హైదరాబాద్ ఆధారిత స్టార్ట్ అప్ కంపెనీ Pure EV తీసుకువచ్చిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ Etrance Neo మంచి ఫీచర్లను కలిగివుంది. Ola S1 మరియు TVS i Cube వంటి ఎలక్ట్రిక్ స్కూటీలకు దీటుగా ఈ Etrance Neo ఉంటుంది. లేటెస్ట్ గా Pure EV మార్కెట్లోకి తీసుకువచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆరు అందమైన కలర్ అప్షన్స్ మరియు స్టైలిష్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది.
ఎట్రాన్స్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ లుక్స్ పరంగా అద్భుతంగా కనిపిస్తుంది. అయితే, ఫీచర్ల పరంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దాదాపుగా Ola S1 మరియు TVS i Cube వంటి ఫీచర్లనే కలిగి ఉంటుంది. కానీ, ధర విషయంలో ఎట్రాన్స్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ మిగిలిన వాటికంటే చాలా సరసమైనదిగా ఉంటుంది. అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సరసమైన ధరలో సొగసైన డిజైన్ తో ఆకట్టుకుంటుంది.
Pure EV ఈ ఎట్రాన్స్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ ని రూ.78,999 (Ex-Showroom) ధరతో ప్రకటించింది. అయితే, Ola S1 మరియు TVS i Cube ధరలు ఇంచుమించు 1 లక్ష రూపాయల వరకూ ఉన్నాయి.
Pure EV అందించిన స్పెక్స్ షీట్ ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 90-120 Km వరకూ ప్రయాణించ గలదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 60 KM వరకూ వేగాన్ని అందుకోగలదని కూడా కంపెనీ వెల్లడించింది. ఈ స్కూటర్ కేవలం 5 సెకన్లలో 0KM నుండి 40KM వరకూ వేగాన్ని అందుకోగలదు.