Realme నుండి టీవీ మరియు స్మార్ట్ వాచ్ మే 25 న విడుదలకానున్నాయి
ఇతర ఉపకరణాలు కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
రియల్‌మి టీవీ మరియు రియల్‌మి వాచ్ లను లాంచ్ గురించి హైలైట్ చేసి రియల్‌మి ఆహ్వానాలను పంపింది. రియల్‌మి టీవీ మరియు రియల్‌మి వాచ్ తో పాటు ఇతర ఉపకరణాలు కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
Surveyటీవీ మరియు వాచ్ యొక్క విడుదల కార్యక్రమం డిజిటల్ లాంచ్ అవుతుందని, 2020 మే 25, సోమవారం మధ్యాహ్నం 12:30 నుండి ఈ కార్యక్రమం మొదలవుతుందని రియల్‌మి హైలైట్ చేసింది. ట్విట్టర్, ఫేస్బుక్ మరియు యూట్యూబ్ లో ఈ రెండు పరికరాల లాంచ్ ను వినియోగదారులు నేరుగా చూడవచ్చు.
రియల్‌మి ప్రకారం, ఈ బ్రాండ్ "ప్రపంచవ్యాప్తంగా 35 మిలియన్ల వినియోగదారులను సంపాదించే ప్రధాన మైలురాయిని తాకింది, అందులో 21 మిలియన్ల వినియోగదారులు భారతదేశంలో ఉన్నారు". కాబట్టి భారతదేశం వారికి చాలా ముఖ్యమైన మార్కెట్ అని స్పష్టమవుతుంది. టీవీల విభాగంలో వారు ఎంత బాగా పోటీ పడుతున్నారో మనం టీవీని చెక్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. ఇంటర్నెట్ లో వస్తున్న సమాచారం నిజమైతే, ఈ టీవీలు రెండు స్క్రీన్ సైజుల్లో రావచ్చు అవి – 32 మరియు 43-అంగుళాలు. అయితే, టీవీ యొక్క ఫీచర్లు మాత్రం ఇంకా తెలియలేదు. ఈ టీవీ నెట్‌ఫ్లిక్స్‌కు మద్దతుగా ఇచ్చే ఆండ్రాయిడ్ టీవీ UI లో నడుస్తుందని ఉహించబడింది. ఈ టీవీ HDR 4 K రిజల్యూషన్‌కు మద్దతు ఇస్తుందో లేదో చూడాలి.