PREMIUM AV నుండి 7 పోర్ట్ USB అడాప్టర్ : ధర కేవలం రూ. 235 మాత్రమే

Updated on 30-Aug-2019
HIGHLIGHTS

విండోస్, మాక్ మరియు Linux వంటి మల్టి OS లకు కూడా ఇది అనుకూలిస్తుంది.

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా మొబైల్ ను వాడుతున్నారు. ఒక్కొక్కసారి అన్ని ఫోన్లు కూడా ఒకే సారి ఛార్జింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అటువంటప్పుడు, అందరూ కూడా వారి చార్జర్లను ఒకేసారి పెట్టడానికి తంటాలు పడుతుంటారు. అటువంటి అవసరం లేకుండా పూర్తి ఫ్యామిలీ ఒకేసారి చేసుకునేందుకు సరిపోయేటన్ని పోర్టులతో PREMIUM AV సంస్థ,  ఒక అడాప్టర్ ను తీసుకొచ్చింది.

PREMIUM AV  7 పోర్ట్ USB : ప్రత్యేకతలు

PREMIUM AV యొక్క ఈ 7 పోర్ట్ USB అడాప్టర్ ఒకేసారి 7 డివైజులను ఛార్జ్ చేసుకునేలా ఉంటుంది. ఎందుకంటే, ఇందులో 7 USB పోర్టులను అందించింది. ఇక ఈ అడాప్టర్ పవర్ ఫుల్, స్థిరమైన మరియు నమ్మకమైన పనితాన్ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే, విండోస్, మాక్  మరియు Linux వంటి మల్టి OS లకు కూడా ఇది అనుకూలిస్తుంది.

అధనంగా, ఇది గరిష్టంగా 5Gbps వేగంతో డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఇక USB 2.0 (480Mbps) హై స్పీడ్, USB 2.0 ఫుల్ స్పీడ్ (12Mbps) వాటి ప్రత్యేకతలతో ఉంటుంది. అలాగే, సేఫ్టి విషయానికి వస్తే, మీ డివైజెస్ కు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉండేలా, ఇందులో ఓవర్ ఛార్జింగ్ ప్రొటక్షన్ , ఓవర్ కరెంట్ ప్రొటక్షన్ మరియు షార్ట్ సర్క్యూట్ ప్రొటక్షన్ వంటి జాగ్రత్తలు అందించింది. ఈ ప్రోడక్ట్ అమేజాన్ ఇండియా ద్వారా అమ్మకాలను చేయనుంది. కొనుగోలు చేయదలచినవారు ఈ LINK పైన నొక్కడం ద్వారా నేరుగా కొనవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :