డెడ్ లైన్ లోపుగా PAN – Aadhaar Link తప్పనిసరి.. లేదంటే పాన్ కార్డు చెల్లదు.!

Updated on 09-Dec-2025
HIGHLIGHTS

ప్రతి ఒక్కరు కూడా వారి పాన్ కార్డును ఆధార్ నంబర్‌తో లింక్ చేయడం తప్పనిసరి చేసింది

ప్రభుత్వం విధించిన డెడ్‌ లైన్‌కు ముందు పాన్ మరియు ఆధార్ లింక్ చేయకపోతే వారి పాన్ కార్డ్ ఇన్ యాక్టివ్ అవుతుంది

ప్రభుత్వం విధించిన గడువు లోపు మీ పాన్ మరియు ఆధార్ లింక్ చేయడం మంచిది

PAN – Aadhaar Link: భారత ప్రభుత్వం టాక్స్ సంబంధిత వ్యవస్థను మరింత పారదర్శకంగా మరియు సురక్షితంగా మార్చడానికి ప్రతి ఒక్కరు కూడా వారి పాన్ కార్డును ఆధార్ నంబర్‌తో లింక్ చేయడం తప్పనిసరి చేసింది. అంతేకాదు, ప్రభుత్వం విధించిన డెడ్‌ లైన్‌కు ముందు పాన్ మరియు ఆధార్ లింక్ చేయకపోతే వారి పాన్ కార్డ్ ఇన్ యాక్టివ్ అవుతుంది. ఇలా మీ పాన్ కార్డ్ ఇన్ యాక్టివ్ అయితే మీ బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్, IT రిటర్న్స్ ఫైలింగ్ మరియు TDS ప్రాసెసింగ్ వంటి అనేక సేవలు ప్రభావితం అవుతాయి. అందుకే, ప్రభుత్వం విధించిన గడువు లోపు మీ పాన్ మరియు ఆధార్ లింక్ చేయడం మంచిది.

మీ పాన్ మరియు ఆధార్ కార్డ్ లింక్ అయింది లేనిది ముందుగా చెక్ చేసుకోండి. మీరు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ incometax.gov.in నుంచి ఈజింగ్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఈ వెబ్సైట్ మెయిన్ పేజ్ లో ఉన్న Quick Links బాక్స్ అడుగున ఉన్న లింక్ ఆధార్ స్టేటస్ ట్యాబ్ పై క్లిక్ చేసి, వచ్చిన కొత్త పేజీలో పాన్ మరియు ఆధార్ నెంబర్ వివరాలు అందించి వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ పై క్లిక్ చేయండి. అంతే, వెంటనే మీ పాన్ మరియు ఆధార్ లింక్ అయిందో లేదో వెంటనే స్క్రీన్ పై చూపిస్తుంది.

ఒకవేళ మీ పాన్ మరియు ఆధార్ లింక్ అవ్వకపోతే, మీరు మీ ఆధార్ మరియు పాన్ లింక్ చేయడానికి Income Tax Portal‌ లోని సదుపాయాన్ని ఉపయోగించవచ్చు. దీనికోసం Quick Links బాక్స్ అడుగున ఉన్న “Link Aadhaar” బటన్ పై క్లిక్ చేయండి. తర్వాత ఇక్క వచ్చిన బాక్స్ లో అడిగిన వద్ద మీ పాన్ మరియు ఆధార్ కార్డు ఎంటర్ చేసి వాలిడేట్ చేయండి. తర్వాత ఆధార్ ఉన్న మీ పేరు మరియు మొబైల్ నెంబర్ వివరాలు అందించి ఎంటర్ సబ్మిట్ చేయండి. ఇప్పుడు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు OTP నెంబర్ వస్తుంది. మీరు అందుకున్న OTP నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేయండి.

అయితే, ఇక్కడ మీరు ఈ ఆధార్ పాన్ లింక్ ను ఉచితంగా నిర్వహించ లేరు. ఎందుకంటే, ప్రస్తుతం పాన్ మరియు ఆధార్ కోసం రూ. 1,000 రూపాయల లేటు ఫీజు చెల్లించాలి. ఈ ఫీజు చెల్లించి ఈ పూర్తి లింకింగ్ ప్రొసెస్ పూర్తి చేయాలి. చేసిన మూడు నాలుగు రోజులో ఈ ప్రక్రియ పూర్తి అయ్యిందో లేదో చెక్ చేయాలి. అంటే, పాన్ ఆధార్ అయ్యిందో లేదో చెక్ చేయడానికి పైన తెలిపిన విధంగా పాన్ ఆధార్ స్టేటస్ చెక్ చేయండి.

Also Read: Realme Narzo 90 Series 5G నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ చేస్తున్న రియల్ మీ.!

ఇది చాలా సింపుల్ మరియు ఫాస్ట్ గా అయిపోతుంది. అయితే, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, ఈ ఆధార్ మరియు పాన్ కార్డు లో ఉన్న వివరాలలో ఏమైనా తప్పులు ఉంటే ఆధార్ మరియు పాన్ లింక్ జరగదు. ఇలా ఉంటే మీ ఆధార్ లేదా పాన్ వివరాలు ముందుగా సరి చేసుకుని ఆ తర్వాత మాత్రమే లింక్ ప్రోసెస్ చేయాలి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :