గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్: PUBG New State వచ్చేసింది..!

Updated on 11-Nov-2021
HIGHLIGHTS

PUBG New State ఈరోజు ఇండియాలో ప్రారంభించబడింది

నెక్స్ట్ జెనరేషన్ బ్యాటిల్ రాయల్ గేమ్

ఈ గేమ్ 40 మిలియన్స్ కంటే ఎక్కువ Pre-Registrations సాధించింది

క్రాఫ్టన్ యొక్క PUBG New State ఈరోజు ఇండియాలో ప్రారంభించబడింది. Krafton మరియు PUBG Studios సంయుక్తంగా తీసుకొచ్చిన ఈ నెక్స్ట్ జెనరేషన్ బ్యాటిల్ రాయల్ గేమ్ ను ప్రారంభించాయి. ఈ గేమ్ ను గూగుల్ ప్లేస్టోర్ నుండి ఆండ్రాయిడ్ యూజర్లు సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. విడుదల కంటే ముందే ఈ గేమ్ 40 మిలియన్స్ కంటే ఎక్కువ Pre-Registrations సాధించింది. ప్రపంచప్రఖ్యాతి గాంచిన ఈ గేమ్ ఇప్పుడు ఇండియాలో కూడా లాంచ్ చెయ్యబడింది.

PUBG New State గేమ్ లో Troi అని పిలువబడే కొత్త బ్యాటిల్ గ్రౌండ్ ను అందించింది. ఇది అధునాతన ఆయుధాలతో నిండిన 8Km X 8Km మ్యాప్. పబ్ జి న్యూ స్టేట్ తో మొబైల్ గేమింగ్‌కి కొత్త రూపు వచ్చింది. అంతేకాదు, గ్లోబల్ ఇల్యూమినేషన్ టెక్నాలజీతో చూడబోయే వాస్తవిక గ్రాఫిక్‌లను కూడా పొందబోతున్నారు.

ఈ గేమ్ ఇప్పుడు ఆండ్రాయిడ్ మరియు iOS ఫోన్లకు అందుబాటులో వుంది. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు ఫోన్ లేదా డివైజ్ ను బట్టి దీని పరిమాణం వేరువేరు సైజులలో ఉంటుంది. ఉదారణకు: స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ తో పీపనిచేసే ఫోన్లలో దీని పరిమాణం 1.67GB గా ఉంటుంది. ఇక మీరు iOS ప్లాట్‌ఫారమ్‌ డివైజెస్ కలిగి ఉంటే దీని డౌన్‌లోడ్ పరిమాణం దాదాపు 1.2GB గా ఉండవచ్చు. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :