Reliance Diwali Dhamaka: రిలయన్స్ డిజిటల్ లో షాపింగ్ చేస్తే 365 రోజులు Jio AirFiber ఉచితంగా ఇస్తుందట.!

Reliance Diwali Dhamaka: 2024 దీపావళి సందర్భంగా రిలయన్స్ గొప్ప ఆఫర్ ను ఒకటి ఈరోజు అనౌన్స్ చేసింది. అదేమిటంటే, ఈ దీపావళి పండుగ సీజన్ లో రిలయన్స్ డిజిటల్ నుంచి షాపింగ్ చేస్తే 365 రోజుల Jio AirFiber ఉచితంగా అందిస్తుందని ప్రకటించింది. దేశంలోని ఏ రిలయన్స్ డిజిటల్ స్టోర్ నుంచి షాపింగ్ చేసినా ఈ ఆఫర్ వర్తిస్తుందట. ఇక్కడిదాకా చదివి వెళ్ళిపోకండి ఈ ఆఫర్ కి కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి అవి కూడా తెలుసుకోండి.

Reliance Diwali Dhamaka:

దసరా మరియు దీపావళి పండుగ సీజన్ వచ్చిందంటే దేశం మొత్తం ఆఫర్ల మోత మోగుతుంది. చిన్న చిన్న స్టోర్స్ మొదలుకొని పెద్ద పెద్ద కంపెనీల వరకు అంతటా దీపావళి ఆఫర్స్ వెల్లివిరుస్తాయి. అందుకే, 2024 ఈ పండుగ సీజన్ కోసం రిలయన్స్ ఈ గొప్ప ఆఫర్ ను ప్రకటించింది.

రిలయన్స్ ప్రకటించిన ఈ ఆఫర్ ప్రకారం, రిలయన్స్ డిజిటల్ లో షాపింగ్ చేస్తే 365 రోజులు Jio AirFiber ఉచితంగా పొందవచ్చు. అయితే, ఈ షాపింగ్ మరియు ఉచిత జియో ఎయిర్ ఫైబర్ ను పొందడానికి కొన్ని కండిషన్స్ ను కూడా పెట్టింది. ఈ కండిషన్ ఫాలో అయ్యే వారికి ఈ AirFiber ఉచితం అంధిస్తుంది.

Also Read: Disney+ Hotstar AI: తక్కువ డేటా తో ఎక్కువ క్లారిటీ స్ట్రీమింగ్ కోసం కొత్త ఫీచర్ తెచ్చింది.! 

ఏమిటి ఆ కండిషన్స్ / అర్హతలు?

ఈ ఆఫర్ పొందడానికి ఏదైనా రిలయన్స్ డిజిటల్ / మై జియో స్టోర్ నుంచి రూ. 20,000 లేదా అంతకు మించి షాపింగ్ చేయాలి లేదా రూ. 2,222 రూపాయల దివాళి ప్లాన్ తో కొత్త ఎయిర్ ఫైబర్ కనెక్షన్ తీసుకోవాలి. ఒకవేళ ఇప్పటికే జియో AirFiber/Fiber వాడుతున్న యూజర్లు అయితే, రూ. 2,222 రూపాయల దివాళి ప్లాన్ తో ONE-TIME అడ్వాన్స్ రీఛార్జ్ చేయాలి. ఈ ఆఫర్ 18 సెప్టెంబర్ 2024 నుంచి 3 నవంబర్ 2024 వరకు మాత్రమే వర్తిస్తుంది.     

ఈ ఆఫర్ ఎలా లభిస్తుంది?

ఈ ఆఫర్ కు అర్హత పొందిన యూజర్లు నవంబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు ప్రతి నెల active AirFiber plan కూపన్ ను అందుకుంటారు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :