nothing gallery 20 ai photo editor launch features
Nothing Phone 3 లాంచ్ ముందు Nothing Gallery 2.0 సూపర్ ఫీచర్ ను నథింగ్ రిలీజ్ చేసింది. ఈ కొత్త ఫీచర్ ను Nothing OS 3.0 తో జతగా అందించింది మరియు ఇది నథింగ్ ద్వారా నిర్మించబడిన మొదటి గ్యాలరీ యాప్ కూడా అవుతుంది. నథింగ్ గ్యాలరీ 2.0 గూగుల్ ఫొటోస్ కి ప్రత్యామ్నాయ యాప్ గా ఉంటుంది. అంతేకాదు, కొన్ని విషయాల్లో గూగుల్ ఫోటోస్ కి సైతం పోటీనిచ్చేలా ఉంటుంది.
నథింగ్ గ్యాలరీ ఇప్పుడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. నథింగ్ గ్యాలరీ 2.0 ఇప్పుడు కేవలం గ్యాలరీ మాత్రమే కాదని ఇది యూజర్ కోసం ఆల్ ఇన్ వన్ ప్లే గ్రౌండ్ గా మారిందని న నథింగ్ చెబుతోంది. ఇప్పటి వరకు మీడియా కోసం సింపుల్ యాప్ గా ఉన్న నథింగ్ గ్యాలరీ ఇప్పుడు బిల్ట్ ఇన్ ఎడిటింగ్ టూల్స్ తో కూడా వస్తుంది.
నథింగ్ గ్యాలరీ కొత్త అప్డేట్ ద్వారా యాప్ లో ఇంటిగ్రేటెడ్ ఎడిటింగ్ టూల్స్ జత చేసింది. ఈ కొత్త టూల్స్ ద్వారా ఫోటోలు క్రాప్, రొటేట్, ఫ్లిప్ మరియు స్ట్రెచ్ వంటి వాటిని చాలా ఖచ్చితంగా చేసుకునే వీలుంటుంది. అంతేకాదు, ఫోటోలు మరింత నాణ్యమైన వాటిగా రూపొందించుకోవడానికి లేదా సరి చేసుకోవడానికి వీలుగా 12 రకాల సర్దుబాటు పెరామీటర్ లను కూడా అందించింది.
ఇందులో, ఎక్స్ పోజర్, కాంట్రాస్ట్, శాచ్యురేషన్, బ్రైట్నెస్, వామర్థ్, షాడో, హైలెట్ వంటి మరిన్ని ఉన్నాయి. మరింత గొప్ప విషయం ఏమిటంటే ఇప్పుడు ఎటువంటి థర్డ్ పార్టీ యాప్ అవసరం లేకుండా ఫోటో ఎడిటింగ్ ను నథింగ్ ఫోన్ లలో నేరుగా నిర్వహించడానికి వీలుంటుంది.
Also Read: OPPO K13x 5G Sale: ఒక్కరోజు డిస్కౌంట్ ఆఫర్ తో ఫస్ట్ సేల్ రేపు స్టార్ట్ అవుతుంది.!
ఫోటో సరే వీడియో ఎడిటింగ్ మాటేమిటి? అని డౌట్ మీకు రావచ్చు. అవును, వీడియో ఎడిటింగ్ కోసం కూడా కొత్త ఫీచర్స్ అందించింది. వీడియో ఎడిటింగ్ కోసం కోసం గ్యాలరీ యాప్ లో ట్రిమ్ క్లిప్స్, ట్వీక్ ఆడియో లెవెల్స్ మరియు రీ సెలెక్ట్ slow-motion సెగ్మెంట్ వంటి మరిన్ని ఫీచర్స్ కూడా అందించింది. అంతేకాదు, AI సపోర్టెడ్ ఫీచర్ కూడా ఇందులో జత చేసే అవకాశం ఉంటుంది.
ఇండియన్ మార్కెట్లో నథింగ్ మంచి యూజర్ బేస్ ను సంపాదించుకుంది. అయితే, ఫోటో మరియు వీడియో ఎడిటింగ్ కోసం ఫోన్ లో సరైన యాప్ లేకపోవడం చిన్న లోటుగా ఉండిపోయింది. అయితే, నథింగ్ ఈ యాప్ తో ఈ గ్యాప్ ను కూడా భర్తీ చేసింది. కొత్త వెర్షన్ 2.0.9.0623 అప్డేట్ తో ఈ ఫీచర్ అందిస్తుంది.