంచిదని మేము మీకు ఇంకా సిఫారసు చేస్తాము  మరియు ఇది ఇబ్బంది లేని మార్గం. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo