ఈరోజు నుండి మొదలైన PUBG రాయల్ పాస్ సీజన్ 13

HIGHLIGHTS

మరింత ఉత్కంఠత రేకెత్తించేలా రూపొందించబడింది.

ఈరోజు నుండి మొదలైన PUBG రాయల్ పాస్ సీజన్ 13

PUBG మొబైల్ గత వారం 0.18.0 వెర్షన్ను విడుదల చేసింది. కానీ, సీజన్ 13 రాయల్ పాస్ మాత్రం లాంచ్ చేయ్యలేదు. అయితే, పాస్ కోసం ఎదురుచూస్తున్న ఆటగాళ్ళ కోసం ఎక్కువ కాలం గడవకుండానే, మే 13 నుండి అంటే ఈరోజు నుండి అందుబాటులోకి తెచ్చింది. ఈ సీజన్‌లో ‘టాయ్ ప్లేగ్రౌండ్’ థీమ్ ఉంది మరియు ఇది మరింత ఉత్కంఠత రేకెత్తించేలా రూపొందించబడింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

PUBG మొబైల్ యొక్క రాయల్ పాస్ యొక్క 13 వ సీజన్లో, ఆటగాళ్ళు ‘టాయ్ స్క్వాడ్ ’ లో చేరడానికి ‘కార్టన్ రేంజర్స్’ తెరవబడుతుంది. వారు 50 వ ర్యాంకును చేరుకున్న తర్వాత, ప్లేయర్లు ఐస్ రేంజర్ లేదా ఫైర్ రేంజర్ లో కావల్సినది ఎంచుకోవాలి. ఇక ప్లేయర్లు ర్యాంక్ 100 కి చేరుకుంటే, వారికి అల్ట్రా డిఫెండర్ సెట్ లభిస్తుంది. ఈ సెట్లన్నీ ప్రముఖ మైటీ మార్ఫిన్ పవర్ రేంజర్స్ పై ఆధారపడి ఉన్నాయి. అనేక ప్రత్యేకమైన మరియు అరుదైన వస్తువులను అన్‌లాక్ చేయడానికి ప్లేయర్స్  గేమ్ -ఛాలంజ్ లను పూర్తి చెయ్యాల్సి ఉంటుంది.

రాయల్ పాస్ సీజన్ 13 యొక్క ఇతర న్యూ ఫీచర్లలో పప్పెట్ ఏజెంట్ డ్రెస్ లో మూడు వేర్వేరు రూపాలు ఉన్నాయి. వీటిని తరువాత కలపవచ్చు మరియు సరిపోల్చవచ్చు. ఇంకా, అత్యధిక ర్యాంకు చేరుకున్న ప్లేయర్స్ ఆ దుస్తులను అప్‌గ్రేడ్ చేయవచ్చు. టాయ్ మాస్టరీ మరియు పప్పెట్ ఏజెంట్ సిరీస్ స్పెషల్ మిషన్లను పూర్తి చేయడం ద్వారా ఆటగాళ్ళు తమ డ్రెస్ లను అప్డేట్ చెయ్యడానికి అన్‌లాక్ చేయగల కొత్త ఛాలెంజ్ సిరీస్ కూడా ఉంది. దీని పైన, రిజల్ట్ పేజీలోని అన్ని RP మిషన్ రిమైండర్‌లు ఆటగాళ్లకు వారి మిషన్ పురోగతిని సులభంగా చూడటానికి ఇవ్వబడ్డాయి. ఇంకా, డెవలపర్లు ఈ సీజన్ ప్రారంభం మరియు ముగింపు గురించిన రిమైండర్ ‌లను కూడా జోడించారు.

PUBG మొబైల్ v0.18.0 వెర్షన్ లో కొత్త అప్డేట్స్ మరియు ఫీచర్లను పరిచయం చేసింది. ఇందులో మిరామార్ మ్యాప్ యొక్క కొత్త వెర్షన్, అంతర్నిర్మిత పరిధి కలిగిన విన్ 94 వంటి కొన్ని కొత్త ఆయుధాలు మరియు P90 SMG  ఉన్నాయి. జంగిల్ అడ్వెంచర్ గైడ్ మరియు బ్లూహోల్ మోడ్ వంటి కొత్త గేమ్ మోడ్‌లు కూడా ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo