మీకు ఇష్టమైన 3D Avatar ను మీ Facebook మరియు Instagram అకౌంట్స్ కు క్రియేట్ చేయవచ్చు..!!

Updated on 27-May-2022
HIGHLIGHTS

మార్కెట్ కాంపిటేషన్ కు తగ్గట్టుగా Meta రియాక్షన్ ఆప్షన్‌ లను మరింతగా పెంచుతోంది

భారతదేశం వంటి బిగ్ మార్కెట్ తో సహా ప్రపంచవ్యాప్తంగా 3D Avatar లను విడుదల చేసింది

మీ 3D అవతార్‌ను ఎలా క్రియేట్ చెయ్యాలో తెలుసుకోండి

మార్కెట్ కాంపిటేషన్ కు తగ్గట్టుగా Meta, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మరియు FB మెసెంజర్‌లో రియాక్షన్ ఆప్షన్‌ లను మరింతగా పెంచుతోంది. దీనికోసం, భారతదేశం వంటి బిగ్ మార్కెట్ తో సహా ప్రపంచవ్యాప్తంగా 3D Avatar లను విడుదల చేసింది. Meta యొక్క కొత్త అవతార్ లను మీరు  స్టిక్కర్స్, GIFs, ఫీడ్ పోస్ట్‌లు, వీడియో Reels మొదలైనవిగా షేర్ చేయవచ్చు. మీరు Facebook యూజర్ అయితే, మీరు మీ కొత్త అవతార్‌ను ప్రొఫైల్ ఫోటో గా కూడా సెట్ చేయవచ్చు.

మరి ఈ కొత్త 3D అవతార్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందామా. ఇది  చాలా కష్టమైన పనేమీ కాదు, కానీ మీకు మరింత సులభంగా అరమయ్యేలా చెప్పడానికి వీలుగా ప్రతి విషయాన్ని స్టెప్ బై స్టెప్ వివరంగా అందిస్తాను. మరింకెందుకు ఆలశ్యం, మీ 3D అవతార్‌ను ఎలా క్రియేట్ చెయ్యాలో చూద్దామా.

3D Avatar ని ఎలా క్రియేట్ చెయ్యాలి?

  • ముందుగా మీ 3D Avatar ని Instagram లో ఎలా క్రియేట్ చెయ్యాలో చూద్దాం.
  • Instagram సెట్టింగ్‌ లకు వెళ్లండి
  • అకౌంట్ ను ఎంచుకోండి
  • మీ అవతార్ ను ఎంచుకోండి
  • మీరు ఫీచర్ యొక్క చిన్నవివరణను చూస్తారు. మెటా ఈ 3D అవతార్‌లను "A new way to be you on Instagram" అని పిలుస్తుంది.
  • తరువాత ‘Get Started' పైన నొక్కండి
  • తర్వాత మీ స్కిన్ టోన్‌ని ఎంచుకోండి
  • ఇప్పుడు, మీరు మీకు ఇష్టమైన జుట్టు రంగు, బాడీ రకం, ముఖ ఆకృతి, జుట్టు, మరియు దుస్తులు మొదలైనవాటిని ఎంచుకోవచ్చు.
  • మీకు కావలసిన విధంగా అన్ని అప్షన్ లను ఎంచుకున్న తర్వాత, Done పైన నొక్కండి

అంతే, ఇక మీ 3D Avatar రెడీ అయిపొయింది. ఇక మీకు మీకు కావాల్సిన వారికీ షేర్ చెయవచ్చు.

మీ 3D Avatar ని Facebook లో ఎలా క్రియేట్ చెయ్యాలో చూద్దాం

  • ఫేస్ బుక్ లో అయితే ముందుగా Menu అప్షన్ పైన క్లిక్ చేయండి
  • తరువాత షార్ట్ కట్ లిస్ట్ లో మీకు అవతార్ కనిపిస్తుంది
  • ఇక తరువాత అవతార్ ప్రాసెస్ అంతా కూడా పైన Instagram 3D Avatar మాదిరిగానే చెయ్యాలి.

తెలుసుకున్నారు కదా మీ ఫేస్ బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ లో మీకు నచ్చిన 3D Avatar ను ఎలా క్రియేట్ చెయ్యాలో. ఇంకేందుకు ఆలశ్యం మీ అవతార్ క్రియేట్ తో మీ స్నేహితులను సర్ప్రైజ్ చేయండి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :