ఎయిర్ పొల్యూషన్ కచ్చితంగా చూపించే PM 2.5 పాకెట్ మోనిటర్ లాంచ్

Updated on 13-Sep-2019
HIGHLIGHTS

మనం పీలుస్తున్న గాలి స్వచ్ఛమైనడా లేదా విషపురితమైనదా అని మనకు తెలియచేస్తుంది.

మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్న మాట మరియు అనుభవిస్తున్న సమస్య ఎయిర్ పొల్యూషన్. ముందుగా, సిటీలకు మాత్రమే ఈ ప్రమాదం ఎక్కువగా ఉండగా ఇప్పుడు అనుసరిస్తున్న జీవన విధానాలతో ఇది పల్లెలకు కూడా వర్తిస్తోంది. ముఖ్యముగా, వాహనాలు, ఫ్యాక్టరీలు మరియు అనేక ఇతరత్రా కారణాల వలన మన చుట్టుపక్కల వుండే గాలి చాల కలుషితంగా మారుతోంది.

దీన్ని గురించిన సరైనా సమాచారాన్ని తెలుసుకోవడానికి, Prana Air ఒక సరికొత్త పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే, ఈ  PM 2.5 పాకెట్ మోనిటర్ పరికరం. ఇది మన చుట్టుపక్కల వున్నా వాతావరణంలోని పార్టికల్ మ్యాటర్ 2.5 ని త్వరగా గుర్తించి, మనం పీలుస్తున్న గాలి  స్వచ్ఛమైనడా లేదా విషపురితమైనదా అని మనకు తెలియచేస్తుంది.

ఈ పరికరం, ఒక LCD డిస్ప్లేతో వస్తుంది. తద్వారా మీకు అందించే సమాచారం, ఈ స్క్రీన్ పైన కనిపిస్తుంది. అలాగే, ఇది ఒక 400mAh బ్యాటరీతో మీకు ఒక నాలుగు గంటల పాటు నిరాఘంటంగా గాలి యొక్క సమాచారాన్ని నిజ సమయంలో అందిస్తుంది. దీన్ని ఛార్జ్ చేయడనికి ఒక USB ఛార్జింగ్ కూడా అందిస్తుంది. ఈ పరికరాన్ని పూర్తిగా ఛార్జ్ చేయడనికి 1 గంట సమయం పడుతుంది. అయితే, దీని ధరను మాత్రం రూ. 2,990 రూపాయలుగా ప్రకటించింది.                                                      

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :