జబర్దస్త్ అఫర్: OnePlus లేటెస్ట్ 5G ఫోన్ రూ.17,999 కే అందుకోండి.!

Updated on 21-Jun-2022
HIGHLIGHTS

ప్లస్ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ అఫర్ తో లభిస్తోంది

వన్ ప్లస్ లేటెస్ట్ గా విడుదల చేసిన స్మార్ట్ ఫోన్

64MP EIS ట్రిపుల్ కెమెరా మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

అమెజాన్ మాన్సూన్ కార్నివాల్ సేల్ నుండి వన్ ప్లస్ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ అఫర్ తో లభిస్తోంది. అదే, OnePlus Nord CE 2 Lite 5G స్మార్ట్ ఫోన్ మరియు అమెజాన్ నుండి ఈరోజు బిగ్ బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ తో లభిస్తోంది. వన్ ప్లస్ లేటెస్ట్ గా ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ మంచి ఫీచర్లతో ఆకట్టుకునే ధరలో వచ్చింది. ఈ ఫోన్ ఆకర్షణనీయమైన డిజైన్, 64MP EIS ట్రిపుల్ కెమెరా మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి మరిన్ని ఫీచర్లను కలిగివుంది.

OnePlus Nord CE 2 Lite 5G: ధర

వన్ ప్లస్ నార్డ్ CE 2 లైట్ 5జి రెండు వేరియంట్లలో లభిస్తుంది. అలాగే, బహామా బ్లూ మరియు గ్రే మిర్రర్ అనే రెండు కలర్లలో లభిస్తుంది.  Buy From Here

1. OnePlus Nord CE 2 Lite 5G :  (6GB + 128GB) – రూ.19,999

2. OnePlus Nord CE 2 Lite 5G:  (8GB + 128GB) – రూ.21,999

ఈ స్మార్ట్ ఫోన్ ను ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 2,000 రూపాయల తక్షణ డిస్కౌంట్ ను లభిస్తుంది. అంటే, ఈ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ ను కేవలం రూ.17,999 రూపాయలకే అందుకోవచ్చు. 

         

OnePlus Nord CE 2 Lite 5G : స్పెషిఫికేషన్స్

వన్ ప్లస్ యొక్క ఈ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.59 ఇంచ్ FHD+ రిజల్యూషన్ LCD డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ 5G ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 695 ఆక్టా కోర్ ప్రొసెసర్ తో పనిచేస్తుంది మరియు జతగా 8GB ర్యామ్ మరియు 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వుంది.

ఆప్టిక్స్ విభాగానికి వస్తే, ఈ లేటెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్పు తో వచ్చింది. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ లో EIS సపోర్ట్ కలిగిన 64MP ప్రధాన కెమెరా, 2MPడెప్త్ మరియు మ్యాక్రో లెన్స్ ని కలిగి వుంటుంది. ముందుభాగంలో 16MP SonyIMX471 సెల్ఫీ కెమెరాని ఇచ్చింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితమైన కలర్ OS తో నడుస్తుంది.  ఈ స్మార్ట్ ఫోన్ 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000mAh బ్యాటరీతో వస్తుంది.   

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :