Realme స్మార్ట్ వాచ్ హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ లెవల్ మరియు స్మార్ట్ ఫోన్ లింక్ ఫీచర్లతో వచ్చింది

Realme స్మార్ట్ వాచ్ హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ లెవల్ మరియు స్మార్ట్ ఫోన్ లింక్ ఫీచర్లతో వచ్చింది
HIGHLIGHTS

ఈ వాచ్ ధరించినవారి హృదయ స్పందన రేటును రికార్డ్ చేస్తుంది

ఇది IP68 సర్టిఫికేట్ తో వస్తుంది

ఇది బ్లడ్-ఆక్సిజన్-లేవల్ మానిటర్ (SpO2) తో కూడా అమర్చబడి ఉంటుంది

రియల్మి సంస్థ ఇండియాలో సరసమైన మరియు ట్రెండీ స్మార్ట్ ఫోన్లను అందిస్తున్న సంస్థగా అవతరించింది. ఇదే బాటలో నడుస్తూ, కొత్తగా తన టెలివిజన్ సిరీస్ యొక్క రెండు మోడళ్లను భారతదేశంలో ప్రకటించిందిమరియు దీనితో పాటుగా రియల్మి వాచ్ మరియు రియల్మి బడ్స్ ఎయిర్ నియో టిడబ్ల్యుఎస్ ఇయర్‌ బడ్స్ ని కూడా ప్రకటించింది. మంచి ప్రత్యేకతలతో వచ్చినటువంటి, ఈ Realme Watch  యొక్క ఫీచర్లు, ధర మరియు లభ్యత గురించి క్లుప్తంగా చూద్దాం.

Realme Watch: లక్షణాలు మరియు ధర

రియల్మి వాచ్ టచ్ సపోర్ట్‌ కలిగిన 1.4-అంగుళాల డిస్‌ప్లే తో వస్తుంది మరియు రియల్ టైమ్ పర్యవేక్షణ కోసం హృదయ స్పందన (హార్ట్ రేట్ ) సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 2.5D కర్వ్డ్ డిజైన్‌ కలిగి ఉంది మరియు గొరిల్లా గ్లాస్ 3 గ్లాస్ తో అగ్రస్థానంలో ఉంది. ఇది బ్లడ్-ఆక్సిజన్-లేవల్ మానిటర్ (SpO2) తో కూడా అమర్చబడి ఉంటుంది మరియు ఎంచుకోవడానికి 14 ప్రీసెట్ స్పోర్ట్స్ మోల్స్ తో  వస్తుంది. వీటిలో క్రికెట్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, యోగా, రన్నింగ్ మరియు ఇంకా చాలానే ఉన్నాయి.

హృదయ స్పందన సెన్సార్ ప్రతి ఐదు నిమిషాలకు ఈ వాచ్ ధరించినవారి హృదయ స్పందన రేటును రికార్డ్ చేస్తుంది మరియు ఏదైనా ఇబ్బంది లేదా మార్పులు జరిగితే హెచ్చరికలను పంపుతుంది. SpO2 సెన్సార్ రక్త ప్రవాహంలో ఆక్సిజన్ రేటును ట్రాక్ చేస్తుంది. ఇది IP68 సర్టిఫికేట్ తో వస్తుంది. అంటే, ఇది దుమ్ము మరియు నీటి నిరోధకతను కలిగిఉందన్నమాట .

అవుట్-ఆఫ్-ది-బాక్స్, ఈ రియల్మి వాచ్ 12 వాచ్ ఫేస్ ‌లతో వస్తుంది మరియు రియల్మి త్వరలో 11 కి పైగా వాచ్ ఫేస్‌లను OTA అప్‌డేట్స్ ద్వారా జోడిస్తామని హామీ ఇచ్చింది.

ఈ రియల్మి వాచ్ స్లీప్ ట్రాకింగ్, వాటర్ ఇంటెక్ రిమైండర్ మరియు ఐడిల్ అలర్ట్ వంటి మోడ్‌ లకు మద్దతు ఇస్తుంది. ఇది వినియోగదారుడు ఎక్కువసేపు కూర్చునట్లయితే, ఎప్పుడు నడవాలో సూచిస్తుంది. ఇది రియల్మి లింక్ యాప్ ద్వారా మీ స్మార్ట్‌ ఫోన్‌తో జత చేయవచ్చు మరియు ఫేస్‌బుక్, వాట్సాప్, జిమెయిల్ మరియు మరిన్ని యాప్స్ నుండి స్మార్ట్ నోటిఫికేషన్లకు మద్దతు ఇస్తుంది.

రియల్మి యొక్క స్మార్ట్ వాచ్ స్మార్ట్ కనెక్ట్ ఫీచర్‌ను కూడా అందిస్తుంది, ఇది ఈ వాచ్ సహాయంతో మీ ఫోన్‌ ను త్వరగా అన్‌లాక్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను నియంత్రించడానికి కూడా ఉపయోగపడుతుంది మరియు ఫోటోలను  తీయడానికి రిమోట్ కెమెరా షట్టర్‌ను కలిగి ఉంటుంది.

రియల్మి వాచ్‌ను మీకు నచ్చిన ఇతర రంగుల పట్టీతో జత చేయడం ద్వారా మీకు నచ్చినట్లు మార్చుకోవచ్చు. వీటిలో బ్లూ, ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు పట్టీలు ఉన్నాయి, ఇవి ప్రత్యేక అనుబంధంగా లభిస్తాయి.

రియల్మి వాచ్ ధరను భారతదేశంలో రూ .3,999 రూపాయలుగా ప్రకటించింది మరియు జూన్ 5 నుండి రియల్మి ఇండియా స్టోర్, ఫ్లిప్‌కార్ట్ మరియు త్వరలో ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా అమ్మకం చేయనుంది. ఇక జత చేయగల పట్టీలు రూ .499 ధరతో ప్రత్యేక అనుబంధంగా లభిస్తాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo