గూగుల్ క్రోమ్ కి పోటీగా ChatGPT Atlas బ్రౌజర్ తెచ్చిన openAI కంపెనీ.!

Updated on 22-Oct-2025
HIGHLIGHTS

గూగుల్ క్రోమ్ కి పోటీగా openAI కంపెనీ ChatGPT Atlas ని అనౌన్స్ చేసింది

చాట్ జిపిటి ఆధారితంగా గొప్ప బ్రౌజింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని ఓపెన్ ఎఐ తెలిపింది

ఇంటెలిజెంట్ గా అందించేలా ఈ కొత్త బ్రౌజర్ ని క్రియేట్ చేసినట్లు కూడా ఓపెన్ ఎఐ పేర్కొంది

ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ యొక్క అతిపెద్ద ఆవిష్కరణ గూగుల్ క్రోమ్ కి పోటీగా openAI కంపెనీ ChatGPT Atlas ని అనౌన్స్ చేసింది. ఈ కొత్త బ్రౌజర్ చాట్ జిపిటి ఆధారితంగా గొప్ప బ్రౌజింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని ఓపెన్ ఎఐ తెలిపింది. బ్రౌజింగ్ ని మరింత కన్వీనియంట్ గా మరియు ఇంటెలిజెంట్ గా అందించేలా ఈ కొత్త బ్రౌజర్ ని క్రియేట్ చేసినట్లు కూడా ఓపెన్ ఎఐ పేర్కొంది.

ChatGPT Atlas ఏమిటి?

ఇప్పటి వరకు కేవలం యాప్ మరియు వెబ్సైట్ ద్వారా మాత్రమే అందుబాటులో వున్న చాట్ జిపిటి ఇప్పుడు వెబ్ బ్రౌజర్ గా అవతరించింది. ఈ కొత్త వెబ్ బ్రౌజర్ ను చాట్ జిపిటి అట్లాస్ గా ఓపెన్ ఎఐ పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ కొత్త వెబ్ బ్రౌజర్ చాట్ జిపిటి అట్లాస్ కేవలం macOS కోసం మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. అయితే, త్వరలోనే ఈ వెబ్ బ్రౌజర్ విండోస్, iOS మరియు ఆండ్రాయిడ్ OS లకు కూడా అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది.

ChatGPT Atlas ఫీచర్స్ ఏమిటి?

ఈ కొత్త వెబ్ బ్రౌజర్ చాట్ జిపిటి అట్లాస్ ఫీచర్స్ విషయానికి వస్తే, అన్నింటిని సమాధానం అందించే ప్రత్యేకమైన సైడ్ బార్ తో వస్తుంది. ఇది సమరైజ్, కంపేర్ మరియు అనలైజ్ వంటి వాటికీ నేరుగా అవకాశం కల్పిస్తుంది. దీనితో పాటు Agent Mode ఫీచర్ కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ తో మీరు చాట్ జిపిటి మాదిరి ప్రివ్యూ మాదిరిగా ఉంటుంది. అంటే, మీరు వెబ్ బ్రౌజర్ లో సూచించిన వాటికి చాట్ జిపిటి యాక్షన్ తీసుకుంటుంది.

చాట్ జిపిటి అట్లాస్ వెబ్ బ్రౌజర్ లో ప్రత్యేకమైన బ్రౌజర్ మెమరీ కూడా ఉంటుంది. ఈ ఫీచర్ ని ఎనేబుల్ చేసుకునే వారికి ముందుగా చూసిన వాటిని తిరిగి దర్శించడానికి మెమరీ సేవ్ చేసుకుంటుంది. అంటే, ఇటీవల చూసిన బ్రౌజింగ్ వివరాలు గుర్తుంచుకుని అడిగిన వెంటనే తిరిగి అందిస్తుంది.

Also Read: Netflix Plans Price Cut: బేసిక్ ప్లాన్ రేట్లు తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్న కొత్త రిపోర్ట్.!

ఈ కొత్త వెబ్ బ్రౌజర్ చాట్ జిపిటి అట్లాస్ ప్రైవసీ మరియు డేటా కంట్రోల్ విషయంలో కస్టమైజ్ కంట్రోల్స్ అందిస్తుందిట. అంటే, మీరు మీరు వెతికే లేదా చూసే సైట్స్ లేదా డేటాని బ్రౌజర్ లేదా చాట్ జిపిటి ఎంత వరకు పరిశీలించునో కూడా మీరే సెట్ చేసుకునే అవకాశం ఉంటుందట. అయితే, వీటిలో కొన్ని ఫీచర్స్ మరియు మరిన్ని ఫీచర్స్ ఇంకా టెస్టింగ్ దశలో ఉన్నాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :